Kill on OTT: ఓటీటీలో కిల్ మూవీకి రికార్డు స్ట్రీమింగ్ వ్యూస్.. తెలుగు వెర్షన్ సంచలనంై
ఈ ఏడాదిలో బాలీవుడ్ సినిమా సహా మిగతా భాషల్లో కూడ కొన్ని నెలలు పాటు సరైన హిట్స్ లేకుండా డ్రై వాతావరణం నడిచిన సంగతి తెలిసిందే. దీనితో భారీ సినిమాల లేమితో థియేటర్స్ ఖాళీగానే కనిపించాయి. అయితే ఆ సమయంలోనే వచ్చిన పాన్ ఇండియా సినిమానే "కల్కి 2898 ఎడి" కాగా ఈ సినిమా తర్వాతి వారంలోనే వచ్చిన క్రేజీ బాలీవుడ్ యాక్షన్ డ్రామానే "కిల్". ఇక ఈ చిత్రంలో ఆశిష్ విద్యార్ధి, రాఘవ్ జుయెల్ తదితరులు నటించగా దర్శకుడు నగేష్ భట్ దర్శకత్వం వహించారు.
సంచలన టాక్ ని సంతరించుకొని ఏకంగా హాలీవుడ్ లో రీమేక్ చేసే ఇండియన్ సినిమాగా నిలిచి హాట్ టాపిక్ గా మారింది. అలాగే ఈ భారీ చిత్రాన్ని హాలీవుడ్ లో "జాన్ విక్" మేకర్స్ రీమేక్ చేసేందుకు హక్కులు కొనుక్కున్నారు.కాగా ఈ చిత్రం కల్కి లాంటి భారీ సినిమా ఉన్నప్పటికీ హిందీలో మంచి వసూళ్లు సాధించి ట్రేడ్ వర్గాల్లో ట్రెండింగ్ టాపిక్ గా కూడా నిలిచింది. ఇంతకు ముందు కూడా చాలా సినిమాలు యాక్షన్ బ్యాక్ డ్రాప్ లో వచ్చాయి..

కానీ ఈ సినిమా వాటిని మించి హాలీవుడ్ లెవెల్ నాచురల్ యాక్షన్ తో సాలిడ్ ఎమోషన్స్ తో వచ్చి ఆశ్చర్యపరిచింది. దీనితో "కిల్" అనే సినిమా కోసం ఒక్క హిందీ జనమే కాకుండా మినిమమ్ సినిమా విషయాలు ఫాలో అయ్యేవారు కూడా మాట్లాడుకున్నారు. కొత్త నటుడు లక్ష్య హీరోగా నటించిన ఈ సినిమా తన డెబ్యూ తోనే ఊహించని లెవెల్ యాక్షన్ ని చూపించి దుమ్ము లేపేసాడు.
దీనితో ఈ సినిమా రీమేక్ కి కూడా భారీ డిమాండ్ ఏర్పడింది. కాగా తెలుగు/ తమిళ భాషల్లో రాఘవ లారెన్స్ ఈ సినిమాని రీమేక్ చేస్తున్నట్టుగా ఈ మధ్య వచ్చాయి. అందుకే తెలుగు వెర్షన్ కూడా ఓటిటిలోకి రాలేదు అని రూమర్స్ వినిపించాయి. కానీ ఇన్ని రోజులు కేవలం హిందీలో మాత్రమే అందుబాటులోకి ఉన్న ఈ చిత్రాన్ని ఈరోజు నుంచి తెలుగులో కూడా చూసే విధంగా అదే డిస్నీ ప్లస్ హాట్ స్టార్ వారు గుడ్ న్యూస్ అందించారు.

కాగా ఒరిజినల్ హిందీ వెర్షన్ ని తీసుకొచ్చిన హాట్ స్టార్ నేటి నుంచి తెలుగు, తమిళ అలాగే మలయాళ భాషల్లో ఈ చిత్రాన్ని తీసుకొచ్చేసారు. ఇది మాత్రం తెలుగు ఆడియెన్స్ కి మిగతా ఆడియెన్స్ కి కూడా గుడ్ న్యూస్ అని చెప్పొచ్చు. సో ఓటిటిలో ఒక బ్రూటల్ యాక్షన్ డ్రామా కిల్ తెలుగు వెర్షన్‌కు డిస్నీ హాట్ స్టార్ లో భారీ స్పందన లభిస్తున్నదని ఓటీటీ సంస్థ వెల్లడించింది.
ఓటీటీలోకి వచ్చిన కిల్ మూవీకి అన్ని భాషల్లో విశేషంగా ఆదరణ లభిస్తున్నది. 24 గంటల్లోనే రికార్డు స్థాయిలో స్ట్రీమింగ్ వ్యూస్ నమోదయ్యాయి. తెలుగు వెర్షన్ రిలీజ్ తర్వాత మరింతగా వ్యూస్ పెరిగాయి. డిస్నీ హాట్ స్టార్‌లో టాప్ ట్రెండింగ్‌లో ఒకటిగా నిస్తున్నది అని నిర్వాహకులు తెలిపార.


Click it and Unblock the Notifications











