twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    Unstoppable 2 హీరోయిన్ విషయంలో గొడవ.. ఆ సినిమా మొత్తం మార్చేసిందంటూ గోపీచంద్!

    |

    నందమూరి నటసింహం బాలకృష్ణ 60 ఏళ్ల వయసులోనూ ఎంతో ఎనర్జిటిక్ గా యంగ్ హీరోలకు ఏమాత్రం తగ్గకుండా జోష్ చూపిస్తున్నారు. అందుకు ఉదాహరణే బాలకృష్ణ హోస్ట్ గా మారిన 'Unstoppable with NBK' షో. ప్రముఖ తెలుగు డిజిటల్ ఫ్లాట్ ఫామ్ ఆహా సంస్థ వేదికగా ఈ టాక్ షో ప్రసారమవుతోందన్న విషయం తెలిసిందే. మొదటి సీజన్ సూపర్ డూపర్ హిట్ కావడంతో రెండో సీజన్ ను ఇటీవలే ప్రారంభించారు. ఈ సీజన్ కూడా సూపర్ హిట్ టాక్ తో దూసుకుపోతోంది. ఎంతోమంది సెలబ్రిటీలు సందడి చేసిన ఈ షోకి పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, మ్యాచో హీరో గోపీచంద్ కలసి జోష్ పెంచారు. ఈ ఎపిసోడ్ లో తన సినీ కెరీర్ కు సంబంధించి గోపీచంద్ ఆసక్తికర విషయాలు వెల్లడించాడు.

    ప్రభాస్-గోపీచంద్ హాజరు..

    ప్రభాస్-గోపీచంద్ హాజరు..

    నందమూరి నటసింహం బాలయ్య బాబు హోస్ట్ గా అదరగొడుతున్న టాక్ షో అన్‌స్టాపబుల్ 2. నాన్ స్టాప్ గాసాగుతున్న అన్‌స్టాపబుల్ రెండో సీజన్ తాజా ఎపిసోడ్ లో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ తో పాటు అతని బెస్ట్ ఫ్రెండ్, మ్యాచో హీరో గోపీచంద్ కూడా హాజరయ్యాడు. సోషల్ మీడియాలో ఇప్పటికే ఈ ఎపిసోడ్ కు సంబంధించిన ఫొటోలు, వీడియో లీకై ట్రెండ్ అయ్యాయి. తర్వాత ఆ ఎపిసోడ్ కు సంబంధించిన గ్లింప్స్ వదిలిన ఆహా సంస్థ ఇటీవల ఎపిసోడ్ మొదటి ప్రోమోను రిలీజ్ చేశారు.

     దాక్కున్న గోపీచంద్..

    దాక్కున్న గోపీచంద్..

    ప్రోమోలో మొదట ప్రభాస్ ఎంట్రీ ఇవ్వగా.. డార్లింగ్ తో సరదాగా ముచ్చటించాడు బాలకృష్ణ. తర్వాత గోపీచంద్ ఎంట్రీ ఇవ్వగా అతనితో మనవాడు బెస్ట్ ఫ్రెండ్ అండీ అని రామ్ చరణ్ కు ఫోన్ చేశాడు. అతను చిన్న లీక్ న్యూస్ ఇచ్చాడు అని బాలకృష్ణ చెబుతుంటే.. రాణి గురించే కదా సార్ అని గోపీచంద్ అన్నాడు. దీంతో ఒరేయ్.. అని ప్రభాస్ అరిచాడు. దీంతో స్టేజ్ మొత్తం నవ్వులతో నిండిపోయింది. తర్వాత బాలకృష్ణకు అడ్డుగా గోపీచంద్ ఉంటే.. సార్ మీరు జరగండి సార్ అని ప్రభాస్ అన్నాడు.

    పడినప్పుడు లేచినవాడే..

    పడినప్పుడు లేచినవాడే..

