Bigg Boss Non Stop 2: షోలోకి ఇద్దరు లేడీ టైగర్స్.. మాజీ కంటెస్టెంట్లకు లక్కీ ఛాన్స్.. ఇంతకీ ఎవరంటే!
బిగ్ బ్రదర్ అనే ఇంగ్లీష్ షో ఆధారంగా రూపొంది.. ఇండియా వ్యాప్తంగా భారీ స్పందనను సొంతం చేసుకున్నదే బిగ్ బాస్. మరీ ముఖ్యంగా తెలుగులో ఇది మరింత ఎక్కువ రెస్పాన్స్‌ను సొంతం చేసుకుని సత్తా చాటింది. ఫలితంగా ఈ రియాలిటీ సీజన్ల మీద సీజన్లను పూర్తి చేసుకుంటూ ముందుకు సాగుతోంది.
ఇక, ఇటీవలే ఏడో సీజన్‌ను ఈ షో కంప్లీట్ చేసుకుంది. ఈ క్రమంలోనే ఇప్పుడు బిగ్ బాస్ నాన్ స్టాప్ రెండో సీజన్ తెరపైకి వచ్చింది. ఇందులోకి ఇద్దరు మాజీ కంటెస్టెంట్లను ఎంపిక చేసినట్లు తెలిసింది. ఇంతకీ వాళ్లెవరే మీరే చూసేయండి మరి!

ఆ సీజన్లు అన్నీ భారీ హిట్: ఏమాత్రం అంచనాలు లేకుండానే తెలుగులోకి వచ్చినా.. ఆడియెన్స్‌ను చూరగొన్న షో బిగ్ బాస్. అందుకే నిర్వహకులు క్రమం తప్పకుండా ప్రతి ఏడాది కనీసం ఒక సీజన్ ఉండేలా ప్లాన్ చేస్తున్నారు. ఇలా ఇప్పటికే ఏడు రెగ్యూలర్, ఒక ఓటీటీ వెర్షన్ సీజన్లను పూర్తి చేసుకుందీ షో. ఇవన్నీ భారీ రేటింగ్‌ను సొంతం చేసుకుని సూపర్ డూపర్ హిట్‌లుగా రికార్డులు క్రియేట్ చేశాయి.
ఈ సక్సెస్‌తో ఫుల్ జోష్‌లో: తెలుగులో ఇప్పటి వరకూ వచ్చిన సీజన్లు భారీ సక్సెస్ అవడంతో బిగ్ బాస్ నిర్వహకులు ఇటీవలే ఏడో దానిని నడిపించారు. ఉల్టా పుల్టా కాన్సెప్టుతో వచ్చిన ఇందులో గతంలో ఎన్నడూ చూడని కొత్త కంటెంట్‌ను తీసుకొచ్చి సక్సెస్‌ఫుల్‌గా పూర్తి చేసే ప్రయత్నం చేశారు. ఎన్నో ట్విస్టులతో సాగిన ఏడో సీజన్ ఫినాలేలో ప్రశాంత్ గెలిచాడు. ఈ ఫినాలే ఎపిసోడ్‌కు రికార్డు రేటింగ్ లభించింది.
ఓటీటీ సీజన్ 2 ఏర్పాట్లు: బిగ్ బాస్ ఏడో సీజన్ సూపర్ డూపర్ సక్సెస్ అవడంతో బిగ్ బాస్ నాన్ స్టాప్ సెకెండ్ సీజన్‌ను వీలైనంత త్వరగా ప్రారంభించి ఎలాగైనా సక్సెస్ చేయాలన్న పట్టుదలతో నిర్వహకులు ఉన్నారని తెలిసింది. ఇందులో భాగంగానే దీనికి సంబంధించిన పనులను కూడా మొదలు పెట్టేశారని ఇటీవలే తెలిసింది. ఫలితంగా ఈ సీజన్‌పైన కూడా అప్పుడే అంచనాలు ఏర్పడుతున్నాయి.
అప్పటి నుంచే మొదలు: బిగ్ బాస్ నాన్ స్టాప్ మొదటి సీజన్ మంచి స్పందనను అందుకున్న విషయం తెలిసిందే. దీంతో ఇప్పుడు రెండో సీజన్‌ను అంతకు మించేలా రెడీ చేయబోతున్నారట. దీన్ని వచ్చే ఫిబ్రవరి నుంచి ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు తెలిసింది. దీన్ని పది వారాల పాటు అంటే 70 రోజులు ప్రసారం చేయబోతున్నారని ఇప్పటికే సమాచారం బయటకు వచ్చేసింది.

మాజీ కంటెస్టెంట్లు కూడా: వచ్చే ఫిబ్రవరి నెలలో ప్రారంభం కాబోతున్న బిగ్ బాస్ నాన్ స్టాప్ రెండో సీజన్‌లోకి ఎలాంటి కంటెస్టెంట్లను తీసుకోవాలని అన్న దానిపై ఇప్పటికే నిర్వహకులు చర్చలు జరిపినట్లు సమాచారం లీకైంది. దీని ప్రకారం.. గత ఏడు రెగ్యూలర్ సీజన్ల నుంచి కొందరు కంటెస్టెంట్లను తీసుకోవాలని నిర్ణయించుకున్నట్లు తెలిసింది. అలాగే, కొందరు కొత్త వాళ్లను కూడా సెలెక్ట్ చేయబోతున్నారట.

ఇద్దరు లేడీ టైగర్లు ఫిక్స్: బిగ్ బాస్ నాన్ స్టాప్ రెండో సీజన్ కోసం కంటెస్టెంట్ల ఎంపికపై నిర్వహకులు అప్పుడే ఫోకస్ చేసినట్లు ప్రచారం జరుగుతోంది. ఇందులో భాగంగానే ఆరో సీజన్‌లోకి వచ్చి అనూహ్యంగా ఎలిమినేట్ అయిన గీతూ రాయల్, ఏడో సీజన్‌లో ఒకే వారం ఉన్న నయనీ పావనీలను నిర్వహకులు సెలెక్ట్ చేశారని తెలిసింది. వీళ్లిద్దరూ ఓటీటీ సీజన్‌లో సందడి చేయడం కన్ఫార్మ్ అని చెప్పొచ్చు.


Click it and Unblock the Notifications











