ఓటీటీలో గోపిచంద్ యాక్షన్, ఫన్, డ్రామా.. భీమాను ఎక్కడ చూడొచ్చంటే?

టాలీవుడ్ మాచో స్టార్ గోపిచంద్, ప్రియా భవానీ శంకర్, మాళవిక శర్మ నటించిన భీమా చిత్రం థియేట్రికల్ రన్ ముగించుకొని ఓటీటీలోకి వచ్చేందుకు సిద్దమైంది. యాక్షన్, కామెడీ ప్రధానంగా సాగే ఈ మూవీ మార్చి 8వ తేదీన భారీ అంచనాల మధ్య ప్రపంచవ్యాప్తంగా రిలీజైంది. ప్రముఖ నిర్మాత కేకే రాధామోహన్, దర్శకుడు హర్ష ఏ దర్శకత్వంలో వచ్చిన చిత్రం భారీ ఒపెనింగ్స్ సాధించింది. అయితే ఈ సినిమా ఓటీటీలో ఏ ఫ్లాట్ ఫామ్, ఎప్పుడు రిలీజ్ అవుతుందనే వివరాల్లోకి వెళితే..

భీమా సినిమా కథ విషయానికి వస్తే.. పోలీస్ ఆఫీసర్‌గా గోపిచంద్ మరోసారి తనదైన మార్కుతో ఆకట్టుకొన్నారు. అధ్యాత్మిక కేంద్రంలో జరిగే ఓ థ్రిల్లింగ్ ఎలిమెంట్‌లో కథ సాగుతుంది. సెకండాఫ్‌లో కథను నడిపిన విధానం మంచి అనుభూతిని కలిగిస్తుంది. కన్నడ దర్శకుడు హర్ష కథను ఫుల్లుగా కమర్షియల్ ఫార్మాట్‌లో మెప్పించేలా చేయడం పాజిటివ్‌గా మారింది.

Gopichand s Bhimaa streaming on Disney Hotstar Here is the Details

సక్సెస్ తప్పనిసరిగా కావాల్సిన సమయంలో వచ్చిన భీమా సినిమాను సుమారుగా 25 కోట్ల రూపాయలతో నిర్మించారు. ఈ సినిమా బిజినెస్ దాదాపు 12 కోట్ల మేర జరిగింది. ఈ చిత్రాన్ని వరల్డ్ వైడ్‌గా 900 స్క్రీన్లలో రిలీజ్ చేశారు. దాంతో ఈ సినిమా థియేట్రికల్ రన్‌లో 16 కోట్ల మేర కలెక్షన్లను సాధించింది. ఆంధ్రప్రదేశ్, నైజాంలో ఈ సినిమా 12.5 కోట్ల వసూళ్లను సాధించింది.

అయితే ఇటీవల కాలంలో గోపిచంద్‌కు మంచి ఓపెనింగ్స్‌తోపాటు విజయం అందజేసిన చిత్రం ప్రస్తుతం ఓటీటీలో స్ట్రీమింగ్ అయ్యేందుకు రెడీ అవుతున్నది. ఈ సినిమా హక్కులను ప్రముఖ ఓటీటీ సంస్థ డిస్నీ+హాట్ స్టార్ దక్కించుకొన్నది. ఈ సినిమా హక్కులు భారీగా అమ్ముడుపోయాయి.

Gopichand s Bhimaa streaming on Disney Hotstar Here is the Details

ప్రస్తుతం ఓటీటీలో భీమా స్ట్రీమింగ్ అవుతున్నది. యాక్షన్, ఔట్ అండ్ ఔట్ కామెడీని ఆదరించే వారికి ఈ సినిమా నచ్చుతుంది. భీమా కేవలం డిస్నీ+ హాట్ స్టార్‌‌లోనే కాకుండా హులు అనే ఓటీటీలో కూడా రిలీజ్ కాబోతున్నది. మరిన్నీ ఓటీటీ న్యూస్ కోసం ఫిల్మ్‌బీట్‌ను ఫాలో అవ్వండి..

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X