OTT Movies: గద్దర్ అవార్డులు గెలుచుకున్న సినిమాలు.. ఏ ఓటీటీలో ఉన్నాయంటే.?
Gaddar Awards Best Movies: తెలంగాణ ప్రభుత్వం తాజాగా ప్రకటించిన గద్దర్ ఫిలిం అవార్డ్స్ టాలీవుడ్‌లో చర్చనీయాంశంగా మారాయి. 2025లో విడుదలైన సినిమాలను పరిగణలోకి తీసుకుని వివిధ విభాగాల్లో ఈ అవార్డులను ప్రకటించారు. పెద్ద సినిమాలతో పాటు చిన్న చిత్రాలు కూడా ఈ అవార్డుల్లో సత్తా చాటడం విశేషం. ఇలాంటి సందర్భంలో గద్దర్ అవార్డ్స్ అందుకున్న కొన్ని సినిమాలు ఇప్పుడు ఓటీటీలో అందుబాటులో ఉన్నాయి. మంచి కథ, వినోదం, సామాజిక సందేశం వంటి అంశాలతో ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈ సినిమాలను ఓటీటీలో మిస్ కాకుండా చూడాలని సినీ విశ్లేషకులు సూచిస్తున్నారు. ఆ సినిమాల జాబితా, అవి స్ట్రీమింగ్ అవుతున్న ఓటీటీ ప్లాట్‌ఫామ్ వివరాలు ఇవి.
రాజు వెడ్స్ రాంబాయి
ఎమోషనల్ లవ్ స్టోరీగా తెరకెక్కిన 'రాజు వెడ్స్ రాంబాయి' . ఇది చిన్న సినిమా అయినప్పటికీ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. ఈ చిత్రంలో అఖిల్ రాజ్, తేజస్వి రావు జంటగా నటించారు. ప్రేమ, భావోద్వేగాలు కలగలిపిన ఈ కథ యువతను ఎక్కువగా ఆకట్టుకుంది. గద్దర్ అవార్డ్స్‌లో ఈ చిత్రం ఉత్తమ చిత్రంగా ఎంపిక కావడం విశేషం. ఈ సినిమా ఈటీవి విన్ స్ట్రీమింగ్ అవుతుంది.

తండేల్
అక్కినేని నాగచైతన్య, సాయి పల్లవి జంటగా నటించిన సినిమా 'తండేల్'. ఈ సినిమా మంచి విజయాన్ని సాధించింది. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన జాలర్లు పాకిస్తాన్‌లో చిక్కుకుపోయిన నిజ జీవిత ఘటనల ఆధారంగా దర్శకుడు చందూ ముండేటి ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఈ చిత్రానికి గద్దర్ అవార్డ్స్‌లో జాతీయ సమగ్రతా చిత్రంగా పురస్కారం లభించింది. ఈ సినిమాను నెట్ ఫ్లిక్స్ లో చూడవచ్చు.
దండోరా
శివాజీ, నందు ప్రధాన పాత్రల్లో నటించిన 'దండోరా'. ఈ సినిమా పరువు హత్యల నేపథ్యంలో తెరకెక్కింది. సమాజంలో ఉన్న కుల వివక్ష, గౌరవ హత్యల వంటి సమస్యలను స్పృశిస్తూ .. ఈ సినిమాను మంచి సందేశాన్ని ఇచ్చింది. గద్దర్ అవార్డ్స్‌లో ఈ సినిమా ఉత్తమ ద్వితీయ చిత్రంగా నిలిచింది. ఈ సినిమాను అమెజాన్ ప్రైమ్ వీడియో చూడవచ్చు.
లిటిల్ హార్ట్స్
యూత్ ఫుల్ కంటెంట్‌తో ప్రేక్షకులను ఆకట్టుకున్న చిత్రాల్లో 'లిటిల్ హార్ట్స్' ఒకటి. యువ సత్తా చాటిన సినిమా ఇది. దర్శకుడిగా సాయి మార్తాండ్, హీరోగా మౌళి తనూజ్, సంగీత దర్శకుడిగా సింజిత్ యర్రమల్లి తదితరులు తొలి ప్రయత్నంలోనే పెద్ద విజయాన్ని అందుకోవడం విశేషం. దాదాపు రూ.2.5కోట్ల బడ్జెట్‌తో రూపొందిన ఈ సినిమా రూ.33 కోట్లకుపైగా వసూలు చేసింది. మౌళి తనూజ్, హీరోయిన్ శివాని నాగారం తమ నటనతో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. కొత్త తరహా కథతో వచ్చిన ఈ చిత్రానికి గద్దర్ అవార్డ్స్‌లో ఉత్తమ డెబ్యూ ఫీచర్ ఫిల్మ్ అవార్డు దక్కింది. ఈటీవీ విన్' (ETV Win)లో స్ట్రీమింగ్ అవుతుంది.
