Gaami On OTT ఓటీటీలో గామి సరికొత్త చరిత్ర.. ఇండియాలోనే మొట్టమొదటి మూవీగా..!

మాస్ కా దాస్ విశ్వక్ సేన్, యంగ్ హీరోయిన్ చాందినీ చౌదరీ జంటగా యువ దర్శకుడు కాగిత విద్యాధర్ డైరెక్షన్‌లో రూపొందిన చిత్రం గామి. స్పిర్చువల్ అడ్వెంచరస్ థ్రిల్లర్‌గా రూపొందిన ఈ సినిమాకు కార్తీక్ శబరీష్ నిర్మాతగా వ్యవహరించారు. ఎలాంటి అంచనాలు లేకుండా థియేట్రికల్ రిలీజైన ఈ సినిమా అంచనాలకు మించి వసూళ్లను సాధించింది. థియేట్రికల్‌గా ప్రేక్షకులకు కొత్త అనుభూతిని పంచిన ఈ చిత్రం ప్రస్తుతం ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతున్నది. ఓటీటీ ప్రమోషన్స్ కోసం ఈ సినిమా అరుదైన గౌరవాన్ని సొంతం చేసుకొన్నది. ఆ వివరాల్లోకి వెళితే..

గామి చిత్రం టెక్నికల్‌గా బ్రిల్లియెంట్ అనే మౌత్ టాక్‌తో బాక్సాఫీస్ వద్ద చెలరేగిపోయింది. ట్రేడ్ వర్గాల అంచనాలను తలకిందుల చేస్తూ భారీ వసూళ్లను నమోదు చేసింది. ఈ సినిమా తెలుగు రాష్ట్రాల్లో 14 కోట్ల గ్రాస్, 13 కోట్ల నికర వసూళ్లు సాధించింది. ఇక 1 కోటి రూపాయలు ఇండియా వైడ్ రాబట్టింది. ఇక ఓవర్సీస్‌లో 4.5 కోట్ల రూపాయలు వసూలు చేసింది. దాంతో ఈ సినిమా
సుమారుగా 20 కోట్ల రూపాయలు కొల్లగొట్టింది.

Gaami streaming on Zee5 OTT India s First press meet in Snow Kingdom

గామి చిత్రం థియేట్రికల్ రన్‌ను గ్రాండ్‌గా ముగించుకొని ఇటీవలే జీ5 ఓటీటీలోకి వచ్చింది. ఈ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా చిత్ర యూనిట్ సభ్యులు స్నో కింగ్ డమ్‌లో మూవీ థిమ్‌కు తగినట్టు ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ చిత్రంలో ప్రధాన భాగం హిమలయాల్లోని ఎత్తైన పర్వతంపై దట్టమైన మంచు కురుస్తుండగా సన్నివేశాలను చిత్రీకరించారు. ఈ ప్రెస్ మీట్‌ను కూడా అదే విధంగా నిర్వహించారు.

గామి సినిమా రిలీజ్‌కు ముందు కలెక్షన్లు రావని అనుకొన్నారు. కానీ నా కెరీర్‌లో అత్యధిక ఓపెనింగ్స్ సాధించిన చిత్రంగా రికార్డు క్రియేట్ చేసింది. అయితే ఓటీటీ కోసం స్నో కింగ్‌డమ్‌లో మంచు కురుస్తున్న బ్యాక్ డ్రాప్‌లో నిర్వహించడం చాలా థ్రిల్లింగ్‌గా ఉంది. జీ5 ఇలాంటి ఈవెంట్ చేసినందుకు చాలా ఆనందంగా ఉంది. ఇలాంటి ఆలోచన వచ్చి ఉంటే.. నేను కూడా ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను ఇలా చేసేవాడినేమో అని విశ్వక్ సేన్ అన్నారు.

Gaami streaming on Zee5 OTT India s First press meet in Snow Kingdom

గామి సినిమా స్క్రీన్ ప్లే టిపికల్‌గా ఉంటుంది. కొందరికి సినిమా కథనం అర్దం కాలేదు. ప్రస్తుతం ఓటీటీలోకి వచ్చేసింది. అర్ధం కాని వాళ్లు ఎక్కువ సార్లు కూడా చూడటానికి అవకాశం ఉంటుంది. జీ5 ఓటీటీలో ఈ మూవీ విశేషమైన స్పందన లభిస్తున్నది. తప్పకుండా ఈ సినిమాను చూసి కొత్త అనుభూతిని పొందండి అని డైరెక్టర్ విధ్యాధర్ అన్నారు.

గామి లాంటి గొప్ప సినిమాను అందించిన విశ్వక్ సేన్, విధ్యాదర్‌కు థ్యాంక్స్. స్నో కింగ్‌డమ్‌లో ప్రెస్ మీట్ నిర్వహించడం ఇండియాలోనే తొలిసారి. ఈ సినిమా బ్యాక్ డ్రాప్‌కు సెట్ అవుతుందని ఇక్కడ మీడియా సమావేశాన్ని నిర్వహించాం. ఓటీటీలో తెలుగు, తమిళం, కన్నడ భాషలో స్ట్రీమింగ్ అవుతున్నది అని జీ5 వైఎస్ ప్రసిడెంట్ లాయిడ్ జేవీయర్ తెలిపారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X