Game Changer OTT Release : ఓటీటీలోకి గేమ్ ఛేంజర్ .. స్ట్రీమింగ్ ఎప్పుడు? ఎందులో అంటే?
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ - క్రియేటివ్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన గేమ్ ఛేంజర్ ఎట్టకేలకు రిలీజైంది. సంక్రాంతి కానుకగా జనవరి 10న ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ సినిమా పాజిటివ్ రివ్యూలు, మౌత్ టాక్‌తో దూసుకెళ్తోంది. రామ్ చరణ్ నటన అద్భుతమని అభిమానులు సోషల్ మీడియాలో కామెంట్స్ పెడుతున్నారు. ఇప్పుడు అందరి దృష్టి గేమ్ ఛేంజర్ ఫస్ట్ డే ఓపెనింగ్స్ మీదే ఉంది. అల్లు అర్జున్ నటించిన పుష్ప 2ను మించి శంకర్ సినిమా వసూళ్లు రాబడుతుందా అని అంతా చర్చించుకుంటున్నారు.
ఇక ఈ మూవీలో రామ్ చరణ్ సరసన బాలీవుడ్ ముద్దుగుమ్మ కియారా అద్వానీ హీరోయిన్‌గా నటిస్తుండగా, అంజలి , ఎస్‌జే సూర్య, శ్రీకాంత్, సునీల్ ఇతర ముఖ్య పాత్రలు పోషించారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై దాదాపు రూ.450 కోట్లకు పైగా భారీ బడ్జెట్‌తో గేమ్ ఛేంజర్ నిర్మించారు దిల్‌రాజు. ఆర్ఆర్ఆర్ తర్వాత రామ్ చరణ్ నటిస్తున్న సినిమా కావడంతో పాటు శంకర్ తొలిసారిగా ఓ స్ట్రెయిట్ తెలుగు సినిమాకు దర్శకత్వం వహించిన నేపథ్యంలో గేమ్ ఛేంజర్‌పై భారీ అంచనాలు నెలకొన్నాయి.

శంకర్ బ్రాండ్, రామ్ చరణ్ ఇమేజ్ కారణంగా గేమ్ ఛేంజర్ ప్రీ రిలీజ్ బిజినెస్ ఓ రేంజ్‌లో జరిగిందని టాక్. నైజాంలో రూ. 43 కోట్ల బిజినెస్, ఆంధ్రాలో రూ.75 కోట్లు , సీడెడ్‌లో 25 కోట్ల రూపాయల మేర బిజినెస్ జరిగినట్టు సమాచారం. మొత్తంగా ఒక్క ఆంధ్రాలోనే ఈ సినిమా 100 కోట్ల మేర బిజినెస్ చేసుకొన్నది. ఇక నైజాంతో కలిపి 145 కోట్ల రూపాయల బిజినెస్‌ను తెలుగు రాష్ట్రాల్లో దక్కించుకుంది గేమ్ ఛేంజర్. ఈ సినిమా లాభాల్లోకి ప్రవేశించాలంటే.. కనీసం 150 కోట్ల రూపాయల షేర్, 300 కోట్ల రూపాయల గ్రాస్ వసూళ్లను సాధించాలి అని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి.
సినిమా వచ్చి 24 గంటలు గడవక ముందే గేమ్ ఛేంజర్ కోసం ఓటీటీ లవర్స్ ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. ఓటీటీ దిగ్గజం అమెజాన్ ప్రైమ్ .. గేమ్ ఛేంజర్ డిజిటల్ రైట్స్‌ను భారీ ధరకు దక్కించుకుందట. ఫిలింనగర్‌లో జరుగుతున్న ప్రచారాన్ని బట్టి తెలుగు సహా అన్ని భాషలు కలిపి గేమ్ ఛేంజర్ ఓటీటీ హక్కులను దాదాపు రూ. 104 కోట్లకు అమెజాన్ చేజిక్కించుకుందట. అయితే దీనిపై మేకర్స్ నుంచి అధికారికంగా ప్రకటన వెలువడాల్సి ఉంది.

నిబంధనల ప్రకారం.. థియేటర్‌లో రిలీజైన 5 వారాల తర్వాత ఏ సినిమా అయినా ఓటీటీలోకి రావాల్సి ఉంటుంది. దీనిని బట్టి ఫిబ్రవరి రెండవ వారంలో గేమ్ ఛేంజర్ ఓటీటీలోకి వచ్చే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. ఓ పది రోజులు గడిచిన తర్వాత సినిమా థియేట్రికల్ బిజినెస్‌ను బట్టి ఓటీటీ రిలీజ్ అన్నది ముందే జరగొచ్చు లేదంటే మరింత ఆలస్యం కావొచ్చు. ఏది ఏమైనప్పటికీ త్వరలోనే గేమ్ ఛేంజర్ ఓటీటీ రిలీజ్‌పై క్లారిటీ రానుంది.


Click it and Unblock the Notifications