సంక్రాంతికి వస్తున్నాం
గత ఏడాది సంక్రాంతి సందర్భంగా విడుదలైన 'సంక్రాంతికి వస్తున్నాం'. సంక్రాంతి బరిలో నిలిచిన ఈ సినిమా భారీ బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. వెంకటేశ్ (Venkatesh) కథానాయకుడిగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఈ సినిమా రూపొందించబడింది. ఈ చిత్రం ఫుల్ రన్‌లో దాదాపు రూ.300 కోట్లు (గ్రాస్)పైగా వసూలు (sankranthiki vasthunam collection) చేసినట్లు ట్రేడ్ వర్గాలు అంచనా వేశాయి. కుటుంబ ప్రేక్షకులను కడుపుబ్బ నవ్వించింది. గద్దర్ అవార్డ్స్‌లో ఈ మూవీ ఉత్తమ వినోదాత్మక చిత్రంగా ఎంపికైంది. ఈ సినిమా జీ5లో స్రీమింగ్ అవుతుంది.
మిరాయ్
తేజ సజ్జా, మంచు మనోజ్ ప్రధాన పాత్రల్లో కార్తిక్ ఘట్టమనేని తెరకెక్కించిన ఫాంటసీ అడ్వెంచర్ 'మిరాయ్'. ఇటీవల విడుదలై బ్లాక్ బస్టర్ విజయాన్ని సొంతం చేసుకుంది. విజువల్ ఎఫెక్ట్స్, యాక్షన్ సన్నివేశాలతో ఈ చిత్రం ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఈ చిత్రానికి గద్దర్ అవార్డ్స్‌లో ఉత్తమ స్పెషల్ ఎఫెక్ట్స్ మూవీ అవార్డు దక్కింది. ఈ సినిమా జియో హాట్‌స్టార్ వేదికపై నుంచి స్ట్రీమింగ్ అవుతుంది. ఈ సినిమా తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో జియో హాట్‌స్టార్ (Jio Hiotstar)లో అందుబాటులో ఉంది.
కోర్ట్
నేచరల్ స్టార్ నాని నిర్మించిన 'కోర్ట్' సినిమా కోర్ట్‌రూమ్ డ్రామాగా తెరకెక్కింది. ప్రియదర్శి, హర్ష్ రోషన్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రం ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది ఇందులో శివాజీ, ప్రియదర్శి అద్భుతమైన నటన విమర్శకుల ప్రశంసలు లభించాయి. బాక్సాఫీస్ వద్ద సెన్సేషనల్ హిట్ అందుకుంది. ముఖ్యంగా ఈ సినిమాలో శివాజీ నటన ప్రత్యేకంగా నిలిచింది. గద్దర్ అవార్డ్స్‌లో ఈ సినిమా ఉత్తమ సామాజిక సందేశాత్మక చిత్రంగా నిలిచింది. ఈ సినిమా తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళం భాషలలో నెట్‌ఫ్లిక్స్ వేదికగా స్ట్రీమింగ్ కు వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. లవ్ స్టోరీ, పోక్సో కేసు చుట్టూ ఈ సినిమా తిరుగుతుంది.
ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో
'ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో' సినిమా కూడా గద్దర్ అవార్డ్స్‌లో ప్రత్యేక గుర్తింపు పొందింది. ఈ చిత్రానికి ఉత్తమ తృతీయ చిత్రం అవార్డు లభించింది. ఈ సినిమాలో నటించిన మాస్టర్ రోహన్‌కు ఉత్తమ బాల నటుడు అవార్డు దక్కడం విశేషం. ఈ సినిమాను జీ5 స్ట్రీమింగ్ అవుతోంది. గద్దర్ ఫిలిం అవార్డ్స్‌లో సత్తా చాటిన ఈ సినిమాలు కథ, నటన, సందేశం పరంగా ప్రేక్షకులను ఆకట్టుకున్న చిత్రాలు. పెద్ద బడ్జెట్ సినిమాల నుంచి చిన్న సినిమాల వరకు విభిన్నమైన కథలతో రూపొందిన ఈ మూవీస్ ఇప్పుడు ఓటీటీలో అందుబాటులో ఉన్నాయి. మంచి సినిమాలు చూడాలనుకునే వారికి ఈ జాబితా పక్కా వాచ్‌లిస్ట్‌గా చెప్పుకోవచ్చు.


Click it and Unblock the Notifications











