OTT ఓటీటీలోకి 3650 కోట్లు కలెక్ట్ చేసిన మాన్‌స్టర్ మూవీ.. ఎప్పుడు? ఎక్కడ? రిలీజ్ అంటే?

ప్రపంచవ్యాప్తంగా అత్యంత పాపులారిటీ ఉన్న మాన్‌స్టర్ చిత్రాల్లో గాడ్జిల్లా, కాంగ్ చిత్రాలు ముందు వరుసలో ఉంటాయి. 2021 సంవత్సరంలో గాడ్జిల్లా వర్సెస్ కాంగ్ సినిమాకు సీక్వెల్‌గా రూపొందిన గాడ్జిల్లా వర్సెస్ కాంగ్: ది న్యూస్ ఎంపైర్ అనే సినిమా మార్చి 29వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా వరల్డ్ వైడ్‌గా రికార్డు కలెక్షన్లు వసూలు చేసిన తర్వాత ఓటీటీలోకి వచ్చేందుకు సిద్దమవుతున్నది. ఈ సినిమా ఓటీటీ వివరాల్లోకి వెళితే..

వార్నర్ బ్రదర్స్ పిక్చర్స్ బ్యానర్‌పై లెజెండరీ పిక్చర్స్ నిర్మాతగా ఆడమ్ వింగార్డ్ దర్శకత్వం వహించిన చిత్రం గాడ్జిల్లా వర్సెస్ కాంగ్: ది న్యూ ఎంపైర్. మాన్‌స్టర్ వెర్సే సిరీస్‌లో ఈ చిత్రం ఐదోవది కావడం విశేషంగా మారింది. గాడ్జిల్లా సిరీస్‌లో 38వ సినిమాగా, కాంగ్ సిరీస్‌లో 13వ చిత్రంగా తెరకెక్కింది. ఈ చిత్రంలో రెబెకా హాల్, బ్రియన్ టైరీ హెన్నీ, డాన్ స్టీవెన్స్ తదితరులు నటించారు.

Godzilla x Kong The New Empire OTT Streaming details Monster Movie release date OTT name here

మార్చి చివరి వారంలో ప్రపంచవ్యాప్తంగా రిలీజైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద వసూళ్ల సునామీని మరిపించింది. ఈ చిత్రం ఇండియాలో 90 కోట్ల రూపాయలు నికర వసూళ్లను, 110 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టింది. ఇక అమెరికేతర దేశాల్లో ఈ చిత్రం 2350 కోట్ల రూపాయలు రాబట్టింది. అమెరికాలో ఈ చిత్రం 1000 కోట్ల రూపాయల కలెక్షన్లు వసూలు చేసింది. మొత్తంగా ఈ సినిమా 3650 కోట్ల రూపాయలు బాక్సాఫీస్ వద్ద రిలీజ్ చేసింది.

హాలీవుడ్ డిజిటల్ మీడియా అసోసియేషన్ నిబంధనల ప్రకారం ప్రతీ చిత్రం విడుదలైన తర్వాత 45 రోజుల అనంతరం ఓటీటీలో రిలీజ్ చేయాలని అగ్రిమెంట్ ఉంది. ఈ రూల్ ప్రకారం ఈ మూవీ.. మే మూడో వారంలో ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుంది. అయితే తొలుత ఈ సినిమాను రెంట్ బేస్డ్‌గా రిలీజ్ చేసి ఆ తర్వాత ఇతర ఓటీటీ ప్రేక్షకులకు ఉచితంగా అందుబాటులోకి తీసుకు రానున్నారు.

Godzilla x Kong The New Empire OTT Streaming details Monster Movie release date OTT name here

ఇక గాడ్జిల్లా వర్సెస్ కాంగ్: ది న్యూస్ ఎంపైర్ చిత్రం ఓటీటీ రైట్స్ భారీ రేటుకు అమ్ముడుపోయాయి. ఈ మూవీ డిజిటల్ స్ట్రీమింగ్ రైట్‌ను అమెజాన్ ప్రైమ్ వీడియో సొంతం చేసుకొన్నది. తాజా సమాచారం ప్రకారం.. మే 17వ తేదీన స్ట్రీమింగ్ అవుతుందనే విషయాన్ని ఓటీటీ వర్గాలు వెల్లడించాయి. ఇక ఈ సినిమా ఓటీటీలో కూడా రికార్డులు తిరగ రాయడం ఖాయమనే అభిప్రాయం వ్యక్తమవుతున్నది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X