twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    Good Luck Jerry Review నిరాశపరిచిన జాన్వీ కపూర్.. ఆకట్టుకోలేకపోయిన నయనతార రీమేక్ మూవీ

    |

    Rating: 2.25/5

    నటీనటులు: జాన్వీ కపూర్, సమతా సుదీక్ష, మితా విశిష్ట్, నీరజ్ సూద్, సుశాంత్ సింగ్ తదితరులు
    దర్శకత్వం: సిద్దార్థ్ సేన్
    రచన: పంకజ్ మట్టా
    నిర్మాత: సుభాస్కరన్ అలీ రాజా, ఆనంద్ ఎల్ రాయ్, మహవీర్ జైన్
    సినిమాటోగ్రఫి: రంగరాజన్ రామభద్రన్
    ఎడిటింగ్: ప్రకాశ్ చంద్ర సాహూ, జుబిన్ షేక్
    మ్యూజిక్: అమిత్ పంత్, పరాగ్ చబ్రా
    బ్యానర్: లైకా ప్రొడక్షన్స్, కలర్ ఎల్లో ప్రొడక్షన్స్, మహావీర్ జైన్ ఫిల్మ్స్
    ఓటీటీ రిలీజ్: డీస్నీ+హాట్ స్టార్
    ఓటీటీ రిలీజ్ డేట్: 2022-07-29

    మధ్య తరగతి కుటుంబానికి చెందిన జెర్రీ అలియాస్ జయకుమారి (జాన్వీ కపూర్) ఓ మసాజ్ సెంటర్‌లో పనిచేస్తుంటుంది. అరకొర జీవితం, అనేక సమస్యలతో నెట్టుకొస్తున్న జెర్నీ తల్లికి క్యాన్సర్ వ్యాధి అని తెలుస్తుంది. క్యాన్సర్ చికిత్సకు 20 లక్షలకుపైగా డబ్బు ఖర్చు అవుతుందని వైద్యులు చెబుతారు. ఈ క్రమంలో ఊహించని విధంగా డ్రగ్ మాఫియా ఉచ్చులో జెర్రీ చిక్కుకుంటుంది.

    డ్రగ్స్ మాఫియా చేతిలో జెర్రీ ఎలా పావుగా మారింది? జెర్రీ ఎందుకు డ్రగ్స్ సప్లయర్‌గా మారింది. డ్రగ్స్ చేరవేతలో జెర్రీ ఎలాంటి సమస్యలను ఎదుర్కొన్నది? క్యాన్సర్ బారిన పడిన తల్లి పరిస్థితి ఏమిటి? ఓ దశలో జెర్నీ, తన తల్లి, చెల్లితో కలిసి డ్రగ్స్ దందాలోకి ఎందుకు దిగింది? చివరకు డ్రగ్స్ మాఫియాకు ఎలాంటి గుణపాఠం చెప్పింది అనే ప్రశ్నలకు సమాధానమే గుడ్ లక్ జెర్రీ సినిమా కథ.

    Good Luck Jerry review and Rating: Janhvi Kapoor fails to impress in Kolamaavu Kokila remake

    తమిళంలో నయనతారతో బీస్ట్ దర్శకుడు నెల్సన్ కుమార్ రూపొందించిన కొలమావు కోకిల సినిమా ఆధారంగా గుడ్ లక్ జెర్రీ సినిమా హిందీలో రీమేక్ అయింది. హిందీ నేటివిటికి తగినట్టుగా పంజాబీ బ్యాక్ డ్రాప్‌తో ఈ చిత్రం తెరకెక్కించారు. పంజాబీ బ్యాక్ డ్రాప్ కావడం వల్ల హిందీ సినిమాలు తక్కువగా చూసే వారికి డైలాగ్స్ అర్ధం కావడం ఓ సమస్యగా కనిపిస్తుంది. అయితే గుడ్ లక్ జెర్రీ మేకింగ్‌ కూడా నాసిరకంగా ఉండటం సినిమాకు మైనస్ అని చెప్పవచ్చు. జాన్వీ కపూర్ తప్పా మరో నటుడు తెలిసిన వారు లేకపోవడం మరో మైనస్‌గా మారింది. హిందీ సినిమాలతో పరిచయం ఉన్న ప్రేక్షకులకు సుశాంత్, మితా వశిష్ట్ లాంటి నటులు తెలుస్తారు.

    గుడ్ లక్ జెర్రీ సినిమా కథ, కథనాలతోపాటు సన్నివేశాల కోసం రాసుకొన్న కామెడీ కూడా ఆకట్టుకోలేకపోయింది. జాన్వీ కపూర్ ఈ సినిమాను చేయకుండా ఉంటే బాగుండేదనే ఫీలింగ్ చాలా సందర్భాల్లో కనిపిస్తుంది. తమిళంలో తన పాత్రను నయనతార మెప్పించింది. ఈ సినిమా విషయంలో జాన్వీ కపూర్ బాడీ లాంగ్వేజ్‌కు తగినట్టుగా క్యారెక్టర్‌ను డిజైన్ చేయడంలో డైరెక్టర్, టీమ్ విఫలమైందనే చెప్పవచ్చు. సెకండాఫ్‌లో ఎమోషన్స్, ఓ రకమైన ఉత్సుకతతో కూడిన సన్నివేశాలను దర్శకుడు పేలవంగా చిత్రీకరించారు. సెకండాఫ్‌లో ఉండే డ్రామా పెద్దగా ఆకట్టుకోలేకపోయింది.

    జాన్వీ కపూర్ ఫెర్ఫార్మెన్స్ విషయానికి వస్తే.. కొన్ని సన్నివేశాల్లో మెప్పించింది. ఎమోషన్స్, యాక్షన్, డ్రామాకు స్కోప్ ఉన్నప్పటికీ.. జాన్వీ కపూర్ పాత్రను ఆ దిశగా దర్శకుడు నడిపించలేకపోయాడని చెప్పవచ్చు. జాన్వీ కపూర్ తల్లిగా మితా వశిస్ట్, చెల్లెలు చెర్రీ అలియాస్ ఛాయా కుమారి పాత్రలో సమతా సుదీక్ష నటించింది. దలేర్‌గా సుశాంత్ సింగ్ పాత్ర అంతంతగానే ఉంది. మిగితా పాత్రలు పెద్దగా ఆకట్టుకోలేకోపోయాయి.

    గుడ్ లక్ జెర్రీ చిత్రం ఓవరాల్‌గా యావరేజ్ చిత్రంగా కూడా అనిపించుకోదు. డీస్నీ +హాట్ స్టార్ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతున్నది. ఉన్నపళంగా చూడాల్సిన చిత్రమేమీ కాదు. జాన్వీ కపూర్ ఫ్యాన్స్, పంజాబీ నేపథ్యంగా సాగే చిత్రాలను ఇష్టపడే వారికి గుడ్ లక్ జెర్రీ నచ్చడానికి అవకాశం ఉంది. జాన్వీ కపూర్ కెరీర్‌లో మరో ఫ్లాఫ్ మూవీగానే చెప్పుకోవచ్చు.

    English summary
    Janhvi Kapoor's Good Luck Jerry movie is remake of Nayanatara's Kolamaavu Kokila. Overall, This movie fails to create magic like Tamil version.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X