Bigg Boss Telugu 6 దొబ్బెయ్ ఇనయ.. నాకు తీట లేదు.. చంటిపై గీతూ ఫైర్.. భారీగా నామినేషన్ ఫైట్!

బిగ్‌బాస్ తెలుగు 6 రియాలిటీ షోలో మూడో వారం నామినేషన్ ప్రక్రియ రసాభసాగా మారింది. వీకెండ్ షోలో ఇంటి సభ్యులకు హోస్ట్ నాగార్జున క్లాస్ పీకడంతో ఎలిమినేషన్ కోసం జరిగిన ప్రక్రియ గందరగోళంగా మారింది. గీతూ, ఇనయ సుల్తానా, ఆదిరెడ్డి, వాసంతి, రేవంత్, సుదీప మధ్య భారీ వాగ్వాదం జరిగింది. అయితే ఈ నామినేషన్ల ప్రక్రియలో ఇంటి సభ్యుల మధ్య జరిగిన వాగ్వాదం ఎలా ఉందంటే?

 సిల్లీగా నామినేషన్ ప్రక్రియ

సిల్లీగా నామినేషన్ ప్రక్రియ

బిగ్‌బాస్ తెలుగు 6 షోలో రెండోవారం డబుల్ నామినేషన్‌లో ఇంటి సభ్యులకు షాక్ ఇచ్చాడు. గేమ్‌లో కంటెంట్ ఇవ్వకపోతే ఇంటి సభ్యులను బయటకు పంపించడం ఖాయమనే సంకేతాలు ఇచ్చారు. అయితే బిగ్‌బాస్ ఇచ్చిన వార్నింగ్ సిగ్నల్‌ అందుకొన్న కొందరు కంటెస్టెంట్లు పాయింట్ లేకుండా నామినేషన్ ప్రక్రియలో పాల్గొన్నారు. సిల్లీ కారణాలతో ఇంటి సభ్యులను నామినేషన్ చేశారు.

ఇనయ వర్సెస్ శ్రీ సత్య

ఇనయ వర్సెస్ శ్రీ సత్య

బిగ్‌బాస్ తెలుగు 6 నామినేషన్ ప్రక్రియలో ఇనయ సుల్తానా, శ్రీసత్య రెచ్చిపోయారు. నామినేషన్ ప్రక్రియలో శ్రీ సత్య పాల్గొంటూ ఇనయను టార్గెట్ చేసింది. ఇంటిలో ఎలాంటి పనులు చేయకుండా, టాస్కులు ఆడకుండా ముచ్చట్లతోనే కాలం గడిపేస్తున్నావు అని శ్రీ సత్యపై ఇనయా కామెంట్ చేసింది. దాంతో నేను పనిచేసినా చేయకపోయినా ఇలాంటి నిరాధారణ ఆరోపణలు చేస్తారు అంటూ ఇనయపై శ్రీ సత్య ఘాటుగా స్పందించారు.

గీతూ రాయల్ వర్సెస్ ఇనయ

గీతూ రాయల్ వర్సెస్ ఇనయ

ఇక ఇనయ సుల్తానా నామినేషన్ ప్రక్రియలో పాల్గొంటూ గీతూ రాయల్‌ను టార్గెట్ చేసింది. గేమ్ గురించి అంతా చదువుకొని వచ్చావు. స్ట్రాటేజీతో గేమ్ ఆడుతున్నావు. నీ ఆట అంతా ఫేక్. ఇంటి గురించి పట్టించుకోవడం తెలుసుకొని గేమ్ ఆడు అని ఇనయ సుల్తానా ఆరోపించింది. నేను ఫేక్ గేమ్ ఆడుతున్నానా? నిజాయితీగా ఆడుతానో నా ఇష్టం. నేను కాంపిటేషన్‌లో ఉంటే.. నేను గెలువాలని అనుకొంటాను. నేను కాంపిటీషన్‌లో లేకుంటే నాకు నచ్చిన వాళ్లు గెలువాలని కోరుకొంటాను గీతూ తన వాదన వినిపించింది

సహనం కోల్పోయిన గీతూ

సహనం కోల్పోయిన గీతూ

అయితే ఇంటిలోకి వచ్చినప్పటి నుంచి నీవు ఫేక్‌గా ఆడుతున్నావు. నీ మాట మీద నిలబడటం లేదు. నీవు నిలబడకుండా వేరే వాళ్లకు నీతులు ఎలా చెబుతావు? అని ఇనయ సుల్తానా అంటే.. నేను చెప్పే మాటలు విను. నా మాటలు వినకుండా పాట పడకు అని గీతూ ఫైర్ అయింది. అయితే తనను మాట్లాడనివ్వకుండా ఇనయ అడ్డుపడటంతో గీతూ సహనం కోల్పోయింది.

దొబ్బెయ్ అంటూ ఇనయపై ఫైర్

దొబ్బెయ్ అంటూ ఇనయపై ఫైర్

ఇనయ సుల్తానా, గీతూ రాయల్ మధ్య హోరాహోరీగా వాగ్వాదం జరిగింది. ఓ దశలో ఒకరికి వినపడకుండా మరొకరు అరుచుకొన్నారు. అయితే తన మాటలు వినిపించకోకుండా ఇనయ మాట్లాడుతుంటే.. దొబ్బేయ్.. దొబ్బేయ్ అంటూ గీతూ అరిచింది. ఆ తర్వాత ఇంటి నుంచి నువ్వే దొబ్బెయ్ అని ఇనయా వాగ్వాదానికి దిగారు. వారిద్దరి మధ్య అలా వాగ్వాదంతో నామినేషన్ ముగిసింది.

సంస్కారం లేదంటూ చంటి

సంస్కారం లేదంటూ చంటి

ఇక చలాకీ చంటి, గీతూ రాయల్ మధ్య భారీగా గొడవ జరిగింది. సంస్కారం ఉండాలి అంటూ చంటి చేసిన వ్యాఖ్యలకు గీతూ ఘాటుగా స్పందించింది. మీరు గతవారం సంస్కారం అంటూ నన్ను నామినేట్ చేశారు. ఇప్పుడు మీరు సంస్కారం గురించి మాట్లాడకు అని జవాబిచ్చింది. అయితే చలాకీ చంటి అలాగే ఆరోపణలు చేయడంతో.. నాకు తీట లేదు అంటూ గీతూ వ్యాఖ్యలు చేసింది. ఇలా వాడివేడిగా వాదనలు నామినేషన్ ప్రక్రియలో చోటు చేసుకొన్నాయి.

3వ వారం నామినేట్ అయింది వీరే

3వ వారం నామినేట్ అయింది వీరే

ఇంటి సభ్యుల నామినేషన్ ప్రక్రియ ముగిసిన తర్వాత మూడోవారం ఇంటి నుంచి బయటకు వెళ్లే ఛాన్స్ ఉన్న కంటెస్టెంట్ల నామినేషన్లను బిగ్‌బాస్ ప్రకటించారు. ఈ వారం ఇంటి నుంచి బయటకు వెళ్లడానికి అవకాశం ఉన్న సభ్యుల్లో వసంతి, బాలాదిత్య, చలాకీ చంటి, ఆరోహి రావు, నేహా చౌదరీ, ఇనయ సుల్తానా, శ్రీహాన్, రేవంత్, గీతూ రాయల్ ఉన్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X