OTTలోకి అందరూ చూడాల్సిన ఫ్రీడమ్ ఫైటర్ లైఫ్ జర్నీ.. వీర్ సావర్కర్ మూవీ ఎక్కడ చూడాలంటే?
ఈ మధ్య కాలంలో అనేక మంది ప్రముఖుల బయోపిక్ లు వస్తున్నాయి. సినిమా హీరోలు, పొలిటీషియన్లు.. ఇలా అనేక మంది జీవిత కథలను చిత్రాలుగా తీసుకు వస్తూ సెన్సేషన్ క్రియేట్ చేస్తుండగా.. తాజాగా ఓ ఫ్రీడమ్ ఫైటర్ సినిమా వచ్చింది. ఆయన జీవిత కథ.. చేసిన పనులు, దేశానికి అందించిన సేవ గురించి పూర్తిగా వివరించారు. అయితే థియేటర్లలో సెన్సేషన్ క్రియేట్ చేసిన ఈ మూవీ తాజాగా ఓటీటీలోకి రాబోతుంది. అయితే ఆ సినిమా ఏంటి, ఎక్కడ స్ట్రీమింగ్ కాబోతుందో మనం ఇప్పుడు తెలుసుకుందాం.
ఫ్రీడమ్ ఫైటర్ వినాయక్ దామోదర్ సావర్కర్ జీవితం ఆధారంగా తెరకెక్కిన క్రేజీ చిత్రమే స్వాతంత్ర్య వీర్ సావర్కర్. అయితే ప్రధాన పాత్రలో నటించడంతో పాటు సహ నిర్మాతగా, డైరెక్టర్ గా వ్యవహరించారు రణ్ దీప్ హుడా. రణ్ దీప్ హుడా ఫిల్మ్స్, లెజెంజ్ స్టూయిడోయ్స అవాక్ ఫిల్మ్స్, ఆనంద్ పండిత్ మోషన్ పిక్చర్స్ బ్యానర్లపై రణదీప్ హుడా, సామ్ ఖాన్, ఆనంద్ పండింట్, యోగేష్ రాహర్, సందీప్ సింగ్ లు నిర్మించారు. అలాగే ఈ సినిమాకు అను మాలిక్, విసిన్ పట్వాలు పాటలు, సంగీతం అందించారు.

రణదీప్ హుడాతో పాటు అంకితా లోఖండే, అమిత్ సియోల్, తీర్థ ముర్బాద్కర్, చేతన్ స్వరూప్, ఖేరా, లోకేష్ మిట్టల్, బ్రజేష్ ఝూ, సంతోష్ ఓజా, రాహుల్ కులకర్ణి, సంజయ్ శర్మ, మృణాల్ దత్, అంజలి హుడా, జై పటేల్, చిరాగ్ పాండ్యా, బాలకృష్ణ మిశ్రా, భూషణ్ ఎస్ఆర్, నితేష్ ఠాకూర్, సాల్ యూసఫ్, జేమ్స్ మర్ఫీ, మార్క్ బెన్నింగ్టన్, రస్సెల్ జాఫ్రీ బ్యాంక్స్ వంటి వాళ్లు ప్రధాన పాత్రల్లో నటించి మెప్పించారు. 20 కోట్ల రూపాయలతో నిర్మించిన ఈ ఈ చిత్రాన్ని మార్చి 22వ తేదీన థియేట్రలోల విడుదల చేశారు. ఇలా బాక్సాఫీసు వద్ద భారీ వసూళ్లు రాబట్టుకుని హిట్ గా నిలిచిందీ సినిమా.

అయితే ఈ ఫ్రీడమ్ ఫైటర్ మూవీ తాజాగా ఓటీటీలోకి రాబోతున్నట్లు తెలుస్తోంది. భారీ పోటీ నడమ ఈ సినిమా హక్కులను ప్రముఖ ఓటీటీ సంస్థ అయిన జీ5 సంస్థ దక్కించుకుంది. అయితే వినియాక్ దామోదర్ సావర్కర్ 141వ పుట్టిన రోజు సందర్భగా ఈ సినిమాను రిలీజ్ చేయాలని చూస్తోందీ జీ5 సంస్థ. ముఖ్యంగా అతి త్వరలోనే అంటే ఏప్రిల్ 28వ తేదీనే 141వ జయంతి జరుగుతుండగా... ఆరోజు నుంచే ఈ సినిమాను స్ట్రీమింగ్ చేయబోతున్నట్లు ప్రకటించారు. ప్రతీ ఒక్కరూ కచ్చితంగా చూడాల్సిన ఈ బయోపిక్ ను మీ ఇంట్లోనే కూర్చుని చూసి ఎంజాయ్ చేయండి. ఏమాత్రం ఆలోచించకండి.


Click it and Unblock the Notifications











