ప్రపంచవ్యాప్తంగా ఎన్టీఆర్ సంచలనం.. ట్విట్టర్ లో నెంబర్ వన్ రికార్డు!

దర్శకధీరుడు రాజమౌళి ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరపైకి తీసుకు వచ్చిన బిగ్గెస్ట్ పాన్ ఇండియా మూవీ RRR సినిమా ఏ రేంజ్ లో సక్సెస్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. రామ్ చరణ్ తేజ్ జూనియర్ ఎన్టీఆర్ కలిసి నటించిన ఈ సినిమా బాలీవుడ్ లో కూడా భారీ స్థాయిలో సాలీడ్ వసూళ్లను సొంతం చేసుకుంది. ప్రపంచవ్యాప్తంగా దాదాపు 12 వందల కోట్లకు పైగా వసూళ్లను సొంతం చేసుకొని నిర్మాతలకు అలాగే బయ్యర్లకు భారీ స్థాయిలో ప్రాఫిట్స్ అయితే అందించింది.

ఇక సినిమా ఓటీటీలో విడుదలైన తరువాత కూడా అదే తరహాలో రెస్పాన్స్ అందుకోవడం హాట్ టాపిక్ గా మారిపోయింది. నెట్ ఫ్లిక్స్ లో హిందీ వెర్షన్ విడుదలైన విషయం తెలిసిందే. ఇక ఇంగ్లీష్ సబ్ టైటిల్స్ లో సినిమాను విదేశీయులు కూడా ఎగబడి చూసేస్తున్నారు. ఇదివరకే కొంతమంది ప్రముఖ హాలీవుడ్ టెక్నీషియన్స్ కూడా ఈ సినిమాపై పాజిటివ్ గా స్పందించడంతో సోషల్ మీడియాలో రోజురోజుకు సరికొత్త సంచలనాలు సృష్టిస్తోంది.

First 10 Million viewed video on Twitter from India belongs to RRR

ఇప్పటికే ప్రపంచ వ్యాప్తంగా అత్యధికంగా ట్వీట్ చేయబడిన సినిమా టైటిల్స్ లోనే సరికొత్త రికార్డు క్రియేట్ చేసింది. ఇక రీసెంట్ గా ఒక నెటిజన్ ఈ సినిమాకు సంబంధించిన ఇంటర్వెల్ యాక్షన్ సీన్ ను చూస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ఎన్టీఆర్ జంతువులతో ఎంట్రీ ఇచ్చిన ఆ సీన్ ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇక సీన్ గురించి ప్రస్తుతం విదేశీయులు ఎంతో గొప్పగా మాట్లాడుకుంటున్నారు. ఇలాంటి సీన్ ఇంతవరకు చరిత్రలో ఎప్పుడు చూడలేదు అని చెబుతున్నారు. ఇక ట్విట్టర్లో పోస్ట్ చేసిన ఆ ఎన్టీఆర్ ఇంటర్వెల్ సీన్ వీడియో ఏకంగా 10 మిలియన్ వ్యూవ్స్ అందుకోవడం విశేషం.

ఇప్పటివరకు ట్విట్టర్లో ఇండియాకు చెందిన ఏ వీడియో కూడా ఈ తరహాలో సెన్సేషన్ క్రియేట్ చేయలేదు. మొదట్లో జూనియర్ ఎన్టీఆర్ ను సినిమాలో చాలా తక్కువగా చూపించారు అని విమర్శలు చాలానే వచ్చాయి. కానీ ఈ ఒక సీన్ ను మాత్రం విదేశీయులు చాలా ఎక్కువగా ఇష్టపడుతున్నారు. అంటే రాజమౌళి ఎన్టీఆర్ ను ఈ సినిమాలో ఎంత హైలెట్ గా చూపించారో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X