గోపిచంద్ సినిమాకు రెండు ఆఫర్లు.. పక్కా కమర్షియల్ ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్!
గోపీచంద్ మారుతి కలయికలో వచ్చిన మారుతి పక్క కమర్షియల్ సినిమా విడుదలకు ముందు ఎలాంటి హైప్ క్రియేట్ చేసిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. తప్పకుండా ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద మినిమం కలెక్షన్స్ అందుకుంటుంది అని అందరూ అనుకున్నారు. అంతేకాకుండా మెగాస్టార్ చిరంజీవి ప్రత్యేక అతిధిగా రావడం కొంతమంది సెలబ్రిటీలు కూడా పాజిటివ్ గా స్పందించడంతో గోపీచంద్ సినిమాకు మొదటిసారి భారీ స్థాయిలో విడుదల చేయడం జరిగింది.
అయితే పక్కా కమర్షియల్ సినిమా ఊహలకు భిన్నంగా నెగిటివ్ టాక్ ను సొంతం చేసుకుంది. ఆడియన్స్ ను పూర్తిస్థాయిలో సంతృప్తి పరచకపోవడంతో సినిమా బాక్సాఫీస్ వద్ద దారుణమైన నష్టాలను ఎదుర్కొంది. ఎక్కడ ఏ ఏరియాలో కూడా సినిమా పెట్టిన పెడుబడికి కొంచెం కూడా ప్రాఫిట్ అందించకపోగా ఊహించనంత నష్టాలను మిగిల్చింది. పక్కా కమర్షియల్ సినిమా ద్వారా ఎవరికి ఎలాంటి లాభం కలగలేదు. ఒకవైపు ఆర్థికంగా నిర్మాతలకు మరోవైపు కెరీర్ పరంగా నటీనటులకు టెక్నీషియన్స్ కు పెద్ద డ్యామేజ్ చేసింది.

అయితే థియేట్రికల్ గా పక్కా కమర్షియల్ సినిమా ఫ్లాప్ అయినప్పటికీ నాన్ థియేట్రికల్ బిజినెస్ లో మాత్రం నిర్మాతలను సేఫ్ జోన్ లో పడేసినట్లుగా తెలుస్తోంది. ఈ సినిమా ఓటీటీ హక్కులను ఆహా సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. అలాగే నెట్ ఫ్లిక్స్ కూడా మరొక రేటుకు కొనుగోలు చేసింది. ఇక ఫైనల్ గా ఓటీటీ లో ఈ సినిమాను విడుదల చేయబోతున్నారు.ఆగస్టు 5వ తేదీన పక్క కమర్షియల్ సినిమా ఓటిటి ఫ్లాట్ ఫామ్ లో స్ట్రీమింగ్ కాబోతోంది.
మరి థియేటర్స్ లో చూడని ప్రేక్షకులు ఈ సినిమాను ఓటీడీలో ఎంతవరకు చూస్తారో చూడాలి. ఈ సినిమాలో రాశి కన్నా మెయిన్ హీరోయిన్ గా నటించిన విషయం తెలిసిందే. ఇక పక్కా కమర్షియల్ సినిమా అనంతరం దర్శకుడు మారుతి ప్రభాస్ తో ఒక సినిమా చేయబోతున్నట్లు టాక్ వచ్చిన విషయం తెలిసిందే. కానీ పక్కా కమర్షియల్ రిజల్ట్ అనంతరం ప్రభాస్ మళ్లీ మనసు మార్చుకున్నట్లు మారుతి సినిమాను పక్కన పెట్టినట్లుగా కొత్త టాక్ వినిపిస్తోంది. మరి అది ఎంతవరకు నిజమో తెలియాలి అంటే అఫీషియల్ గా క్లారిటీ వచ్చేవరకు ఆగాల్సిందే.


Click it and Unblock the Notifications











