Geetha Subramanyam Season 3.. స్ట్రీమింగ్ ఎక్కడ? ఎప్పుడంటే?

వినోద రంగంలో ఓటీటీల ప్రభావం ఎక్కువ కావడంతో విభిన్నమైన కంటెంట్‌కు ప్రాధాన్యత పెరుగుతున్నది. మంచి కథ, కథనాలు, వినోదంతో కూడిన కంటెంట్‌ను ప్రేక్షకులు విశేషంగా ఆదరిస్తున్నారు. ఈ క్రమంలోనే రెండు సీజన్లను దిగ్విజయంగా పూర్తి చేసుకొన్న గీతా సుబ్రమణ్యం చిత్రం మూడో సీజన్‌కు సిద్దమైంది. ఈ సినిమా ఎక్కడ, ఎప్పుడు రిలీజ్ అవుతుందనే వివరాల్లోకి వెళితే..

గీతా సుబ్రహ్మణ్యం ఆహా ఓటీటీలో ఇప్పటికే రెండు సీజన్లను సక్సెస్‌పుల్‌గా పూర్తి చేసుకొన్నది. గీత, సుబ్రహ్మణ్యంగా సుప్రజ్ రంగా, అభిజ్ఞ్య ఉతలూరు మంచి ఫెర్ఫార్మెన్స్‌తో ఆకట్టుకొన్నారు. ప్రేమికుల మధ్య ఉండే చిరు తగాదాలు, అలకలు, గొడవల ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించారు. గత రెండు సీజన్లకు మంచి ఆదరణ లభించింది.

Geetha Subramanyam web series

గీతా సుబ్రహ్మణ్యం మూడో సీజన్ వివరాల్లోకి వెళితే. గీతా, సుబ్రహ్మణ్యంపైనే ఈ కథ నడుస్తుంది. సాఫ్ట్‌వేర్ ఉద్యోగులుగా బిజీ లైఫ్‌ను గడిపే వారిద్దరి జీవితాల్లో ఏం జరిగిందనేది ఆసక్తికరంగా ఉండబోతున్నదని చిత్ర యూనిట్ వెల్లడించింది. కథలో భాగంగా ఇద్దరు ఒక ప్రాజెక్టులో భాగస్వామ్యులను చేస్తుంది. అయితే వారిని ప్రాజెక్టులోకి తీసుకొనే ముందు ఎవరూ కూడా రిలేషన్‌షిష్‌లో ఉండకూడదని కండిషన్ పెడుతారు. ఆ తర్వాత ప్రేమికులుగా ఉన్న వారిద్దరి మధ్య ఏం జరిగిందనే విషయాన్ని ఆసక్తికరంగా చెప్పామని చిత్ర యూనిట్ తెలిపింది.

గత రెండు సీజన్లు మంచి ఆదరణకు నోచుకోవడంతో గీతా సుబ్రహ్మణ్యంపై ఆసక్తి నెలకొన్నది. శివసాయి వర్ధన్ దర్శకత్వం వహించారు. ఈ సిరీస్‌ 190 కిపైగా దేశాల్లో మంచి రెస్సాన్స్‌ను కూడగట్టుకొన్నది. దాంతో తమడా మీడియా రూపొందించిన ఈ మూడో సీజన్‌పై అంచనాలు పెరిగాయి.

లోకల్ కంటెంట్‌కు ప్రాధాన్యతను ఇస్తున్న ఆహా ఓటీటీ గీతా సుబ్రహ్మణ్యం మూడో సీజన్‌ను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నది. ఈ వెబ్ సిరీస్ మే 5వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానున్నది. మంచి అంచనాల మధ్య ఈ వెబ్ సిరీస్ ఆహాలో స్ట్రీమింగ్ కానున్నది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X