ఓటీటీలో త్రిప్తి డిమ్రీ అడల్డ్ మూవీ.. ఎప్పుడు? ఎక్కడ రిలీజ్ అంటే?
లేటేస్ట్ నేషనల్ క్రష్ త్రిప్తి డిమ్రి నటించిన బ్యాడ్ న్యూస్ చిత్రం ప్రపంచవ్యాప్తంగా సంచలనం రేపుతున్నది. ఈ సినిమా విడుదలైన అన్ని ప్రాంతాల్లో భారీ కలెక్షన్లు సాధిస్తున్నది. వికీ కౌశల్ హీరోగా నటించిన ఈ సినిమాకు అన్ని వర్గాల నుంచి స్పందన వ్యక్తమవుతున్నది. ధర్మ ప్రొడక్షన్ బ్యానర్‌పై కరణ్ జోహర్ తదితరులు నటించిన ఈ చిత్రం 100 కోట్ల క్లబ్‌లో చేరేందుకు రెడీ అవుతున్నది. ఈ సినిమా ఓటీటీ హక్కుల బిజినెస్, రిలీజ్‌కు సంబంధించిన వివరాల్లోకి వెళితే..
బ్యాడ్ న్యూస్ సినిమా బడ్జెట్ విషయానికి వస్తే.. ఈ సినిమాను సుమారుగా 100 కోట్ల రూపాయలతో రూపొందించారు. ఈ సినిమాలో తృప్తి డిమ్రీ, వికీ కౌశల్, అమీ విర్క్ పారితోషికాలకు భారీగా చెల్లించారు. దాంతో ఈ సినిమా బడ్జెట్ భారీగా పెరిగిపోయింది. అయితే ఈ సినిమాను ధర్మ ప్రొడక్షన్స్ వరల్డ్ వైడ్‌గా రిలీజ్ చేసింది.

ఇక ఈ సినిమా డిజిటల్ రైట్స్ భారీగా డిమాండ్ ఏర్పడింది. ఈ సినిమా ప్రమోషన్స్‌కు భారీగా స్పందన రావడంతో బిజినెస్‌పై భారీగా అంచనాలు పెరిగాయి. దాంతో ఓటీటీ సంస్థలు ఈ మూవీ హక్కులను సొంతం చేసుకోవడానికి పోటీ పడ్డాయి. చివరకు ఈ సినిమా హక్కులను అమెజాన్ ప్రైమ్ వీడియో దక్కించుకొన్నది.
ఇక బాలీవుడ్‌లో ఉన్న నిబంధనల ప్రకారం ఈ సినిమాను ఓటీటీలో స్ట్రీమింగ్ చేయాలంటే కనీసం 8 వారాలు ఆగాల్సిందే అనేది ఉంది. దాంతో ఈ సినిమా సెప్టెంబర్ మొదటి వారంలో గానీ,.. లేదా రెండోవారంలో రిలీజ్ అయ్యే అవకాశం ఉంది.

ఇదిలా ఉండగా, బ్యాడ్ న్యూస్ చిత్రం ఇటీవల రిలీజై భారీ వసూళ్లను రాబడుతున్నది. ఈ చిత్రం ఇండియాలో 45 కోట్ల గ్రాస్, ఓవర్సీస్‌లో ఈ మూవీ 25 కోట్ల రూపాయలు వసూలు చేసింది. దాంతో ఈ సినిమా 60 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టింది. ఇక ఈ సినిమా ఓటీటీలో ఎలా ఆకట్టుకొంటుందో వేచి చూడాల్సిందే.


Click it and Unblock the Notifications











