OTT: ఎట్టకేలకు ఓటీటీలో అఖిల్ ఏజెంట్.. ఎప్పుడు? ఎక్కడ? ఏ రోజు స్ట్రీమింగ్ అంటే?

ఇన్నేళ్ల తెలుగు సినిమా చరిత్రలో ఎన్నెన్నో బిగ్గెస్ట్ హిట్స్ ఉన్నాయి అలాగే పలు ప్లాప్ చిత్రాలు కూడా ఉన్నాయి. అయితే అత్యధిక గ్రాసర్ లు అత్యధికంగా నష్టాలు అందించిన చిత్రాల్లో ఎక్కువగా అత్యధిక వసూళ్లు వచ్చిన సినిమాలు కంటే అత్యధికంగా నష్టాలు మిగిలిచిన సినిమాలు లెక్కలే గుర్తుంచుకుంటారు. కాగా ఇలా తెలుగు సినిమా చరిత్రలో కొన్ని ఎపిక్ డిజాస్టర్ సినిమాలు ఇలానే నిలిచిపోయినవి ఉన్నాయి.

కాగా ప్రెజెంట్ జెనరేషన్ లో ఉన్న సినిమాలు చూసినట్టు అయితే ఘోరమైన నష్టాలు మిగిల్చిన చిత్రాల్లో అక్కినేని వారి యువ హీరో అఖిల్ అక్కినేని నటించిన చిత్రం "ఏజెంట్" కూడా ఒకటి. దర్శకుడు సురేందర్ రెడ్డి తెరకెక్కించిన భారీ సినిమా అఖిల్ కెరీర్లోనే అత్యధిక బడ్జెట్ తో తెరకెక్కించారు. అప్పుడు కోవిడ్ కి ముందు నుంచే భారీ హైప్ ని సెట్ చేసుకున్న చిత్రం గత 2023 ఏప్రిల్ నెలలో రిలీజ్ అయ్యింది.

Finally akhil Akkineni s Agent movie will streaming on ott on This Date

కాగా అఖిల్ ఈ సినిమా తర్వాత నేను ఏమైపోతానో అనే రేంజ్ లో ఊహించుకుంటే ఈ చిత్రం ఘోరమైన డిజాస్టర్ గా నిలిచిపోయింది. టైర్ 2 హీరోస్ లోనే కాకుండా ఓవరాల్ టాలీవుడ్ సినిమాల్లో భారీ నష్టాలు మిగిల్చిన సినిమాగా నిలిచింది. ఇక థియేటర్స్ లో పనైపోయింది అనుకుంటే ఈ చిత్రం ఓటిటి రిలీజ్ కోసం కూడా పెద్ద హంగామానే నడిచింది అని చేసింది అని చెప్పాలి.

ఇలా ఏజెంట్ సినిమా అప్పుడు 2023 లోనే సినిమా థియేటర్స్ లో రిలీజ్ అయ్యిన నెల లోపే ఓటిటి డేట్ కూడా ఇచ్చేసారు కానీ అనూహ్యంగా ఈ డేట్ కాస్తా నెల నుంచి ఏకంగా సంవత్సరాలు దాటిపోయింది. మధ్యలో ఇంకొన్ని డేట్స్ వచ్చాయి కానీ సదరు ఓటిటి సంస్థ సహా నిర్మాతల నడుమ ఏదీ తెగకపోవడంతో వచ్చినట్టే వచ్చి సినిమా వాయిదాలు పడింది.

Finally akhil Akkineni s Agent movie will streaming on ott on This Date

ఇక దాదాపు అంతా ఈ సినిమా కోసం మర్చిపోయారు అనే సమయంలో మళ్ళీ ఏజెంట్ ఓటిటి రిలీజ్ పై బిగ్ ట్విస్ట్ వచ్చింది. కాగా ఏజెంట్ సినిమాని అప్పుడు నుంచీ సొంతం చేసుకున్న ఓటిటి సంస్థ సోనీ లివ్ వారే మళ్ళీ కొత్త డేట్ ని ప్రకటించి షాకిచ్చారు. కాగా ఈసారి ఏజెంట్ ని తాము పాన్ ఇండియా భాషల్లో కాకుండా పాన్ సౌత్ భాషల్లో అంటే తెలుగు, తమిళ్, మలయాళ, కన్నడ భాషల్లో తెస్తున్నట్టు అనౌన్స్ చేసేసారు.

అన్నట్టు ఈ సినిమాని ఈ మార్చ్ 14 నుంచే తెస్తున్నట్టుగా కూడా ఇందులో రివీల్ చేశారు. సో ఈ షాకింగ్ న్యూస్ ఇపుడు అక్కినేని ఫ్యాన్స్ లో ఊహించనిదిగా మారింది. కాగా ఈ చిత్రంలో మలయాళ సీనియర్ స్టార్ మమ్ముట్టి కూడా కీలక పాత్రలో నటించగా కొత్త హీరోయిన్ సాక్షి వైద్య తెలుగు సినిమాకి పరిచయం అయ్యింది. కానీ ఈ సినిమాతో ఈమె డిజాస్టర్ వెల్కమ్ నే అందుకోవాల్సి వచ్చింది. ఇక ఈ సినిమా తర్వాత సురేందర్ రెడ్డి కూడా మళ్ళీ కనిపించలేదు. కాగా నిర్మాత అనీల్ సుంకర ఈ సినిమాకి 100 కోట్లకి పైగా బడ్జెట్ పెట్టి తీవ్రంగా నష్టపోయారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X