ఒక్కరోజు ముందుగానే OTTలోకి అడ్వెంచరస్ ఫాంటసీ మూవీ.. వేల కోట్లు రాబట్టిన దీన్ని ఎలా చూడాలంటే?

హాలీవుడ్ చిత్రాలకు ఉన్న క్రేజ్ గురించి తెలుగు సినీ ప్రియులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అందులోనే యానిమల్ ఓరియంటెడ్ చిత్రాలకు, సూపర్ హీరోస్ చిత్రాలకు ఉన్న క్రేజ్ అయితే నెక్స్ట్ లెవెల్. వీటికి సంబంధించి ఏ సినిమా వచ్చినా థియేటర్లలకు వెళ్లి చూడడం మాత్రమే కాకుండా... ఓటీటీల్లో కూడా చూస్తుంటారు. అయితే ఇటీవలే వచ్చి సెన్సేషన్ క్రియేట్ చేసిన గాడ్జిల్లా x కాంగ్: ది న్యూ ఎంపైర్ మూవీ తాజాగా ఓటీటీలోకి రాబోతుంది. అయితే అంతా అనుకున్నట్లుగా కాకుండా అంతకంటే ఒక్కరోజు ముందుగానే ఈ మూవీ ఓటీటీలోకి వచ్చేస్తుంది. అయితే ఈ క్రేజీ అడ్వెంచరస్ ఫాంటసీ యాక్షన్ మూవీని ఎక్కడ, ఎప్పటి నుంచి చూడాలో మనం ఇప్పుడు తెలుసుకుందాం.

గాడ్జిల్లా వర్సెస్ కాంగ్ సినిమాకు సీక్వెల్ గా వచ్చిన గాడ్జిల్లా x కాంగ్: ది న్యూ ఎంపైర్ చిత్రాన్ని ఆడమ్ వింగార్డ్ తెరకెక్కించారు. అలాగే లెజెండరీ పిక్చర్స్ సంస్థ బ్యానర్‌లో థామస్ థుల్, టామ్ జాస్నీ సహా పలువురు నిర్మించారు. ఈ సినిమాలో రెబెక్కా హాల్, బ్రియాన్ టైరీ హెన్రీ, డాన్ స్టీవెన్స్, కైలీ హాట్ల్, అలెక్స్ ఫెర్న్స్, ఫాలా చెన్ నటించి మెప్పించారు. అలాగే హాల్, హెన్రీ, హాట్ల్ లు గత పాత్రలను కంటిన్యూ చేశారు. భారీ అంచనాల మధ్య విడుదల అయిన ఈ సినిమా అదే రేంజ్ లో వసూళ్లు సాధించింది.

Godzilla x Kong The New Empire Movie Going to Streaming on Amazon Prime Video Check Details

ముఖ్యంగా గాడ్జిల్లా x కాంగ్: ది న్యూ ఎంపైర్ మూవీ 522.9 మిలియన్ డాలర్లు వసూలు చేసింది. అయితే ఇండియన్ కరెన్సీలో ఇది రూ. 4359 కోట్లకు పైమాటే. ఈ రేంజ్ లో వసూల్లు రాబట్టిన ఈచిత్రం అనేక రికార్డులను క్రియేట్ చేసింది. క్రేజీ కాన్సెప్టుతో భారీ బడ్జెట్ తో తెరకెక్కించిన ఈ సినిమా థియేటర్లలో విడుదల అయిన తర్వాత తొందరగానే ఓటీటీలోకి వస్తుందని అంతా అనుకున్నారు. కానీ కాస్త ఆలస్యంగానే ఈ సినిమాలో ఓటీటీలోకి రాబోతున్నట్లు తెలిసింది.

ముఖ్యంగా గాడ్జిల్లా x కాంగ్: ది న్యూ ఎంపైర్ సినిమాను మే 14వ తేదీ నుంచి స్ట్రీమింగ్ చేయబోతున్నట్లు పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి. కానీ అంతా అనుకున్నట్లు 14వ తేదీ నుంచి కాకుండా ఒక్కరోజు ముందు నుంచి అంటే మే 13వ తేదీ నుంచే ఈ సినిమా స్ట్రీమింగ్ కాబోతున్నట్లు తెలుస్తోంది. అయితే రెంట్ విధానంలో ఈ మూవీ బీఎమ్ఎస్ స్ట్రీమ్ తో పాటు అమెదాన్ ప్రైమ్ వీడియో వేదికగా అందుబాటులోకి వస్తున్నట్లు సమాచారం. ముఖ్యంగా భారతదేశంలో ఈ చిత్రాన్ని ఇంగ్లీషుతో పాటు హిందీ, తెలుగు, తమిళ భాషల్లో తీసుకు రాబోతున్నారు.

Godzilla x Kong The New Empire Movie Going to Streaming on Amazon Prime Video Check Details

మరి ఇంకెందుకు ఆలస్యం ఈ క్రేజీ మూవీని కచ్చితంగా చూసి ఫుల్ గా ఎంజాయ్ చేయండి. డబ్బులు పోయినా పర్లేదు త్వరగా చూడాలనుకుంటే రెంటల్ విధానంలో చూసేయండి. లేదంటే గనుక కొంత కాలం ఆగాల్సిందే. అమెజాన్ ప్రైమ్ వీడియో చాలా రోజులుగా ఇదే పద్దతిని ఫాలో అవుతుంది. ముందుగా రెంటల్ విధానంలో అందుబాటులోకి తెచ్చి ఆ తర్వాత ఫ్రీగా చూసే వెసులుబాటు కల్పిస్తోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X