OTTలోకి బోల్డ్ కంటెంట్ వెబ్ సిరీస్.. తెలుగులో రాబోతున్న ఈ కొరియన్ సిరీస్‌ను ఎలా చూడాలంటే?
భారతదేశంలో ఉన్న అనేక మందికి కొరియన్ వెబ్ సిరీస్ లు అంటే చాలా ఇష్టం. భాష రాకపోయినా సరే సబ్ టైటిల్స్ పెట్టుకుని మరీ ఈ సినిమాలు, వెబ్ సిరీస్ లను చూస్తూ తెగ ఎంజాయ్ చేస్తుంటారు. ముఖ్యంగా యూత్ అయితే ఏ కొత్త కొరియన్ వెబ్ సిరీస్ వచ్చినా వదిలి పెట్టరు. ప్రేమ, రొమాన్స్ ఎక్కువగా చూపించే ఈ చిత్రాలు, వెబ్ సిరీస్ లను ఇష్టపడని వారంటూ ఉండరు.
అయితే ఈ విషయాన్ని అర్థం చేసుకున్న పలు ఓటీటీ సంస్థలు.. కొరియన్ వెబ్ సిరీస్, సినిమాలను కూడా తెలుగులో అందుబాటులోకి తెస్తున్నాయి. తాజాగా ఓ సరికొత్త రొమాంటిక్ వెబ్ సిరీస్ ను ఓ ఓటీటీ సంస్థ తెలుగులో అందుబాటులోకి తెచ్చేందుకు ప్లాన్ చేస్తోంది. అయితే ఆ వెబ్ సిరీస్ ఏంటి, ఎక్కడ స్ట్రీమింగ్ కాబోతుంది వంటి విషయాలను మనం ఇప్పుడు తెలుసుకుందాం.

కొరియన్ భాషలో రూపొందిన ఐయామ్ నాట్ రోబోట్ అనే వెబ్ సిరీస్ కు విశేష స్పందన లభించింది. విమర్శకుల నుంచి సైతం ప్రశంసలు అందుకున్న ఈ వెబ్ సిరీస్ లో.. యు సీయుంగ్-హో, చే సూ-బిన్, ఉమ్ కి-జూన్ నటించారు. జంగ్ డే-యూన్ దర్శకత్వం వహించారు. ఈ సిరీస్ ను మే క్వీన్ పిక్చర్స్ నిర్మించగా.. 2017 డిసెంబర్ 6వ తేదీ నుంచి 2018 జనవరి 25వ తేదీ వరకు ప్రతి బుధ, గురువారాల్లో ఒక్కో ఎపిసోడ్ ను విడుదల చేశారు.
మొత్తం 32 ఎపిసోడ్ లు కల్గిన ఈ వెబ్ సిరీస్ ను అనేక మంది చూశారు. ముఖ్యంగా విపరతీమైన రొమాంటిక్ సీన్లు ఉన్న ఈ వెబ్ సిరీస్ సూపర్ హిట్ గా నిలవడంతో.. ఇండియాలోని అనేక మంది కూడా చూశారు. అయితే ఈ విషయం అర్థం చేసుకున్న ప్రముఖ ఓటీటీ సంస్థ అయిన ఈటీవీ విన్ దీన్ని తెలుగులో అందుబాటులోకి తెచ్చే ప్రయత్నం చేస్తోంది. ముఖ్యంగా ఐయామ్ నాట్ ఎ రోబోట్ అనే వెబ్ సిరీస్ ను తెలుగులో విడుదల చేయబోతుంది.
ఈ విషయాన్ని ఈటీవీ విన్ సంస్థ ఎక్స్ వేదికగా ప్రకటించింది. ముఖ్యంగా ఏప్రిల్ 25వ తేదీ నుంచి అందుబాటులోకి తీసుకు వస్తున్నట్లు స్పష్టం చేసింది. ముఖ్యంగా కొన్ని స్క్రీన్ షాట్లు పెట్టి మరీ వెరైటీగా ఈ విషయాన్ని వివరించింది. అద్భుతమైన రొమాన్స్ తో పాటు.. అంతకు మించిన లవ్ స్టోరీ కల్గిన ఈ వెబ్ సిరీస్ ను అందురూ చూసేయండి. ముఖ్యంగా కొరియన్ వెబ్ సిరీస్ లను ఇష్ట పడే వాళ్లు అయితే అస్సలే మిస్ కాకండి.


Click it and Unblock the Notifications