    తర్వాత కూర్చున్న గోపీచంద్ తో హీరోగా టైలర్ మేడ్ గా ఉన్న నువ్వు.. మొదటి సినిమా మోసం చేసింది. ఏ ధైర్యంతో ఇక్కడిదాకా వచ్చావ్ అని బాలకృష్ణ అడిగాడు. ఆ సినిమా నా జీవితాన్ని డిఫరెంట్ గా మార్చేసింది. అలా చేసేటప్పుడే నాకు ఫస్ట్ ప్రభాస్ పరిచయం అయ్యాడు. పడినప్పుడు లేచినవాడే ఈజ్ అన్ స్టాపబుల్ అని బాలకృష్ణ అన్నాడు. దీంతో ప్రేక్షకులందరూ చప్పట్లు కొడుతుండగా.. బాలకృష్ణ వెళ్లి గోపీచంద్ ను హగ్ చేసుకున్నాడు.

    మా అమ్మ కంగారు పడిపోద్ది..

    మా అమ్మ కంగారు పడిపోద్ది..

    2008లో ఏదో హీరోయిన్ విషయంలో గొడవ పడ్డారు. మనోడే పడేస్తాడో.. వాళ్ల కటౌట్ చూసి పడిపోతారో అర్థం కావట్లేదు అని బాలయ్య అంటే.. చెప్పురా.. నేనైతే పడలేదు.. నీకేమైనా ఉంటే చెప్పు అని ప్రభాస్ మొహంపై చేయి పెట్టుకుని పక్కకు తిరిగాడు. తర్వాత స్క్రీన్ పై ఏదో ఫొటో చూపించారు. దీంతో ప్రేక్షకులందరూ అరవడం మొదలుపెట్టారు. మా అమ్మ కంగారు పడిపోద్ది సార్.. అదేంటో చెప్పండి అని ప్రభాస్ అని నవ్వించాడు.

    ఇంటికి శత్రువు వచ్చినా..

    ఇంటికి శత్రువు వచ్చినా..

    గోపీ.. ఆ ఫొటో తీసింది నువ్వే.. అని బాలకృష్ణ అంటే.. సార్.. రేపు సోషల్ మీడియాలో నేను తట్టుకోలేను సార్.. నా మీద ఒట్టు వేయి.. చెప్పేయ్.. చెప్పేయ్ అని ప్రభాస్ అన్నాడు. దానికి చెప్పొద్దు.. చెప్పొద్దు.. అని ఏంటిది అని బాలకృష్ణ కౌంటర్ ఇచ్చాడు. అనంతరం దివంగత కృష్ణంరాజును స్మరించుకున్నారు. పెదనాన్న గారు.. ఇంటికి శత్రువు వచ్చినా ముందు గౌరవంగా పంపించి.. తర్వాత నీకు కోపం వస్తే వాళ్ల ఇంటికెళ్లి చూసుకో, బయట చూసుకో అని చెప్పేవారు.. ఐ లవ్ హిమ్ అని ప్రభాస్ చాలా ఎమోషనల్ గా చెప్పాడు.

    ఓ పాట పాడండే..

    ఓ పాట పాడండే..

    ఎపిసోడ్ ప్రోమోలో చివరిగా బుజ్జిగాడు సినిమాలోని డైలాగ్ చెప్పి అలరించాడు ప్రభాస్. ఏండే.. ఏమైనా మాటాడండీ.. ఓ పాట పాడండే.. అంటూ అందరితో విజిల్స్ వేయించాడు ప్రభాస్. ఫుల్ అండ్ ఎనర్జిటిక్ ఎంటర్టైనింగ్ గా సాగిన ఈ పూర్తి ఎపిసోడ్ ను న్యూ ఇయర్ కానుకగా డిసెంబర్ 30న ఆహాలో విడుదల చేయనున్నట్లు ప్రోమోలో వెల్లడించారు.

    English summary
    Nandamuri Balakrishna About Gopichand First Movie Flop In Unstoppable 2 Latest Promo
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X