For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  RRR మూవీకి బిగ్ షాక్: టాప్ 10 చిత్రాల్లో దక్కని చోటు.. ఆస్కార్‌కు ముందు ఊహించని విధంగా!

  |

  టాలీవుడ్‌లో ఈ మధ్య కాలంలో మల్టీస్టారర్ మూవీలు భారీ స్థాయిలో వస్తున్నాయి. వాటిలో చాలా సినిమాలు సూపర్ హిట్లు అయ్యాయి. ఇలా కొన్ని నెలల క్రితం వచ్చి దేశ వ్యాప్తంగా సంచలనం అయిన చిత్రమే RRR (రౌద్రం రణం రుధిరం). దర్శకధీరుడు రాజమౌళి రూపొందించిన ఈ సినిమాలో టాలీవుడ్‌ను ఏలుతోన్న ఇద్దరు స్టార్ హీరోలు యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కలిసి నటించారు. ఇక, ఈ చిత్రం ఇప్పటికే ఎన్నో అవార్డులను గెలుచుకుని ఆస్కార్ బరిలోనూ నిలిచింది. ఈ నేపథ్యంలో తాజాగా RRRకు షాక్ తగిలింది. ఆ వివరాలు మీకోసం!

  క్రేజీ కాంబోలో వచ్చిన RRR

  క్రేజీ కాంబోలో వచ్చిన RRR

  ఎన్టీఆర్, రామ్ చరణ్ ప్రధాన పాత్రల్లో రాజమౌళి తెరకెక్కించిన పిరియాడిక్ మూవీనే RRR (రౌద్రం రణం రుధిరం). దీన్ని డీవీవీ దానయ్య భారీ బడ్జెట్‌తో ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. ఎమ్ఎమ్ కీరవాణి సంగీతాన్ని అందించారు. ఆలియా భట్, ఒలీవియా మోరిస్ హీరోయిన్లుగా నటించారు. ఇందులో చరణ్.. అల్లూరి, తారక్.. కొమరం భీం పాత్రలు చేసిన విషయం తెలిసిందే.

  గృహలక్ష్మి లాస్య ఓవర్ డోస్ హాట్ షో: ఎద అందాలు చూపిస్తూ ఘోరంగా!

  ఓటీటీ రిలీజ్... వాటిలోనూ

  ఓటీటీ రిలీజ్... వాటిలోనూ

  విడుదలకు ముందే భారీ హైప్ క్రియేట్ చేసుకున్న RRR మూవీ థియేట్రికల్ హక్కుల మాదిరిగానే.. డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్‌కు కూడా భారీ స్థాయిలో డిమాండ్ ఏర్పడింది. ఈ నేపథ్యంలో ఈ సినిమాకు సంబంధించి దక్షిణాది భాషల స్ట్రీమింగ్ హక్కులను జీ5 అత్యధిక మొత్తానికి సొంతం చేసుకుంది. అలాగే, హిందీ వెర్షన్ రైట్స్‌ను నెట్‌ఫ్లిక్స్ దక్కించుకుని స్ట్రీమింగ్ చేశాయి.

  నెట్‌ఫ్లిక్స్‌లో సరికొత్త చరిత్ర

  నెట్‌ఫ్లిక్స్‌లో సరికొత్త చరిత్ర

  క్రేజీ కాంబినేషన్‌లో వచ్చిన RRR (రౌద్రం రణం రుధిరం) మూవీ హిందీ వెర్షన్‌కు సంబంధించి నెట్‌ఫ్లిక్స్‌లో మే 20 నుంచి స్ట్రీమింగ్ ప్రారంభం అయింది. అక్కడ ఈ చిత్రానికి ఊహించని రీతిలో స్పందన దక్కింది. మరీ ముఖ్యంగా మొదటి వారంలోనే ఈ సినిమా 1,83,60,000 స్ట్రీమింగ్ మినిట్స్‌ను పూర్తి చేసుకుంది. తద్వారా ఎన్నో సరికొత్త రికార్డులను క్రియేట్ చేసుకుంది.

