Funky OTT Release: ఫంకీ ఓటీటీ స్ట్రీమింగ్ డిటెయిల్స్.. విశ్వక్‌సేన్ మూవీని ఎక్కడ చూడాలంటే?
జాతిరత్నాలు ఫేమ్ అనుదీప్ కేవీ దర్శకత్వంలో మాస్ కా దాస్ విశ్వక్‌సేన్ నటించిన చిత్రం ఫంకీ. ఫుల్ లెంగ్త్ కామెడీ, యూత్ ఫుల్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ సినిమాలో కాయదు లోహర్ హీరోయిన్‌గా నటించారు. ప్రేమికుల దినోత్సవం కానుకగా ఫిబ్రవరి 13వ తేదీన ఫంకీ మూవీ వరల్డ్ వైడ్‌గా ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఈ నేపథ్యంలో ఈ సినిమా ఓటీటీ రిలీజ్ ఎప్పుడు అనే దానిపై సోషల్ మీడియాలో డిస్కషన్స్ నడుస్తున్నాయి. ఈ వివరాలు పరిశీలిస్తే...
సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్‌పై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్యలు సంయుక్తంగా ఫంకీ సినిమాను నిర్మించారు. వీకే నరేష్, వీటీవీ గణేష్, సంపత్ రాజ్, ఈశ్వరి రావు, రఘుబాబు, మురళీధర్ గౌడ్ తదితరులు ఇతర పాత్రలు పోషించారు. ఈ చిత్రానికి భీమ్స్ సిసిరోలియో సంగీతం అందిస్తుండగా.. నవీన్ నూలి ఎడిటర్‌గా, సురేష్ సారంగం సినిమాటోగ్రాఫర్‌గా వ్యవహరిస్తున్నారు.

ఫంకీ బడ్జెట్ ఎంత?
నటీనటులు, సాంకేతిక నిపుణుల రెమ్యునరేషన్, ప్రొడక్షన్ కాస్ట్, ప్రమోషనల్ ఖర్చులు కలిపి ఫంకీ సినిమాకు దాదాపు 15 కోట్ల రూపాయల బట్జెట్ అయ్యింది. అనుదీప్ దర్శకత్వం, కాయదు అందాలతో పాటు టీజర్, ట్రైలర్లతో పాటు పబ్లిసిటీ కార్యక్రమాలతో విశ్వక్‌సేన్ మూవీపై హైప్ నెలకొంది. ఫంకీ థియేట్రికల్ రైట్స్ బిజినెస్ పరిశీలిస్తే.. నైజాం థియేట్రికల్ రైట్స్ 4 కోట్ల రూపాయలు, సీడెడ్ థియేట్రికల్ రైట్స్ 1.25 కోట్ల రూపాయలు, ఆంధ్రా థియేట్రికల్ రైట్స్ 5 కోట్ల రూపాయలు చొప్పున తెలుగు రాష్ట్రాల్లో 10.25 కోట్ల రూపాయల బిజినెస్ చేసింది ఈ మూవీ.
ఇక కర్ణాటక + రెస్టాఫ్ ఇండియా థియేట్రికల్ రైట్స్ 75 లక్షల రూపాయలు, ఓవర్సీస్ థియేట్రికల్ రైట్స్‌ను మోక్షా మూవీస్ 2 కోట్ల రూపాయలకు దక్కించుకుంది. దాంతో వరల్డ్ వైడ్‌గా ఫంకీ మూవీ ప్రీ రిలీజ్ బిజినెస్ 13 కోట్ల రూపాయల మేర చేసింది. విశ్వక్‌సేన్ మూవీ లాభాల్లోకి రావాలంటే బాక్సాఫీస్ వద్ద 14 కోట్ల రూపాయల షేర్, 28 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్స్ రాబట్టాల్సి ఉందని ట్రేడ్ పండితులు వాల్యూ నిర్దేశించారు.
ఫంకీ కలెక్షన్స్
విశ్వక్‌సేన్ మూవీకి తొలిరోజున ఇండియాలో 2.25 కోట్ల రూపాయల నెట్.. 2.65 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్స్ వచ్చింది.. ఓవర్సీస్‌లో ప్రీమియర్స్ + ఫస్డ్ డే కలిపి 160k డాలర్లు (1.44 కోట్ల రూపాయలు) రాబట్టింది. దాంతో ఫంకీ మూవీ తొలిరోజున వరల్డ్ వైడ్‌గా దాదాపు 4 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లు రాబట్టింది. వీకెండ్ కావడంతో శని, ఆదివారాలలో కలెక్షన్స్ మరింత పెరిగే అవకాశం ఉందని విశ్లేషకులు చెబుతున్నారు.
ఫంకీ ఓటీటీ డిటెయిల్స్
విశ్వక్ సేన్ - అనుదీప్ మూవీ డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్‌ను ఓటీటీ దిగ్గజం నెట్‌ఫ్లిక్స్ ఫ్యాన్సీ ధరకు సొంతం చేసుకున్నట్లుగా ఫిలింనగర్ టాక్. అయితే ఆ డీల్ ఎంత? ఓటీటీ పార్ట్‌నర్ ఎవరు? అనేది నిర్మాతలు ఇంకా అధికారికంగా వెల్లడించలేదు. థియేటర్‌లలో రిలీజైన 4 వారాల తర్వాత ఓటీటీలో స్ట్రీమింగ్ కావాలనే నిబంధన మేరకు ఈ ఒప్పందం జరిగినట్లుగా వార్తలు వస్తున్నాయి. దీనిని బట్టి ఫంకీ మూవీ తెలుగు, తమిళ, కన్నడ, మలయాళం, హిందీ భాషలలో ఫిబ్రవరి 2వ వారంలో ఓటీటీలో స్ట్రీమింగ్ అయ్యే అవకాశం ఉంది. అయితే థియేట్రికల్ రన్ ఆధారంగా ఇది కాస్త ముందుకు జరగొచ్చు లేదంటే ఆలస్యం కావొచ్చు. ఫంకీ డిజిటల్ స్ట్రీమింగ్‌పై త్వరలోనే నెట్‌ఫ్లిక్స్ ప్రకటన చేసే అవకాశం ఉందని విశ్లేషకులు చెబుతున్నారు.


Click it and Unblock the Notifications











