బాలయ్య అన్‌స్టాపబుల్ షోకు రామ్ చరణ్ .. మరో బిగ్ సర్‌ప్రైజ్ కూడా, స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ హోస్ట్‌గా ప్రముఖ తెలుగు ఓటీటీ సంస్ధ ఆహాలో స్ట్రీమింగ్ అవుతున్న అన్‌స్టాపబుల్ విత్ ఎన్‌బీకే 3 సీజన్లను సక్సెస్‌ఫుల్‌గా కంప్లీట్ చేసుకుని నాలుగో సీజన్‌లోకి అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. ఈ ఏడాది విజయదశమి పర్వదినం సందర్భంగా సీజన్ 4 ప్రారంభమైంది. నాటి నుంచి పలువురు సెలబ్రెటీలను బాలయ్య తనదైన శైలిలో ఇంటర్వ్యూ చేస్తున్నారు.
అన్‌స్టాపబుల్ సీజన్ 4లో ఇప్పటి వరకు ఏడు ఎపిసోడ్‌లు స్ట్రీమింగ్ కాగా.. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, దుల్కర్ సల్మాన్, సూర్య, బాబీ డియోల్, అల్లు అర్జున్, శ్రీలీల, నవీన్ పోలిశెట్టి, విక్టరీ వెంకటేష్ హాజరయ్యారు. 7వ ఎపిసోడ్‌లో వెంకీ మామ, ఆయన సోదరుడు దగ్గుబాటి సురేష్ బాబు, మీనాక్షి చౌదరి, ఐశ్వర్య రాజేష్‌లు గెస్ట్‌లుగా వచ్చారు. ఈ ఎపిసోడ్‌కు మంచి వ్యూస్ రాగా.. నెక్ట్స్ ఎపిసోడ్‌కు గెస్ట్‌గా ఎవరు రానున్నారంటూ రకరకాల గాసిప్స్ వైరల్ అవుతున్నాయి.

నాలుగు సీజన్లలో బాలయ్య చాలా మంది సెలబ్రెటీలను కవర్ చేశారు. ఇంకొందరైతే రెండు మూడు సార్లు కూడా వచ్చి పాల్గొన్నారు. మెగాస్టార్ చిరంజీవి, అక్కినేని నాగార్జున, ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ వంటి స్టార్స్ ఇంకా ఈ షోకు హాజరుకాలేదు. ప్రధానంగా ఎన్టీఆర్ వస్తే చూడాలని నందమూరి అభిమానులు, తెలుగు ప్రేక్షకులు ఆశగా ఎదురుచూస్తున్నారు. అలాగే కొందరు దర్శకులు, నిర్మాతలు, నటీనటులను కూడా అన్‌స్టాపబుల్ షోకు తీసుకురావాలని కోరుతున్నారు.
ఇదిలాఉండగా.. అన్‌స్టాపబుల్ విత్ ఎన్‌బీకే 8వ ఎపిసోడ్‌కు గెస్ట్‌గా వచ్చేది ఎవరన్నది తెలిసిపోయింది. ఈ మేరకు ఆహా టీమ్ అధికారికంగా ప్రకటన చేసింది. ఆ వచ్చేది ఎవరో కాదు.. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్. '' ఒరేయ్ చిట్టిబాబు వస్తున్నాడు.. రీ సౌండ్ ఇండియా అంతా వినపడేలా చెయ్యండి అంటూ '' ఆహా టీమ్ రాసుకొచ్చింది.
రామ్ చరణ్ హీరోగా తమిళ దర్శక దిగ్గజం శంకర్ తెరకెక్కించిన గేమ్ ఛేంజర్ సంక్రాంతి కానుకగా జనవరి 10న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే సినిమాకు హైప్ తీసుకురావడానికి నిర్మాత దిల్‌రాజు తీవ్రంగా శ్రమిస్తున్నారు. ఈ నేపథ్యంలో బాలయ్య టాక్ షోను కూడా ప్రమోషనల్ కార్యక్రమానికి వాడుకోనున్నారు.
హీరో రామ్ చరణ్‌తో పాటు హీరోయిన్ కియారా అద్వానీ ఇతర చిత్ర యూనిట్ హాజరు కానున. డిసెంబర్ 31న హైదరాబాద్ అన్నపూర్ణ స్టూడియోస్‌లో చరణ్ ఎపిసోడ్ షూటింగ్ జరగనుందని ఫిలింనగర్ సర్కిల్స్‌లో ఓ వార్త వైరల్ అవుతోంది. అంతేకాదు రామ్ చరణ్ సతీమణి ఉపాసన కూడా మధ్యలో స్టేజ్ పై ఎంట్రీ ఇచ్చి సర్‌ప్రైజ్ చేస్తారని అంటున్నారు. అయితే అన్‌స్టాపబుల్ షోలో రామ్ చరణ్ గతంలో పాల్గొన్నాడు. కానీ అది నేరుగా కాదు.. ప్రభాస్ గెస్ట్‌గా వచ్చినప్పుడు చెర్రీకి బాలయ్య లైవ్‌లో ఫోన్ కాల్ చేసి ఆటపటిస్తారు. ఇకపోతే.. రామ్ చరణ్ ఎపిసోడ్‌ను ఎప్పుడు టెలికాస్ట్ చేస్తారో తెలియాల్సి ఉంది. బహుశా జనవరి 2న రామ్ చరణ్ ఎపిసోడ్ స్ట్రీమింగ్ అయ్యే అవకాశాలు ఉన్నాయని వెండితెర వర్గాలు చెబుతున్నాయి.


Click it and Unblock the Notifications