  యాంకర్ రష్మీ గుట్టురట్టు చేసిన కమెడియన్: ఆ పని చేసి డబ్బు సంపాదిస్తుందంటూ షాకింగ్‌గా!

  ప్రపంచంలోనే టాప్ మూవీ

  ప్రపంచంలోనే టాప్ మూవీ

  నెట్‌ఫ్లిక్స్‌లో ఎక్కువ మంది వీక్షించిన నాన్ ఇంగ్లీష్ సినిమాల్లో RRR (రౌద్రం రణం రుధిరం) మూవీ టాప్‌ ప్లేస్‌కు చేరుకుంది. అలా ఏకంగా 15 వారాల పాటు ట్రెండింగ్‌లో ఉన్న ఈ చిత్రం వరల్డ్ రికార్డును కూడా క్రియేట్ చేసుకుంది. అంతేకాదు, గతంలో ఇండియా తరపున ఈ మైలురాయిని అందుకున్న చిత్రంగా నిలిచింది. అలాగే, ఎక్కువ వ్యూస్‌తోనూ సత్తా చాటుకుంది.

  ధనుష్ సినిమా టాప్‌ ప్లేస్

  ధనుష్ సినిమా టాప్‌ ప్లేస్

  2022లో స్ట్రీమింగ్ అయి ఎక్కువ వ్యూస్‌ను రాబట్టుకుని పాపులర్ అయిన చిత్రాల జాబితాను నెట్‌ఫ్లిక్స్ సంస్థ తాజాగా విడుదల చేసింది. ఇందులో ఇంగ్లీష్ విభాగంలో కోలీవుడ్ స్టార్ ధనుష్ కీలక పాత్రలో నటించిన 'ది గ్రే మ్యాన్' టాప్‌లో నిలిచింది. అలాగే, నాన్ ఇంగీష్ విభాగంలో నార్వే భాషకు చెందిన 'ట్రోల్' సినిమా మొదటి స్థానాన్ని సొంతం చేసుకుని సత్తా చాటాయి.

  Bigg Boss 7: బిగ్ బాస్‌కు బాలయ్య షాకింగ్ కండీషన్స్.. నాగార్జునకు మరో దెబ్బ.. ఇండస్ట్రీలో కలకలం

  RRRకు నెట్‌ఫ్లిక్స్‌లో షాక్

  RRRకు నెట్‌ఫ్లిక్స్‌లో షాక్

  నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవడంతో పాటు ఎన్నో రికార్డులు నెలకొల్పిన మన తెలుగు చిత్రం RRR (రౌద్రం రణం రుధిరం)కు తాజాగా వదిలిన నాన్ ఇంగ్లీష్ మూవీస్‌ లిస్టులో మాత్రం చోటు దక్కలేదు. దీంతో తెలుగు ప్రేక్షకులు అయోమయానికి గురి అవుతున్నారు. అలాగే, చాలా మంది నెటిజన్లు నెట్‌ఫ్లిక్స్ సంస్థపై విమర్శలు గుప్పిస్తూ సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తోన్నారు.

  లిస్టుపై భిన్నాభిప్రాయాలు

  లిస్టుపై భిన్నాభిప్రాయాలు

  RRR (రౌద్రం రణం రుధిరం) మూవీ ఇప్పటికే ఎన్నో నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ అవార్డులను సొంతం చేసుకుంది. అలాగే, ఒరిజినల్ సాంగ్ విభాగంలో ఆస్కార్ నామినేషన్స్‌లో షార్ట్ లిస్టులో కూడా చోటు దక్కించుకుంది. అలాంటిది నెట్‌ఫ్లిక్స్ మూవీస్ జాబితాలో చోటు లేకపోవడం చాలా మందిని షాక్ గురి చేస్తోంది. దీనిపై భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతూనే ఉన్నాయి.

  English summary
  Famouse OTT Platform Netflix Recently Released 2022 top ten Non English Movies list. Telugu Film RRR fails to Get Place in This List.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X