ఓటీటీలోకి 4359 కోట్ల సినిమా.. ఒళ్లు గగుర్పొడిచేలా చేసే ఇది ఎందులో వస్తుందంటే!
వరల్డ్ వైడ్‌గా మిగిలిన ఇండస్ట్రీలతో పోల్చుకుంటే హాలీవుడ్ నుంచి వచ్చే చిత్రాలు మరింతగా హైలైట్ అవుతూ ఉంటాయి. అక్కడ తెరకెక్కే సినిమాలు హై రేంజ్ విజువల్స్, ఫుల్ లెంగ్త్ టెక్నాలజీ, భారీ బడ్జెట్‌తో ఎంతో ఉన్నతంగా రూపొందుతుంటాయి. అందుకే హాలీవుడ్ మూవీలకు మంచి స్పందన దక్కుతుంటుంది. మరీ ముఖ్యంగా యానిమల్ బ్యాగ్‌డ్రాప్‌తో వచ్చే చిత్రాలు మరింత సక్సెస్ అవుతున్నాయి. అలాంటి వాటిలో 'గాడ్జిల్లా', 'కాంగ్' సిరీస్‌లు సూపర్ సక్సెస్ అయ్యారు. దీంతో ఈ రెండూ కలిపి పలు సినిమాలు కూడా రూపొందించారు.
గతంలో వచ్చిన 'గాడ్జిల్లా వర్సెస్ కాంగ్' మూవీకి కొనసాగింపుగా ఇప్పుడు రాబోతున్న మరో చిత్రమే 'గాడ్జిల్లా x కాంగ్: ది న్యూ ఎంపైర్'. ఆడమ్ వింగార్డ్ దర్శకత్వంలో లెజెండరీ పిక్చర్స్ సంస్థ బ్యానర్‌లో వచ్చిన ఈ చిత్రంపై అంచనాలు భారీ స్థాయిలో ఏర్పడ్డాయి. అందుకు అనుగుణంగానే దీన్ని ప్రపంచ వ్యాప్తంగా అత్యధిక థియేటర్లలో విడుదల చేసిన విషయం తెలిసిందే.

అత్యంత భారీ బడ్జెట్‌తో విజువల్ వండర్‌గా వచ్చిన 'గాడ్జిల్లా x కాంగ్: ది న్యూ ఎంపైర్' చిత్రానికి అన్ని వర్గాల ప్రేక్షకుల నుంచి అదిరిపోయే రీతిలో స్పందన దక్కింది. దీంతో ఈ మూవీకి కలెక్షన్లు కూడా పోటెత్తాయి. ఇలా ఫుల్ రన్‌లో ఈ మూవీ 522.9 మిలియన్ డాలర్లు.. అంటే ఇండియన్ కరెన్సీలో రూ. 4359 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టి ఎన్నో రికార్డులను బ్రేక్ చేసింది.
క్రేజీ కాన్సెప్టుతో హైబడ్జెట్ పెట్టి రూపొందిన 'గాడ్జిల్లా x కాంగ్: ది న్యూ ఎంపైర్' మూవీ థియేటర్లలో అదిరిపోయే రెస్పాన్స్‌ను అందుకుని సక్సెస్ అయింది. దీంతో ఇది వీలైనంత త్వరగానే ఓటీటీలోకి వచ్చేస్తుందని అంతా అనుకున్నారు. కానీ, అది మాత్రం జరగలేదు. ఇలాంటి పరిస్థితుల్లో తాజాగా ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ గురించి ఓ క్రేజీ న్యూస్ బయటకు వచ్చింది.

తాజా సమాచారం ప్రకారం.. 'గాడ్జిల్లా x కాంగ్: ది న్యూ ఎంపైర్' సినిమాను మే 14వ తేదీ నుంచి స్ట్రీమింగ్ చేయబోతున్నట్లు తెలిసింది. ఈ మూవీ యూఎస్, యూకేలో PVODలో అందుబాటులోకి రాబోతుంది. అలాగే, ఇండియాలో అమెజాన్ ప్రైమ్ సంస్థ స్ట్రీమింగ్ చేయబోతుంది. ఇక్కడ ఈ చిత్రం ఇంగ్లీష్, హిందీ, తెలుగు, తమిళంలో అందుబాటులో ఉంటుందని తాజాగా తెలుస్తోంది.
ఇదిలా ఉండగా.. 'గాడ్జిల్లా x కాంగ్: ది న్యూ ఎంపైర్' మూవీలో రెబెక్కా హాల్, బ్రియాన్ టైరీ హెన్రీ సహా పలువురు స్టార్లు నటించారు. దీన్ని థామస్ థుల్, టామ్ జాస్నీ సహా పలువురు నిర్మించారు. ఈ చిత్రానికి టామ్ హాల్క్‌బర్గ్, ఆంటోనియోలు సంగీతాన్ని అందించారు.


Click it and Unblock the Notifications











