Good Bad Ugly OTT Release : ఓటీటీలోకి గుడ్ బ్యాడ్ అగ్లీ .. అజిత్ మూవీ స్ట్రీమింగ్ ఎప్పుడు? ఎందులో అంటే?
కోలీవుడ్ సూపర్‌స్టార్ అజిత్ కుమార్ లేటెస్ట్ మూవీ గుడ్ బ్యాడ్ అగ్లీ. త్రిష కృష్ణన్ ఈ చిత్రంలో హీరోయిన్‌గా నటిస్తున్నారు. టీజర్, ట్రైలర్, ఫస్ట్ లుక్ పోస్టర్లతో భారీ అంచనాలు నెలకొన్న ఈ యాక్షన్ థ్రిల్లర్ ఏప్రిల్ 10వ తేదీ ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా రిలీజైంది. విదాముయార్చితో అభిమానులను నిరాశపరిచిన అజిత్.. ఈసారి హిట్ కొట్టాలని ఫ్యాన్స్ బలంగా కోరుకుంటున్నారు. అయితే ఈ సినిమా ఓటీటీ రిలీజ్ ఎప్పుడా అని ఆ సెక్షన్ ఆడియన్స్ ఎదురుచూస్తున్నారు. గుడ్ బ్యాడ్ అగ్లీ ఓటీటీ వివరాల్లోకి వెళితే..
విదాముయార్చి విడుదలై రోజులు తిరక్కుండానే గుడ్ బ్యాడ్ అగ్లీతో ప్రేక్షకులను పలకరించారు అజిత్ కుమార్. అధిక్ రవిచంద్రన్ దర్శకత్వం వహించగా.. జీవీ ప్రకాష్ కుమార్ స్వరాలు సమకూర్చారు. ప్రభు, అర్జున్ దాస్, ప్రసన్న, సునీల్, రాహుల్ దేవ్, యోగి బాబు, ప్రియా ప్రకాష్ వారియర్, టామ్ చాకో తదితరులు గుడ్ బ్యాడ్ అగ్లీలో కీలకపాత్రలు పోషించారు.

నటీనటులు, సాంకేతిక నిపుణుల రెమ్యునరేషన్, ప్రమోషనల్ కార్యక్రమాలతో కలిపి గుడ్ బ్యాడ్ అగ్లీకి దాదాపు రూ.220 కోట్లకు పైగా బడ్జెట్ అయ్యింది. అజిత్ క్రేజ్, ప్రమోషనల్ కార్యక్రమాలతో గుడ్ బ్యాడ్ అగ్లీకి అదిరిపోయే రేంజ్‌లో ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. తెలుగులో రూ.5 కోట్ల రేంజ్‌లో వ్యాపారం జరగ్గా.. ఇక్కడ బ్రేక్ ఈవెన్ కావాలంటే రూ.6 షేర్ , రూ.12 కోట్ల గ్రాస్ రాబట్టాల్సి ఉంది. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళం , రెస్టాఫ్ ఇండియా + ఓవర్సీస్ కలిపి ప్రపంచవ్యాప్తంగా గుడ్ బ్యాడ్ అగ్లీకి రూ.114 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగిందని ట్రేడ్ పండితులు చెబుతున్నారు.
రొమియోక్చర్స్ తమిళనాడు థియేట్రికల్ రైట్స్‌ని, కేవీఎన్ ప్రొడక్షన్స్ కర్ణాటక థియేట్రికల్ రైట్స్‌ని, శ్రీగోకులం మూవీస్ కేరళ థియేట్రికల్ రైట్స్‌ని, ప్రత్యంగిరా సినిమాస్ యూఎస్ థియేట్రికల్ రైట్స్‌ని సొంతం చేసుకున్నాయి. అంటే అజిత్ సినిమా లాభాల్లోకి రావాలంటే.. రూ.115 కోట్ల షేర్, రూ.230 కోట్ల గ్రాస్ రాబట్టాలని విలువ కట్టారు. ఏప్రిల్ 10న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా రిలీజ్ అయ్యింది గుడ్ బ్యాడ్ అగ్లీ. ఒక్క తమిళనాడులోనే తొలి రోజు ఏకంగా 2400 స్క్రీన్‌లలో ఈ సినిమాను విడుదల చేస్తుండటం విశేషం. అడ్వాన్స్ బుకింగ్‌లోనే గుడ్ బ్యాడ్ అగ్లీ టికెట్లు హాట్ కేకుల్లా అమ్ముడయ్యాయి. తొలి రోజు ఈ చిత్రం దాదాపు రూ. 30 నుంచి రూ.40 కోట్ల ఓపెనింగ్స్ రాబడుతుందని ట్రేడ్ పండితులు అంచనా వేస్తున్నారు.
సినిమా రిలీజై గంటలు గడవకముందే గుడ్ బ్యాడ్ అగ్లీని ఓటీటీలో ఎప్పుడు చూస్తామా అని అజిత్ అభిమానులు ఎదురుచూస్తున్నారు. ఈ సినిమా ఓటీటీ వివరాలు పరిశీలిస్తే. ఓటీటీ దిగ్గజం నెట్‌ఫ్లిక్స్ .. గుడ్ బ్యాడ్ అగ్లీ డిజిటల్ రైట్స్‌ను ఏకంగా రూ.95 కోట్ల ఫ్యాన్సీ రేటుకు దక్కించుకున్నట్లుగా కోలీవుడ్ టాక్. థియేటర్‌లో రిలీజైన 5 నుంచి 6 వారాల తర్వాతే ఏ సినిమా అయినా ఓటీటీలోకి రావాలన్న నిబంధనను అనుసరించి గుడ్ బ్యాడ్ అగ్లీ మే రెండో వారంలో ఓటీటీలో స్ట్రీమింగ్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. థియేట్రికల్ బిజినెస్‌ను బట్టి ఓటీటీ రిలీజ్ త్వరగా రావొచ్చు, ఆలస్యం కూడా కావొచ్చునని విశ్లేషకులు అంటున్నారు. గుడ్ బ్యాడ్ అగ్లీ ఓటీటీ రిలీజ్‌పై త్వరలోనే నెట్‌ఫ్లిక్స్ అధికారిక ప్రకటన చేసే అవకాశం ఉంది.


Click it and Unblock the Notifications











