OTT Movies: ఈవారం రిలీజ్ కాబోతున్న ఆసక్తికరమైన సినిమాలు.. అందరి ఫోకస్ ఆ యాక్షన్ మూవీస్ పైనే!
ప్రస్తుతం బిగ్ స్క్రీన్ తో పాటు డిజిటల్ ఎంటర్టైన్మెంట్ కూడా ప్రేక్షకులకి కావాల్సినంత వినోదాన్ని అందిస్తున్న సంగతి తెలిసిందే. ఓ విధంగా చెప్పాలంటే థియేటర్స్ లో ఎంటర్టైన్మెంట్ కంటే డిజిటల్ ఎంటర్టైన్మెంట్ ని ఎక్కువ మంది ఇళ్ళల్లో కూర్చొని మరీ ఆశ్వాదిస్తున్నారు. ఈ నేపధ్యంలో ఇప్పుడు సినిమాలతో పాటు వెబ్ సిరీస్ లు సందడి కూడా మొదలైంది. డిఫరెంట్ కథలతో వెబ్ సిరీస్ లని ప్రేక్షకుల ముందుకి తీసుకొస్తున్నారు. అలాగే సినిమాలు కూడా కొన్ని నేరుగా ఒటీటీలో రిలీజ్ అవుతున్నాయి.
అలాగే కొన్ని సినిమాలు థియేటర్స్ లో రిలీజ్ అయిన రెండు, మూడు వారాల్లోనే ఒటీటీలోకి వచ్చేస్తున్నాయి. ఆ సినిమా సక్సెస్ బట్టి ఒటీటీలోకి వచ్చే టైమింగ్ మారుతుంది. బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న సినిమా అయితే డిజిటల్ స్ట్రీమింగ్ కి సమయం పడుతుంది. ఫ్లాప్ సినిమా అయితే వారం, పది రోజుల్లోనే స్ట్రీమింగ్ అవుతుంది. ఇక సినిమాలకి సంబందించిన డిజిటల్ రైట్స్ ని స్ట్రీమింగ్ కంపెనీలు ముందుగానే కొనేసుకుంటున్నాయి. హీరో రేంజ్ బట్టి వారు రైట్స్ మీద పెట్టుబడి పెడుతున్నారు.

ఈ నేపధ్యంలో ప్రతి వారం థియేటర్స్ తరహాలోనే ఒటీటీలో కూడా సినిమాలు, వెబ్ సిరీస్ లు వస్తున్నాయి. ఈ వారం తెలుగులో రిలీజ్ అయిన సినిమాలు ఒటీటీలో స్ట్రీమింగ్ కాబోతున్నాయి. వాటిలో అజిత్ కుమార్ తెగింపు మూవీ ఫిబ్రవరి 10న నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కాబోతుంది. ఇక సుదీర్ బాబు హంట్ మూవీ అమెజాన్ ప్రైమ్ లో ప్రసారం కాబోతుంది, సంతోష్ శోభన్ నటించిన కల్యాణం కమనీయం సినిమా ఆహాలో స్ట్రీమింగ్ కి రెడీ అవుతుంది.
అలాగే సాయి రోనక్ హీరోగా నటించిన రాజయోగం అనే సినిమా ఫిబ్రవరి 9న డిస్నీ హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ కి రెడీ అవుతుంది. దీంతో పాటు సింగర్ స్మిత నిర్వహించబోతున్న టాక్ షో ఫిబ్రవరి 10 నుంచి సోనీలివ్ లో టెలికాస్ట్ కాబోతుంది. ఇలా ఈ వారం ఒటీటీలో ప్రేక్షకులకి కావాల్సినంత వినోదం సినిమాలతో అందబోతుంది అని చెప్పాలి.


Click it and Unblock the Notifications











