Pakka Comercial OTT రిలీజ్.. సినిమా తేడా కొట్టినా కూడా వచ్చేది అప్పుడే!

గోపీచంద్ రాశి ఖన్నా జంటగా నటించిన పక్కా కమర్షియల్ సినిమా శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. ఓవర్సీస్ లో కూడా ఈ సినిమాను భారీగానే విడుదల చేశారు. గీత ఆర్ట్స్ అనుబంధ సంస్థ GA2 పిక్చర్స్ యువి క్రియేషన్స్ కలిసి సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమా విడుదలకు ముందు కాస్త పాజిటివ్ వైబ్రేషన్స్ చేసి థియేటర్లోకి రావడం జరిగింది. అయితే సినిమా ఓటీటీలోకి ఎప్పుడు రానుంది అనే విషయంలో కూడా ఒక టాక్ వైరల్ గా మారుతొంది. ఆ వివరాల్లోకి వెళితే..

Recommended Video

పక్కా కమర్షియల్ పక్కా genuine రివ్యూ *Entertainment | Telugu OneIndia
గ్రాండ్ రిలీజ్

గ్రాండ్ రిలీజ్

ఇక సినిమాకు ప్రస్తుతం డివైడ్ టాక్ వచ్చినట్లు సోషల్ మీడియాలో వస్తున్న రివ్యూలు చూస్తే అర్ధమవుతోంది. ఇక మొదటి రోజు ఈ సినిమా ఏ స్థాయిలో కలెక్షన్స్ అందుకుంటుంది అలాగే వీకెండ్ లో ఎంతవరకు పెట్టిన పెట్టుబడిన వెనక్కి తీసుకువస్తుంది అనే దాని పైన సినిమా రిజల్ట్ ఆధారపడి ఉంటుంది. నిర్మాతలు అయితే సినిమా సక్సెస్ అవుతుంది అని చాలా కాన్ఫిడెంట్ తో భారీగానే విడుదల చేశారు.

మారుతి సెంటిమెంట్

మారుతి సెంటిమెంట్

గోపీచంద్ కూడా ఈసారి కెరీర్ లోనే బిగ్గెస్ట్ ఓపెనింగ్స్ అందుకుంటాడు అని అనిపిస్తోంది. సాధారణంగా మారుతి డైరెక్షన్లో చేసిన మీడియం రేంజ్ హీరోలు అందరూ కూడా వారికి కెరీర్ లోనే బెస్ట్ ఓపెనింగ్స్ అందుకున్నారు. అంతేకాకుండా మారుతి సెంటిమెంట్ ప్రకారం ఫ్లాప్ లో ఉన్న హీరోకు సక్సెస్ ఇస్తూ వచ్చాడు. ఇక ఇప్పుడు గోపీచంద్ కూడా అదే సెంటిమెంట్ తో హిట్ కొడతాడు అనే సెంటిమెంట్ గట్టిగానే వైరల్ అవుతోంది.

 గోపి నమ్మకం

గోపి నమ్మకం

ఇక పక్క కమర్షియల్ సినిమా మొదటి రోజు అయితే కొంత డీసెంట్ టాక్ అందుకుంది. అలాగే కొన్ని సన్నివేశాలు కమర్షియల్ గా రొటీన్ గానే ఉన్నాయి అనే విధంగా కూడా నెగిటివ్ టాక్ వస్తుంది కానీ ఈ సినిమాపై గోపీచంద్ అయితే చాలా ఆశలు పెట్టుకున్నాడు. ఎందుకంటే అతని నుంచి ఇంతకుముందు వచ్చిన సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద భారీగానే నష్టాలను మిగిల్చాయి. కాబట్టి పక్కా కమర్షియల్ సక్సెస్ తో కొంత మార్కెట్ కూడా పెంచుకోవాలని గోపి ఆలోచిస్తున్నాడు.

అల్లు అరవింద్ అడిగినా..

అల్లు అరవింద్ అడిగినా..

ఇక పక్క కమర్షియల్ సినిమాను ఓటీటీ లో ఎప్పుడు విడుదల చేస్తారు అనే విషయంలో ఇదివరకే ఒక రూమర్ అయితే వచ్చింది. ఆ విషయంలో నిర్మాత బన్నీ వాసు క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశాడు. అల్లు అరవింద్ ఈ సినిమాను ఆహా లో విడుదలను 30 రోజులకు తర్వాత అడిగినప్పటికీ కూడా నేను ఇవ్వలేదు అని సినిమా ఈవెంట్లో ఓపెన్ గానే తెలియజేశాడు.

ఓటీటీ లోకి వచ్చేది అప్పుడే?

ఓటీటీ లోకి వచ్చేది అప్పుడే?

ఇక ప్రస్తుతం వినిపిస్తున్న టాక్ ప్రకారం మీడియం రేంజ్ హీరోలు సినిమాలు అలాగే బిగ్ బడ్జెట్ సినిమాలు అన్నీ కూడా థియేటర్లోకి వచ్చిన 50 రోజుల తర్వాతనే ఓటీటీలో విడుదల చేయాలని అనుకుంటున్నారు. ఇక పక్క కమర్షియల్ సినిమా అయితే ఆహా యాప్ లోనే విడుదల అవుతుంది అని క్లారిటీ ఇచ్చేశారు అలాగే నెట్ ఫ్లిక్స్ కూడా ఈ సినిమా హిందీ డబ్బింగ్ హక్కులను సొంతం చేసుకున్నట్లు తెలుస్తోంది. ఇక ప్రస్తుతం వినిపిస్తున్న టాక్ ప్రకారం పక్క కమర్షియల్ సినిమా ఓటీటీ లో ఆగస్టు మూడో వారంలో స్ట్రీమింగ్ అయ్యే అవకాశం ఉన్నట్లు సమాచారం.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X