థియేటర్లలో ఉండగానే OTTలోకి వచ్చేసిన ఫాంటసీ థ్రిల్లర్.. అస్సలే మిస్ కాకండి సుమీ!
ఈ మధ్య కాలంలో అనేక క్రేజీ చిత్రాలు అతి త్వరగా ఓటీటీలోకి వచ్చేస్తున్నాయి. చిన్నా పెద్ద అనే సినిమాలే కాకుండా.. చిన్నా, పెద్దా హీరోలు చిత్రాలు అనే తేడా లేకుండా.. నెల తిరక్కముందే ఓటీటీలోకి వచ్చేస్తున్నాయి. ముఖ్యంగా అటు థియేటర్లలో ఉండగానే.. ఇటు ఓటీటీలో సందడి చేస్తున్నాయి. అలాంటి వాటిల్లోకి ఓ క్రేజీ మూవీ యాడ్ అయింది. ఇప్పటికే ఓటీటీలో అనే మంచి సినిమాలు ఉండగా.. తాజాగా మరో ఫాంటసీ అడ్వెంచరస్ ఫిల్మ్ ఓటీటీలోకి వచ్చేసింది. అయితే ఆ సినిమా ఏంటి, ఎక్కడ స్ట్రీమింగ్ అవుతుందో మనం ఇప్పుడు తెలుసుకుందాం.
గాడ్జిల్లా వర్సెస్ కాంగ్ సినిమాకు సీక్వెల్ గా వచ్చిన గాడ్జిల్లా x కాంగ్: ది న్యూ ఎంపైర్ చిత్రాన్ని ఆడమ్ వింగార్డ్ తెరకెక్కించారు. అలాగే లెజెండరీ పిక్చర్స్ సంస్థ బ్యానర్‌లో థామస్ థుల్, టామ్ జాస్నీ సహా పలువురు నిర్మించారు. ఈ సినిమాలో రెబెక్కా హాల్, బ్రియాన్ టైరీ హెన్రీ, డాన్ స్టీవెన్స్, కైలీ హాట్ల్, అలెక్స్ ఫెర్న్స్, ఫాలా చెన్ నటించి మెప్పించారు. అలాగే హాల్, హెన్రీ, హాట్ల్ లు గత పాత్రలను కంటిన్యూ చేశారు. భారీ అంచనాల మధ్య విడుదల అయిన ఈ సినిమా అదే రేంజ్ లో వసూళ్లు సాధించింది.

ముఖ్యంగా గాడ్జిల్లా x కాంగ్: ది న్యూ ఎంపైర్ మూవీ 522.9 మిలియన్ డాలర్లు వసూలు చేసింది. అయితే ఇండియన్ కరెన్సీలో ఇది రూ. 4300 కోట్లకు పైమాటే. ఈ రేంజ్ లో వసూల్లు రాబట్టిన ఈచిత్రం అనేక రికార్డులను క్రియేట్ చేసింది. క్రేజీ కాన్సెప్టుతో భారీ బడ్జెట్ తో తెరకెక్కించిన ఈ సినిమా థియేటర్లలో విడుదల అయిన తర్వాత తొందరగానే ఓటీటీలోకి వస్తుందని అంతా అనుకున్నారు. కానీ కాస్త ఆలస్యంగానే ఈ సినిమాలో ఓటీటీలోకి రాబోతున్నట్లు తెలిసింది.
ముఖ్యంగా గాడ్జిల్లా x కాంగ్: ది న్యూ ఎంపైర్ సినిమాను మే 14వ తేదీ నుంచి స్ట్రీమింగ్ చేయబోతున్నట్లు పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి. కానీ అంతా అనుకున్నట్లు 14వ తేదీ నుంచి కాకుండా ఒక్కరోజు ముందు నుంచి అంటే మే 13వ తేదీ నుంచే ఈ సినిమా స్ట్రీమింగ్ కాబోతున్నట్లు కూడా చెప్పుకొచ్చారు. కానీ ఇదంతా ఫేక్ యే అని తెలిసింది. ముఖ్యంగా అమెజాన్ ప్రైమ్ వీడియో వేదికగా కాకుండా ఈ సినిమా సైలెంట్ గా మరో ఓటీటీ ప్లాట్ ఫారమ్ లో స్ట్రీమింగ్ అవుతుంది. ముఖ్యంగా బుక్ మై షో స్ట్రీమ్ లో అందుబాటులోకి వచ్చేసింది.

కానీ ఈ సినిమా ఫ్రీగా చూసే అవకాశం మాత్రం లేదు. బుక్ మై షో స్ట్రీమ్ లో ఈ సినిమా చూడాలంటే రెంటల్ విధానంలో డబ్బులు చెల్లించాల్సిందే. ముఖ్యంగా.. రూ.549 చెల్లిస్తేనే ఈ సినిమా చూసేయొచ్చు. అయితే కొనాలంటే మాత్రం రూ.799 చెల్లించాలి. ఇలా భారీ ధరలు చెల్లిస్తే ఈ సినిమాను తెలుగుతో పాటు హిందీ, తమిళ భాషల్లో చూడాలి. ఈ సినిమా రేపటి నుంచి అంటే మే 14వ తేదీ నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియో వేదికగా స్ట్రీమింగ్ కాబోతున్నట్లు తెలుస్తోంది. అయితే దీంట్లో కూడా రేపటి నుంచి రెంటల్ విధానంలో అందుబాటులో ఉండనుంది. వెంటనే చూడాలంటే డబ్బులు చెల్లించండి, లేదంటే ఇంకా కొంత కాలం ఆగండి.


Click it and Unblock the Notifications











