సైలెంట్‌గా OTTలోకి వచ్చేసిన రీసెంట్ రొమాంటిక్ ఎంటర్‌టైనర్.. ఎందులో చూడాలంటే?
ఈ మధ్య కాలంలో అనేక సినిమాలు అతి త్వరగా ఓటీటీల్లోకి వచ్చేస్తున్నాయి. బాక్సాఫీసును షేక్ చేసిన భారీ బ్లాక్ బస్టర్ హిట్టు హిట్టు చిత్రాలు కూడా నెల రోజుల లోపే వచ్చేస్తున్నాయి. ఇక చిన్న చిత్రాల సంగతి అయితే చెప్పాల్సిన అవసరం లేదు. 15 రోజుల నుంచి ఓటీటీలోకి వచ్చి ఓటీటీ ప్రియులను అలరిస్తున్నాయి. అయితే తాజాగా తెలుగులో వచ్చిన ఓ రొమాంటిక్ ఎంటర్ టైనర్.. చడీచప్పుడు లేకుండా ఓటీటీలోకి వచ్చేసింది. అసలీ సినిమా థియేటర్లకు వచ్చిపోయిన విషయమే చాలా మందికి తెలియదు. అలా ఎక్కువ మంది ఈ సినిమా చూడలేదు. కానీ సంక్రాంతి సందర్భంగా ఓటీటీలోకి వచ్చేసిన ఈ సినిమా పేరేంటి, ఎక్కడ స్ట్రీమింగ్ అవుతుందో మనం ఇప్పుడు తెలుసుకుందాం.
మేఘ మిత్ర దర్శకత్వంలో.. జ్ఞానేశ్వరి కండ్రేగుల, భావన వజపండల్, నరేష్ అగస్త్య, ఆర్జే హేమంత్ లు ప్రధాన పాత్రల్లో వచ్చిన సినిమా "మాయలో". రొమాంటిక్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమా కథ బాగానే ఉంది. కానీ చిన్న చిత్రం కావడం అందులోనూ.. పెద్ద పెద్ద సినిమాలు థియేటర్లు ఉండడంతో ఈ సినిమా పట్టించుకున్న నాథుడే లేకుండా పోయాడు. షాలిని నంబు, రాధాకృష్ణ నంబులు ప్రొడ్యూసర్లుగా వ్యవహరించిన ఈ చిత్రం డిసెంబర్ 15వ తేదీన థియేటర్లలో విడుదల అయింది. వారం రోజుల పాటు అయిన థియేటర్లలో కొనసాగిందో లేదో కూడా తెలియదు.

కానీ సైలెంట్ మాయలో సినిమా ఓటీటీలోకి వచ్చేసింది. ప్రముఖ ఓటీటీ సంస్థ అయిన అమెజాన్ ప్రైమ్ వీడియో వేధికగా ప్రస్తుతం ఈ చిత్రం స్ట్రీమింగ్ అవుతుంది. జనవరి 16వ తేదీ నుంచి ఓటీటీలో సందడి చేస్తున్న ఈ సినిమాను టైం పాస్ కు ఈజీగా చూసేయచ్చు. థియేటర్లకు వెళ్లడం ఇష్టం లేని ఎవరైనా సరే ఈ సినిమా ఓటీటీలో చూసి ఫుల్ గా ఎంజాయ్ చేసేయచ్చు. మీరు కూడా ఓసారి ఈ సినిమాను చూసి కాస్త ఎంజాయ్ చేయండి.

అసలు ఈ సినిమా కథ ఏంటంటే.. జ్ఞానేశ్వరి కండ్రేగుల, భావన, నరేష్ అగస్త్యలు చిన్నప్పటి నుంచి క్లోజ్ ఫ్రెండ్స్. అయితే జ్ఞానేశ్వరికి పెళ్లి ఫిక్స్ అవుతుంది. ఈక్రమంలోనే ఆమె తన పెళ్లికి రావాలంటూ చిన్ననాటి స్నేహితులు అయిన భావన, నరేష్ లకు ఫోన్ చేసి చెబుతుంది. వాళ్లు కూడా తమ స్నేహితురాలి పెళ్లికి వచ్చేందుకు సిద్ధం అవుతారు. ఇద్దరూ కలిసి ఓ కారను అద్దెకు తీసుకుని జ్ఞానేశ్వరి పెళ్లి కోసం బయలు దేరుతారు. అయితే ఈ జర్నీలో ఏం జరిగింది, నరేష్, భావనలు సక్రమంగానే ఇంటికి చేరారా లేదా అన్నదే అసలు కథ. జర్నీలో భాగంగా నరేష్, భావనల మధ్య రొమాన్స్ కూడా నడుస్తుంది. ఈ సినిమాను వీలున్నప్పుడు ఓసారి మీరూ చూసేయండి.


Click it and Unblock the Notifications











