Gal Gadot's Heart of Stone ఓటీటీలో హార్ట్ ఆఫ్ స్టోన్ సెన్సేషనల్ రిలీజ్.. గాల్ గ్యాడట్ మూవీ ఎప్పుడు? ఎక్కడంటే?
ప్రముఖ సినీ నిర్మాణ సంస్థలు స్కైడ్యాన్స్, పైలెట్ వేవ్, మాకింగ్‌బర్డ్ పిక్చర్స్ బ్యానర్‌లో టామ్ హార్పర్ దర్శకత్వంలో డెవిడ్ ఎలిసన్, డానా గోల్డ్‌బర్గ్, డాన్ గ్రాంగర్, గాల్ గ్యాడట్ తదితరులు నిర్మించిన చిత్రం హార్ట్ ఆఫ్ ది స్టోన్. ఈ చిత్రంలో గ్యాల్ గ్యాడట్, జామీ డోర్నాన్, ఆలియా భట్, సోఫీ ఒకొనెడో, మాథియాస్, జింగ్ లూసి, పాల్ రెడీ తదితరులు నటించారు. ఈ సినిమా అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని రిలీజ్‌కు సిద్దమైంది. అయితే ఈ సినిమా ప్రమోషన్‌లో ఆలియాభట్ గురించి, ఈ చిత్రం ఏ ఓటీటీ ఫ్లాట్‌ఫామ్‌పై రిలీజ్ కాబోతున్నదనే వివరాల్లోకి వెళితే..
హార్ట్ ఆఫ్ స్టోన్ సినిమా యాక్షన్‌తో కూడిన స్పై థ్రిల్లర్‌గా రూపొందింది. ఈ చిత్రం ద్వారా ఆలియాభట్ తొలిసారి హాలీవుడ్‌లోకి అడుగుపెడుతున్నది. ఈ చిత్రంలో కియా ధావన్ అనే కీలక పాత్ర ద్వారా హలీవుడ్ ప్రేక్షకులను ఆకట్టుకొనేందుకు ఆలియా భట్ సిద్దమైంది. పలు దేశాల్లో జరుగుతున్న ప్రమోషన్స్‌లో ఆలియాభట్ పాల్గొంటున్నారు.

ప్రపంచవ్యాప్తంగా అత్యంత ప్రజాదరణ ఉన్న గ్యాల్ గాడట్ నటించిన హార్ట్ ఆఫ్ స్టోన్ చిత్రం ప్రమోషన్స్ జోరుగా కొనసాగుతున్నాయి. హాలీవుడ్‌లో జరుగుతున్న ప్రచారాల్లో ఆలియాభట్ జోష్‌తో పాల్గొంటున్నారు. ఈ ప్రమోషన్ కార్యక్రమాల్లో RRR హీరోయిన్ ప్రత్యేక ఆకర్షణగా మారారు. పలు చోట్ల ఆమెకు అభిమానులు నీరాజనం పడుతున్నారు.

ఇక హార్ట్ ఆఫ్ స్టోన్ సినిమా ప్రమోషన్స్ సరికొత్తగా డిజైన్ చేశారు. బ్రెజిల్‌లో టుడెమ్ (Tudum) అనే పేరుతో గ్లోబల్ ఫ్యాన్ ఈవెంట్‌ను నిర్వహిస్తున్నారు. ఆన్‌లైన్ ద్వారా నిర్వహించే ఈవెంట్ జూన్ 17వ తేదీ 1:30pm PT సమయంలో స్ట్రీమింగ్ అవుతుందని చిత్ర యూనిట్ వెల్లడించింది.

ఇదిలా ఉండగా, హార్ట్ ఆఫ్ స్టోన్ (Heart Of Stone) సినిమా భారీ బడ్జెట్‌తో తెరకెక్కించారు. సుమారు 130 మిలియన్ డాలర్లు అంటే.. 1065 కోట్ల రూపాయలతో తెరకెక్కించారు. ఈ సినిమా హక్కులను ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్ దక్కించుకొన్నది. ఈ చిత్రం ఆగస్టు 11వ తేదీన నెట్‌ఫ్లిక్స్‌లో ప్రసారం కానున్నది.


Click it and Unblock the Notifications











