Gaami ఓటీటీలో సరికొత్త చరిత్ర సృష్టించిన గామి.. 72 గంటల్లోనే విశ్వక్ సేన్ మూవీ రికార్డుల పరంపర
తెలుగు సినీ పరిశ్రమలో వినూత్నంగా తెరకెక్కించిన గామి చిత్రం అన్ని వర్గాల ప్రేక్షకులకు కొత్త అనుభూతిని క్రియేట్ చేసింది. ఈ ఏడాది రిలీజైన చిత్రాల్లో అత్యున్నత సాంకేతికత రూపొందిన చిత్రంగా విమర్శకుల ప్రశంసలు అందుకొన్నది. ఎలాంటి అంచనాలు లేకుండా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా ట్రేడ్ అంచనాలకు మంచి కలెక్షన్లు రాబట్టింది. థియేట్రికల్ రన్‌ను ఘనంగా ముగించుకొని ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతున్న ఈ సినిమా సరికొత్త చరిత్రను క్రియేట్ చేసింది. ఓటీటీలో సంచలనం రేపుతున్న ఈ సినిమా గురించిన విశేషాల్లోకి వెళితే..
మాస్ కా దాస్ విశ్వక్ సేన్, చాందినీ చౌదరీ జంటగా నటించిన ఈ సినిమాకు విధ్యాదర్ కాగిత దర్శకత్వం వహించారు. హిమాలయల్లోని ఎత్తైన పర్వతాల్లో మంచు బ్యాక్ డ్రాప్‌తో రూపొందిన ఈ సినిమాకు స్వీకర్ అగస్తీ, నరేష్ కుమారన్ మ్యూజిక్ అందించారు. విశ్వనాథ్ రెడ్డి చెలుమల్ల, రాంపీ నందిగమ్ సినిమాటోగ్రఫిని అందించారు. ఈ సినిమా క్రౌడ్ ఫండింగ్‌తో రూపొందినప్పటికీ.. క్వాలిటీ పరంగా ఎలాంటి రాజీ లేకుండా ఉన్నత ప్రమాణాలతో రూపొందించారు.

మార్చి 8వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా రికార్డు కలెక్షన్లను బాక్సాఫీస్ వద్ద నమోదు చేసింది. ఈ సినిమా థియేట్రికల్ రన్‌లో ఈ సినిమా సుమారుగా 25 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్లను నమోదు చేసింది. బాక్సాఫీస్ వద్ద సంచలన విజయం సాధించిన ఈ సినిమా ఇటీవల జీ 5 ఓటీటీలో రిలీజైంది.
గామి సినిమాకు థియేటర్లోనే కాకుండా ఓటీటీలో కూడా రికార్డులు క్రియేట్ చేస్తున్నది. ఈ సినిమా కొద్ది రోజుల్లోనే అత్యధిక వ్యూస్ మినట్స్ సాధించిన చిత్రంగా ఘనతను సాధించింది. కేవలం ఈ సినిమా ఓటీటీలో రిలీజైన 72 గంటల్లోనే 50 మిలియన్ల వ్యూస్ సాధించింది అని జీ5 ఓటీటీ నిర్వాహకులు అధికారికంగా ప్రకటన చేశారు. దీన్ని బట్టి ఈ సినిమా కంటెంట్ ఎంత ప్రభావవంతంగా ఉందనే విషయం అర్ధమవుతుందని చిత్ర యూనిట్ ఆనందాన్ని వ్యక్తం చేసింది.

సరికొత్త కథ, కథనంతో గ్రిప్పింగ్‌గా చెబితే ఏ సినిమాకైనా మంచి ఆదరణ ఉంటుందనే విషయాన్ని గామి నిరూపించింది. స్టోరీ నేరేట్ చేసిన విధానం ప్రేక్షకులను కట్టిపడేసింది. కంటెంట్ బాగుంటే మూవీని అన్ని వర్గాలు ఆదరిస్తారనే విషయాన్ని ఈ సినిమా మరోసారి ఈ ఫలితాన్ని చూపించింది అని జీ5 నిర్వాహకులు వెల్లడించారు.


Click it and Unblock the Notifications











