Garudan on OTT: 50 కోట్లు కుమ్మేసిన మూవీని ఎక్కడ చూడొచ్చంటే? రిలీజ్ డేట్ ఎప్పుడో తెలుసా?

తమిళంలో పాపులర్ కమెడియన్ సూరి, శశికుమార్, ఉన్న ముకుందన్ లాంటి యాక్టర్లు నటించిన చిత్రం గరుడన్. యువ దర్శకుడు ఆర్ఎస్ సెంథిల్ కుమార్ డైరెక్షన్లలో వచ్చిన ఈ సినిమా మే 31న రిలీజ్ అయింది. ఈ సినిమా కేవలం క్రిటిక్స్ ప్రశంసలే కాకుండా బాక్సాఫీస్ వద్ద భారీ కలెక్షన్లు సాధించింది. అయితే ఈ సినిమా థియేట్రికల్ రన్ ఎలా సాగింది? ఈ మూవీ ఓటీటీలో ఎప్పుడు, ఎక్కడ రిలీజ్ కాబోతున్నది? అనే వివరాల్లోకి వెళితే..

యాక్షన్, కామెడీ చిత్రంగా సమాజంలో జరుగుతున్న ఓ క్లిష్టమైన పాయింట్‌ను కథగా తీసుకొని ఈ మూవీని తెరకెక్కించారు. ఈ సినిమాకు సంబంధించిన ఆర్టిస్టులు, టెక్నిషియన్స్, ప్రమోషన్స్ ఖర్చులు అన్నీ కలిపి ఈ సినిమాను సుమారుగా 20 కోట్ల రూపాయల బడ్జెట్‌తో రూపొందింంచారు. ఈ సినిమా 30 కోట్ల గ్రాస్ కలెక్షన్లు టార్గెట్‌గా బరిలోకి దూకింది.

Garudan Tamil movie ready to hit OTT Here is the release date details

అయితే కమెడియన్ సూరి నటించిన సినిమాకు బాక్సాఫీస్ వద్ద అదిరిపోయేలా కలెక్షన్లు నమోదు అయ్యాయి. ఈ చిత్రం తమిళం, ఇతర రాష్ట్రాల్లో కలిపి 45 కోట్ల గ్రాస్, 40 కోట్ల రూపాయల షేర్ వసూలు చేసింది. ఇక ఓవర్సీస్‌లో ఈ సినిమాకు రికార్డు వసూళ్లు నమోదు అయ్యాయి. దాంతో ఈ సినిమా సుమారుగా 55 కోట్ల రూపాయలు వసూళ్లను సాధించింది.

ఇక థియేట్రికల్‌ రిలీజ్‌ను చూడలేకపోయిన ప్రేక్షకులు ఈ సినిమాను ఓటీటీలో చూసేందుకు సిద్దంగా ఉన్నారు. అయితే సాధారణంగా ఏ సినిమా అయినా కనీసం 8 వారాల గడువు తర్వాత ఓటీటీ రిలీజ్ చేయాలనే నిబంధన ఉన్న కారణంగా ఈ మూవీ త్వరలోనే అంటే.. జూలై 2వ వారంలో అంటే జూలై 12వ తేదీన రిలీజ్ చేయాలని చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తున్నది.

Garudan Tamil movie ready to hit OTT Here is the release date details

అయితే గరుడన్ సినిమా సూపర్ హిట్ కావడంతో ఓటీటీ రైట్స్ కోసం భారీగా పోటీ నెలకొన్నట్టు తమిళ ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. ఈ సినిమా హక్కులను చేజిక్కించుకోవడానికి నెట్ ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్ వీడియో, డిస్నీ+హాట్ స్టార్ ప్రయత్నిస్తున్నాయి. అయితే ఈ సినిమాకు డిమాండ్ ఉండటంతో ఫ్యాన్సీ రేటును నిర్మాతలు కోట్ చేసినట్టు తెలుస్తున్నది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X