Good Wife: ఓటీటీలోకి ప్రియమణి క్రైమ్ థిల్లర్.. స్ట్రీమింగ్ ఎప్పుడు? ఎక్కడంటే?

ఓటీటీల రాకతో పలువురు సీనియర్, జూనియర్ నటీనటులు బాగా బిజీ అవుతున్నారు. ఇలాంటి వారిలో ప్రియమణి కూడా ఒకరు. ఒకప్పుడు హీరోయిన్ ఓ వెలుగు వెలిగిన ఈమెకు ఆ తర్వాతి కాలంలో అవకాశాలు తగ్గిపోయాయి. ఈ దశలో పెళ్లి కావడంతో ప్రియమణి కొన్నాళ్లు బ్రేక్ తీసుకున్నారు. తిరిగి సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసిన ప్రియమణి పలు ఛానెల్స్‌లో రియాలిటీ షోలకు న్యాయనిర్ణేతగా వ్యవహరిస్తున్నారు. అలాగే వెబ్ సిరీస్‌లలో ఆమెకు అవకాశాలు క్యూకట్టాయి. తాజాగా ప్రియమణి నటించిన ఓ క్రైమ్ థ్రిల్లర్ రిలీజ్‌కు రెడీ అయ్యింది. ఈ వివరాల్లోకి వెళితే..

జాతీయ అవార్డ్‌తో సంచలనం
జాతీయ ఉత్తమ నటి అవార్డ్ అందుకుని సత్తా చాటారు ప్రియమణి. యమదొంగ, పెళ్లయిన కొత్తలో, ప్రవరాఖ్యుడు, గోలిమార్, సాధ్యం, రావణ్, రక్త చరిత్ర, మనవూరి రామాయణం, భామాకలాపం వంటి సినిమాలలో నటించారు. సహజనటిగా గుర్తింపు తెచ్చుకున్న ప్రియమణికి స్టార్ హీరోయిన్ స్టేటస్ మాత్రం రాలేదు. కెరీర్ పీక్స్‌లో ఉన్నప్పుడే ముస్తాఫా రాజ్‌ అనే వ్యక్తితో ప్రేమలో పడి పెద్దల అంగీకారంతో ఆయనను పెళ్లాడారు. మతాంతర వివాహం చేసుకోవడంపై విమర్శలు రావడంతో వాటికి ఆమె తనదైన శైలిలో సమాధానం చెప్పారు. పెళ్లి తర్వాత కూడా తన నట జీవితాన్ని కొనసాగిస్తూ దూసుకెళ్తున్నారు ప్రియమణి.

Good Wife OTT release date When and where to stream Priyamani s Crime Thriller

వెబ్ సిరీస్‌లలో స్టార్‌గా
ది ఫ్యామిలీ మెన్, హిజ్ స్టోరీ, సర్వమ్ శక్తి మయం వెబ్ సిరీస్‌లు ప్రియమణికి పేరు తీసుకొచ్చాయి. ఇవే కాదు.. అతీత్, నారప్ప, భామకలాపంలు ఓటీటీ ప్రియులను అలరించాయి. ప్రస్తుతం ప్రియమణి తమిళంలో తెరకెక్కుతోన్న జన నాయగన్, జీడీఎన్ సినిమాలలో నటిస్తున్నారు. సినిమాలలో బిజీగా ఉన్నప్పటికీ ఓటీటీలలో వచ్చే అవకాశాలను ఆమె విడిచిపెట్టడం లేదు. తాజాగా ప్రియమణి నటించిన వెబ్ సిరీస్ గుడ్‌వైఫ్. క్రైమ్ థ్రిల్లర్, భార్యాభర్తల అనుబంధంపై తెరకెక్కిన ఈ సిరీస్‌పై భారీ అంచనాలు నెలకొన్నాయి.

క్రైమ్ థ్రిల్లర్‌గా గుడ్‌వైఫ్
పదేళ్ల క్రితం అమెరికన్ టెలివిజన్ రంగంలో ఆదరణ దక్కించుకున్న గుడ్ వైఫ్ అనే క్రైమ్ థ్రిల్లర్ అప్పట్లో కలకలం సృష్టించింది. 2009 నుంచి 2016 మధ్య ఈ వెబ్ సిరీస్ స్ట్రీమింగ్ అయ్యింది. సెక్స్ స్కాండల్‌లో చిక్కుకున్న తన భర్తను విడిపించుకోవడానికి ఓ మాజీ మహిళా లాయర్ తిరిగి కోర్టు మెట్లు ఎక్కుతుంది. దీని ఆధారంగా తమిళంలో ఈ సిరీస్‌ను తెరకెక్కించారు. దానిని అదే పేరుతో తెలుగు, తమిళ, హిందీ, మలయాళ, కన్నడ భాషల్లో రిలీజ్ చేయాలని మేకర్స్ నిర్ణయించారు.

గుడ్‌వైఫ్ స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
ఈ క్రైమ్ థ్రిల్లర్‌లో ప్రియమణి భర్తగా సీనియర్ నటుడు సంపత్ రాజ్ నటించారు. ఇప్పటికే విడుదలైన గుడ్‌వైఫ్ టీజర్, ట్రైలర్లకు మంచి స్పందన వచ్చింది. ఇందులో భార్యాభర్తలతో పాటు వారి పిల్లలను కూడా చూపించారు. మరి ఈ కేసులో ఆ మాజీ లాయర్ గెలిచిందా? అసలు సంపత్ రాజ్‌ను ఈ కేసులో ఇరికించింది ఎవరు? అసలు నిందితులను ఆమె బయటపెట్టిందా? లేదా అన్నది చూడాలి. గుడ్‌వైఫ్ వెబ్ సిరీస్ స్ట్రీమింగ్ డేట్‌ను తాజాగా మేకర్స్ రివీల్ చేశారు. జూలై 4వ తేదీ నుంచి జియో హాట్‌స్టార్‌లో ఈ వెబ్‌సిరీస్‌ ఏకంగా ఏడు భాషల్లో స్ట్రీమింగ్ కానుందని ఓటీటీ సంస్థ తెలిపింది. మరి ఈ గుడ్‌వైఫ్ ఎంత వరకు ప్రేక్షకులను ఆకట్టుకుంటుందో చూడాలి.

More from Filmibeat

Read more about: priyamani sampath raj
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X