Gandeevadhari Arjuna OTT: వరుణ్ తేజ్ మూవీ డేట్ వచ్చేసింది.. థియేటర్ వెర్షన్ కాకుండా!

మెగా ఫ్యామిలీలో ఎంతో మంది హీరోలు ఉన్నా.. అందులో కొందరు మాత్రమే విశేషమైన గుర్తింపును సొంతం చేసుకుని సత్తా చాటుతున్నారు. అలాంటి వారిలో మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ఒకడు. ఫస్ట్ మూవీ నుంచే కథల ఎంపికలో జాగ్రత్తలు తీసుకుంటోన్న అతడు.. వైవిధ్యమైన చిత్రాలతో యమ అలరిస్తున్నాడు. అదే సమయంలో ఎన్నో హిట్లను కూడా ఖాతాలో వేసుకుని మార్కెట్‌ను, ఫాలోయింగ్‌ను పెంచుకున్నాడు. అయితే, 'గని' చిత్రంతో మాత్రం బిగ్గెస్ట్ డిజాస్టర్‌ను చవి చూశాడు.

ఈ సారి ఎలాగైనా సక్సెస్‌ను సొంతం చేసుకోవాలన్న పట్టుదలతో మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ 'గాండీవధారి అర్జున' అనే సినిమాను చేశాడు. ఫుల్ లెంగ్త్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా ఈ మూవీ తెరకెక్కింది. ప్రవీణ్ సత్తారు తెరకెక్కించిన ఈ మూవీకి అమెరికాలోని ప్రీమియర్స్ నుంచే మిక్స్‌డ్ టాక్ వచ్చింది. అలాగే, తెలుగు రాష్ట్రాల్లో కూడా దాదాపుగా అలాంటి టాక్‌ను అందుకుంది. దీంతో దీనికి వరల్డ్ వైడ్‌గా ఆడియెన్స్ నుంచి ఆశించిన స్థాయిలో రెస్పాన్స్ రాలేదు.

Gandeevadhari Arjuna Movie Streaming On Netflix From September 24th

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా ప్రవీణ్ సత్తారు తెరకెక్కించిన 'గాండీవధారి అర్జున' మూవీ బాక్సాఫీస్ వద్ద దారుణమైన రెస్పాన్స్‌తో నిరాశ పరిచింది. మంచి వీకెండ్ అడ్వాంటేజ్ ఉన్నా ఈ మూవీ ఫుల్ రన్‌లో వరల్డ్ వైడ్‌గా రెండు కోట్ల రూపాయల షేర్ కూడా రాబట్టలేదు. దీంతో ఈ సినిమా ఏకంగా రూ. 16 కోట్లకు పైగానే నష్టాలను చవి చూసింది. దీంతో వరుణ్ కెరీర్‌లో బిగ్గెస్ట్ డిజాస్టర్ మూవీగా మిగిలిపోయింది.

ఫుల్ లెంగ్త్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన 'గాండీవధారి అర్జున' మూవీపై నెలకొన్న అంచనాల కారణంగా.. దీని డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులకు తీవ్ర స్థాయిలో పోటీ ఏర్పడింది. అందుకు అనుగుణంగానే ఓటీటీ దిగ్గజం నెట్‌ఫ్లిక్స్ సంస్థ ఈ మూవీ డిజిటల్ రైట్స్‌ను భారీ ధరకు దక్కించుకుంది. అంతేకాదు, థియేటర్లలో విడుదలైన 30 రోజుల తర్వాతనే ఈ చిత్రాన్ని ఓటీటీలో స్ట్రీమింగ్ చేసేలా నిర్మాతలు ఒప్పందం చేసుకున్నారని తెలిసింది.

Gandeevadhari Arjuna Movie Streaming On Netflix From September 24th

అందుకు అనుగుణంగానే వరుణ్ తేజ్ 'గాండీవధారి అర్జున' సెప్టెంబర్ 24 నుంచి స్ట్రీమింగ్‌ కానున్నట్లు తాజాగా నెట్‌ఫ్లిక్స్ సంస్థ ప్రకటించింది. అయితే, ఇందులో థియేటర్ వెర్షన్ కాకుండా కొన్ని సీన్స్ కలిపి, కొన్నింటినీ తీసేసి మరీ అందుబాటులోకి తీసుకు వస్తున్నట్లు తెలిసింది. దీంతో దీనిపై అందరిలోనూ ఆసక్తి నెలకొంది.

'గాండీవధారి అర్జున' మూవీని శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర (SVCC) బ్యానర్‌పై బీవీఎస్‌ఎన్ ప్రసాద్ నిర్మిస్తున్నారు. ఇందులో సాక్షి వైద్య హీరోయిన్‌గా.. నాజర్, విమలా రామన్, వినయ్ రాజ్, అభినవ్ గోమటం కీలక పాత్రలు చేశారు. దీనికి మిక్కీ జే మేయర్ సంగీతాన్ని అందించాడు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X