Viswam OTT:ఓటీటీలోకి గోపిచంద్ మూవీ.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
Viswam OTT: ఎన్నో ఏండ్లుగా సరైన హిట్టు కోసం ఎదురుచూస్తున్న హీరో గోపీచంద్, డైరెక్టర్ శీను వైట్లకు సక్సెస్ అందించిన మూవీ విశ్వం (Viswam). దసరా కానుకగా అక్టోబర్ 11న ప్రేక్షకుల ముందుకు వచ్చిన విశ్వం మూవీ పాజిటివ్ టాక్ తో దూసుకువెళుతుంది. సక్సెస్ ఫుల్ గా రన్ అవుతున్న విశ్వం మూవీ నుండి ఓటీటీ కి సంబంధించిన అప్డేట్ వచ్చింది.
డైరెక్టర్ శ్రీను వైట్ల దర్శకత్వంలో హీరో గోపీచంద్ నటించిన తాజా చిత్రం విశ్వం. ఈ మూవీని చిత్రాలయం స్టూడియోస్, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్స్‌పై వేను దొనేపూడి, టీజీ విశ్వప్రసాద్, వివేక్ కూచిబొట్ల, కొండల్ జిన్నాలు సంయుక్తంగా నిర్మించారు. ఈ మూవీని ప్రమోషనల్ కార్యక్రమాలతో కలిపి రూ.50 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కించారు. ఈ మూవీలో గోపీచంద్, కావ్య థాపర్ హీరో హీరోయిన్లుగా నటించగా.. జిషు సేన్‌గుప్తా, నరేష్, ప్రకాష్ రాజ్, సునీల్, ప్రగతి, పార్థిబన్, వెన్నెల కిశోర్ తదితరులు కీలకపాత్ర పోషించారు. ఈ మూవీకి చైతన్ భరద్వాజ్ సంగీతం అందజేశారు.

డైరెక్టర్ శ్రీను వైట్ల ఓ సక్సెస్ మూవీని తీసి దాదాపు పదేళ్లకు పైనే అయింది. జూనియర్ ఎన్టీఆర్ హీరోగా బాద్ షా సినిమా నిర్మించారంటే.. ఆ తరువాత మరో సినిమా చేయలేదు. మరోవైపు గోపి చంద్ కూడా సరైన హిట్ లేక చాలా కాలం నుంచి ఎదురుచూస్తున్నారు. ఈ తరుణంలో విశ్వంతో వీరిద్దరూ కమ్ బ్యాక్ ఇచ్చినట్లే అనిపిస్తోంది. మూవీ విడుదలకు ముందు వచ్చిన టీజర్, ట్రైలర్‌లకు ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ రావడంతో ప్రీ రిలీజ్ బిజినెస్ బాగానే జరిగిందని ట్రేడ్ వర్గాలు తెలిపాయి.
ఇక బాక్సాఫీస్ వద్ద కలెక్షన్స్ కు భారీగానే రాబట్టిందనే టాక్ వస్తుంది. ఈ తరుణంలో ఈ మూవీకి సంబంధించిన ఓటీటీ సంబంధించిన వార్త ఇండస్ట్రీలో చక్కర్లు కొడుతుంది. విశ్వం మూవీ డిజిటల్ రైట్స్ ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్ కొనుగోలు చేసింది. దాదాపు ఈ మూవీని రూ. 12 కోట్ల రూపాయలకు కొనుగోలు చేసినట్టు టాక్. హిందీలో డబ్బింగ్ సినిమాలకు మంచి డిమాండ్ ఉండటంతో గోపీచంద్ విశ్వం హిందీ డబ్బింగ్ రైట్స్ కూడా భారీ ధరకే కొనుగోలు చేసినట్టు తెలుస్తోంది.

ఈ క్రమంలో విశ్వం మూవీకి సంబంధించిన ఓటీటీ విడుదల తేదీ ఇప్పుడు నెట్టింట్లో తెగ వైరల్ గా మారుతోంది. అగ్రిమెంట్ ప్రకారం.. విశ్వం మూవీని దీపావళీ కానుకగా ఓటీటీ లో స్ట్రీమింగ్ కు తీసుకురావాలని భావించారు. కానీ, ఒప్పందంలో మార్పులు జరిగి.. ఈ మూవీని అక్టోబర్ 29 లేదా నవంబర్ 3 న గానీ అమెజాన్ ప్రైమ్ లో విడుదల చేసే అవకాశముంది. త్వరలోనే ఈ మూవీకి సంబంధించిన ఓటీటీ అధికారిక ప్రకటన రానుంది.


Click it and Unblock the Notifications











