OTT లోకి వచ్చేసిన తెలుగు మాస్ మసాలా మూవీ... స్ట్రీమింగ్ ఎందులో అంటే?
దాదాపు 4 నెలల తర్వాత మాస్ మసాలా యాక్షన్ డ్రామా రామాబాణం ఓటీటీలోకి వచ్చేసింది. గోపిచంద్ హీరోగా నటించిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయింది. శ్రీవాస్ దర్శకత్వం వహించగా... డింపుల్ హయతీ హీరోయిన్ గా నటించింది. ఇక ఈ సినిమా ఓటీటీ రిలీజ్ విషయంలో చాలా ఆలస్యం అయిందనే చెప్పాలి. ఎట్టకేలకు ఈ సినిమా ఓటీటీలోకి వచ్చి స్ట్రీమింగ్ అవుతుంది. ఈ మూవీ ఎందులో స్ట్రీమింగ్ అవుతుందో ఈ స్టోరీలో వివరాలు తెలుసుకుందాం.
మ్యాచో స్టార్ గోపిచంద్ కు ఈ మధ్య కలిసిరావడం లేదు. ఆయన సినిమాలు వరుసగా ఫ్లాపులు మిగులుతున్నాయి. ఆయన ఎన్నో ఆశలు పెట్టుకుని తనకు హిట్లు అందించిన దర్శకుడు శ్రీవాస్ తో కలిసి రామాబాణం సినిమా చేశాడు. ఇక ఈ మూవీ మే 13వ తేదీన థియేటర్లకు వచ్చింది. ఇక ఈ సినిమాపై ఎన్నో ఆశలు పెట్టుకున్న గోపిచంద్ కు బాక్సాఫీస్ వద్ద నిరాశే మిగిలింది. బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ టాక్ తెచ్చుకుని ఫ్లాప్ గా నిలిచింది.

ఇక రామాబాణం చిత్రానికి శ్రీవాస్ దర్శకత్వం వహించారు. గోపిచంద్ సరసన డింపుల్ హయతి హీరోయిన్ గా నటించింది. గోపీచంద్ అన్నయ్యగా జగపతిబాబు ఓ కీలక పాత్ర పోషించగా, ఖుష్బూ మరో ప్రధాన పాత్రలో మెప్పించారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టీజీ విశ్వప్రసాద్, వివేక్ కూచిబొట్ల నిర్మించిన ఈ మూవీలో నాసర్, తరుణ్ అరోరా, వెన్నెల కిశోర్, సచిన్ ఖేడ్కర్, సత్య, అలీ, రాజా రవీంద్ర, సప్తగిరి, గెటప్ శీను, శుభలేఖ సుధాకర్ కీలక పాత్రలు పోషించారు. మిక్కీ జే మేయర్ సంగీతం అందించారు.
రామాబాణం థియేటర్లలో విడుదలైన మొదటి రోజు నుంచి మిక్స్ డ్ టాక్ తెచ్చుకుంది. ఈ మాస్ యాక్షన్ డ్రామా బాక్సాఫీస్ వద్ద మెప్పించలేకపోయింది. రోటీన్ కథ కావడంతో ఆడియెన్స్ కు అంతగా రుచించలేదు. బాక్సాఫీస్ వద్ద పెద్దగా వసూళ్లు కూడా రాబట్టలేదు ఈ మూవీ. అయితే గోపీచంద్ యాక్షన్ సీక్వెన్స్ మాత్రం ఫ్యాన్స్ ను అలరించాయి.
ఇక థియేటర్లలో ఆడని రామాబాణం నాలుగు నెలల తర్వాత ఓటీటీలోకి వచ్చేసింది. రామబాణం మూవీ డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ ఫ్లిక్స్ విక్రయించింది. గురువారం అంటే సెప్టెంబర్ 14వ తేదీ అర్ధరాత్రి నుంచే ఈ మూవీ ఓటీటీలోకి అందుబాటులోకి వచ్చి స్ట్రీమింగ్ అవుతుంది. ప్రస్తుతం తెలుగుతో పాటు తమిళం, కన్నడ, మలయాళం, కన్నడ భాషలలో రామబాణం స్ట్రీమింగ్ అవుతోంది.
మొత్తానికి 4 నెలల తర్వాత రామబాణం ఓటీటీలోకి రావడంతో గోపీచంద్ ఫ్యాన్స్ ఖుషి అవుతున్నారు. రామబాణం సినిమాకు భూపతి రాజా కథ అందించగా... మధు సూదన్ డైలాగులు సమకూర్చారు. ప్రవీణ్ పూడి ఎడిటర్‌గా, వెట్రీ పళని స్వామి సినిమాటోగ్రాఫర్ గా వ్యవహరించారు. మరి థియేటర్లలో రామబాణం సినిమాను మిస్ అయినా ప్రేక్షకులు... ఓటీటీలో ఇంట్లోనే చూసి ఎంజాయ్ చేయండి.


Click it and Unblock the Notifications











