OTT: ఓటీటీలో దుమ్మురేపుతున్న విశ్వం.. అమెజాన్‌లో శ్రీను వైట్ల మూవీకి భారీ రెస్పాన్స్!
టాలీవుడ్ సినిమా దగ్గర ఉన్నటువంటి ఒకో సీనియర్ దర్శకునికి ఒకో స్టైల్ ఉంటుంది. అయితే దర్శకుడు సినిమా చేసినా అది ఆడియెన్స్ ని ఎంటర్టైన్ చెయ్యడానికే అని చెప్పొచ్చు. కాగా అలా కామెడీ జానర్స్ లో ఒక సరికొత్త ట్రెండ్ ని సెట్ చేసిన దర్శకుడు ఎవరైనా ఉన్నారు అంటే అది ఖచ్చితంగా దర్శకుడు శ్రీను వైట్ల అని చెప్పొచ్చు.
తన కెరీర్ స్టార్టింగ్ నుంచి ఇపుడు వరకు తన సినిమాల్లో కామెడి ట్రాక్స్ కి సెపరేట్ క్రేజ్ ఉంది. ఒక ఢీ, ఒక కింగ్, దూకుడు, బాద్షా, ఆగడు, వెంకీ, దుబాయ్ శీను, ఇలా అన్ని సినిమాల్లో అలా మిగతా కథ ఎలా ఉన్నప్పటికీ శ్రీను వైట్ల మినిమమ్ గ్యారెంటీ నవ్వులు అందిస్తారు అని ఒక మార్క్ అయితే ఉంది. ఇలా ఇపుడు వరకు చేసిన సినిమాల్లో టాలీవుడ్ లో ఇండస్ట్రీ షేకింగ్ హిట్స్ కూడా తన నుంచి ఉన్నాయి కానీ తర్వాత తన మార్కెట్ దెబ్బ తింది.

వరుస డిజాస్టర్ సినిమాలు శ్రీను వైట్లని ఫేడ్ అవుట్ చేసాయి. అలా తన కెరీర్ బిగ్గెస్ట్ హిట్స్ లో ఒకటైన ఢీ సీక్వెల్ ని స్టార్ట్ చేసి అదీ ఆపేసారు. దానితో అయినా తాను కం బ్యాక్ ఇస్తారు అనుకుంటే అక్కడ కూడా నిరాశే ఎదురైంది. ఇక ఫైనల్ గా అయితే టాలీవుడ్ మ్యాచో హీరో గోపీచంద్ తో చేసిన మొదటి సినిమాతో మళ్ళీ తాను కొంచెం ఫామ్ లోకి వచ్చినట్టు అయ్యింది.
కాగా ఆ సినిమానే "విశ్వం". మరి ఈ సినిమాలో అదే రొటీన్ టెర్రర్ బ్యాక్ డ్రాప్ ని తాను తీసుకున్నప్పటికీ మళ్ళీ శ్రీను వైట్ల మార్క్ ఎంటర్టైన్మెంట్ ని అయితే ఇందులో చూపించారు. దీనితో ఆ రకంగా సినిమా థియేటర్స్ లో ఉన్న కొన్ని రోజులు బాగానే ఆడేసింది. కాగా కొన్ని వారాలు కితమే దసరా కానుకగా సినిమా విడుదల కాగా ఇపుడు నెల తిరక్కుండానే ఓటిటిలో సినిమా దర్శనం ఇచ్చింది.

కేవలం మూడు వారాల రన్ తర్వాతే సినిమా ఓటిటి ఆడియెన్స్ ని అలరించేందుకు వచ్చేసింది. కాగా ఈ సినిమా స్ట్రీమింగ్ హక్కులని పాపులర్ యాప్ అమెజాన్ సంస్థ ప్రైమ్ వీడియో సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. కాగా ఇందులో నేటి నుంచే ఈ సినిమా సైలెంట్ గా అందుబాటులోకి వచ్చేసింది. కనీసం సోషల్ మీడియాలో కూడా చిన్న అలికిడి లేకుండా ఈ చిత్రం వచ్చేసింది.
దీనితో ఈ ఎంటర్టైనర్ చూడాలి అనుకునేవారు ఇపుడు ట్రై చేయొచ్చు. కాగా ఈ సినిమాలో హీరోయిన్ గా యంగ్ అండ్ బ్యూటీ కావ్య థాపర్ హీరోయిన్ గా నటించగా నరేష్, ప్రగతి వెన్నెల కిషోర్ తదితరులు ముఖ్య పాత్రల్లో నటించారు. అలాగే పీపుల్ మీడియా ఫ్యాక్టరీ సంస్థ నిర్మాణం వహించింది. ఇక ఓటిటిలో వచ్చిన ఈ సినిమా ఇక్కడ ఆడియెన్స్ నుంచి మంచి రెస్పాస్స్ అందుకోవడమే కాకుండా శ్రీను వైట్ల మార్కు కామెడీని ఎంజాయ్ చేస్తున్నారు.


Click it and Unblock the Notifications











