సైలెంట్‌గా OTTలోకి వచ్చేసిన గౌతమ్ మీనన్ రీసెంట్ థ్రిల్లర్ మూవీ.. ఎక్కడ చూడాలంటే?

ప్రతీవారం ఓటీటీలోకి సరికొత్త సినిమాలు వస్తున్నాయి. చిన్నా, పెద్దా, హిట్టా, ఫట్టా అనే తేడా లేకుండా అన్ని చిత్రాలు ఓటీటీలో సందడి చేస్తూ సెన్సేషన్ క్రియేట్ చేస్తున్నాయి. ముఖ్యంగా అందరూ ఇష్టపడే థ్రిల్లర్, హార్రర్ చిత్రాల హవా ఎక్కువగా కొనసాగుతుండగా.. మరో సూపర్ థ్రిల్లర్ సినిమా సైలెంట్ గా ఓటీటీలోకి వచ్చేసింది. ది గ్రేట్ డైరెక్టర్ గౌతమ్ వాసుదేవ్ మీనన్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా ప్రస్తుతం ఎక్కడ స్ట్రీమింగ్ అవుతుందో మనం ఇప్పుడు తెలుసుకుందాం.

గౌతమ్ వాసుదేవ్ మీనన్ దరకత్వంలో వచ్చిన రీసెంట్ యాక్షన్ థ్రిల్లర్ మూవీయే జాషువా. తమిళ భాషలో తెరకెక్కిన ఈ సినిమాను ఇషారి కె గణేష్ నిర్మించారు. ఈ సినిమాలో వరుణ్ టైటిల్ రోల్‌లో నటించగా, కృష్ణతో పాటు కొత్త నటి రాహేయ్ లు ప్రధాన పాత్రల్లో నటించి మెప్పించారు. కార్తీక్ సంగీతం అందించగా.. ఎస్ ఆర్. కతిర్, ఆంథోనిలు ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ, ఎడిటింగ్‌ బాధ్యతలను నిర్వహించారు. 2019లోనే ఈ సినిమా షూటింగ్ ప్రారంభం కాగా.. కరోనా కారణంగా మధ్యలో ఆగిపోయింది.

Gautham Vasudev Menon Action Thriller Movie Jousha Movie OTT Streaming Details Here

ఎట్టకేలకు 2022లో షూటింగ్ పూర్తి చేసుకోగా.. 2023లో పోస్ట్ ప్రొడక్షన్ పనులను కంప్లీట్ చేసుకుంటిద. ఎట్టకేలకు 2024 మార్చి 1వ తేదీన థియేటర్లలో గ్రాండ్ గా విడుదల అయింది. అయితే అంతా అనుకున్నట్లు మాత్రం ఈ సినిమా అందరినీ ఆకట్టుకోలేకపోయింది. డిజాస్టర్ గా మారి గౌతమ్ వాసుదేవ్ మీనన్ కు తీరని నిరాశను కల్గించింది. ఈ మధ్య కాలంలో గౌతమ్ వాసుదేవ్ మీనన్ చేసే సినిమాలు అన్నీ ఫ్లాపులుగా నిలుస్తుండగా.. జాషువా కూడా గట్టి దెబ్బ కొట్టింది.

ఒకప్పుడు సూపర్ డూపర్ హిట్ చిత్రాలు తెరకెక్కించిన గౌతమ్ వాసుదేవ్ మీనన్ ఈ మధ్య ఏ సినమా చేసినా నిరాశే మిగులుస్తోంది. ముఖ్యంగా థియేటర్ల వద్ద అట్టర్ ఫ్లాప్ గా నిలిచిన ఈ సినిమా తాజాగా ఓటీటీలోకి వచ్చేసింది. ముఖ్యంగా 28 రోజులు కూడా కాకముందే ప్రముఖ ఓటీటీ సంస్థ అయిన అమెజాన్ ప్రైమ్ వీడియో వేదికగా ప్రస్తుతం స్ట్రీమింగ్ అవుతుంది. థియేటర్ల వద్ద అలరించకపోయినా ఓటీటీలో సినిమా బాగానే సందడి చేస్తుంది.

Gautham Vasudev Menon Action Thriller Movie Jousha Movie OTT Streaming Details Here

ఎలాంటి చడీ చప్పుడు లేకుండా వచ్చిన ఈ సినిమాను మీరు కూడా ఓసారి అమెజాన్ ప్రైమ్ వీడియోలో చూసేయండి. ముఖ్యంగా హాట్ హాట్ సమ్మర్ లో మరింత హీటెక్కించే ఈ యాక్షన్ థ్రిల్లర్ చిత్రాన్ని ఫ్యామిలీతో కలిసి చూస్తూ.. వీలు దొరికినప్పుడు బాగా ఎంజాయ్ చేయండి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X