Bhimaa OTT: భీమా ఓటీటీ వివరాలు లీక్.. గోపీచంద్ మూవీ ఎప్పుడు, ఎందులో వస్తుందంటే!
యాక్టింగ్, డ్యాన్స్, ఫైట్స్ ఇలా అన్ని విభాగాల్లో రాణిస్తున్నా సరైన విజయాలను అందుకోవడంలో విఫలం అవుతోన్న హీరోలు చాలా మందే ఉన్నారు. అలాంటి వారిలో మ్యాచో స్టార్ గోపీచంద్ ఒకడు. చాలా కాలంగా హిట్‌ను చూడలేకపోతోన్న ఈ టాలెంటెడ్ హీరో.. ఈ సారి ఎలాగైనా సక్సెస్ ట్రాక్ ఎక్కాలన్న పట్టుదలతో ఉన్నాడు. ఇందుకోసం 'భీమా' అనే మాస్ ఫిల్మ్‌లో నటించాడు.
కన్నడ దర్శకుడు ఏ హర్ష డైరెక్షన్‌లో గోపీచంద్ నటించిన సినిమానే 'భీమా'. పక్కా మాస్ ఎలిమెంట్స్‌కు సోషియో ఫాంటసీ అంశాలను జోడించి ఈ చిత్రాన్ని రూపొందించారు. దీంతో ఇది ఆరంభంలోనే అందరి దృష్టిని ఆకర్షించింది. అందుకు తగ్గట్లుగానే భారీ హైప్‌ను క్రియేట్ చేసుకున్న ఈ చిత్రం.. ఈరోజే (మార్చి 8వ తేదీ) ప్రపంచ వ్యాప్తంగా విడుదల అయిపోయింది.

గోపీచంద్ - హర్ష కాంబినేషన్‌లో డిఫరెంట్ యాక్షన్‌తో రూపొందిన 'భీమా' మూవీకి సంబంధించి ఇప్పటికే యూఎస్‌లో ప్రీమియర్స్‌తో పాటు మిగిలిన ప్రాంతాల్లో షోలు పడిపోయాయి. అన్ని ఏరియాల్లోనూ దీనికి డీసెంట్ మౌత్ టాక్ వచ్చింది. మరికొద్దిసేపట్లోనే రివ్యూలు కూడా రాబోతున్నాయి. దానిబట్టే ఈ చిత్రం ఎలాంటి ప్రదర్శన చేయబోతుంది అనేది తెలియనుంది.
'భీమా' సినిమా సందడి ఇప్పటికే థియేటర్లలో మొదలైపోగా.. ఈ మూవీ డిజిటల్ స్ట్రీమింగ్ వివరాలు తాజాగా బయటకు వచ్చేశాయి. దీని ప్రకారం.. ఈ సినిమాను తీవ్ర పోటీ నడుమ డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ సంస్థ కొనుగోలు చేసింది. ఈ విషయాన్ని సినిమా టైటిల్ కార్డులో రివీల్ చేశారు. ఇక, ఈ హక్కుల కోసం సదరు సంస్థ చిత్ర నిర్మాతలకు భారీ మొత్తాన్నే చెల్లించినట్లు న్యూస్ లీకైంది.

మ్యాచో స్టార్ గోపీచంద్ నటించిన 'భీమా' సినిమాను థియేటర్లలోకి వచ్చిన 30 రోజుల తర్వాతనే ఓటీటీలో స్ట్రీమింగ్ చేసేలా డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ సంస్థతో నిర్మాతలు ఒప్పందం చేసుకున్నారని కూడా ఓ న్యూస్ ప్రచారం అవుతోంది. అంటే మార్చి 8వ తేదీన విడుదలైన 'భీమా' చిత్రం ఏప్రిల్ రెండో వారంలో స్ట్రీమింగ్ అయ్యే అవకాశం ఉందని అంటున్నారు.
ఇదిలా ఉండగా.. గోపీచంద్ హీరోగా నటించిన 'భీమా' మూవీని శ్రీ సత్య సాయి ఆర్ట్స్ బ్యానర్‌పై కేకే రాధామోహన్ నిర్మించారు. ఇందులో ప్రియాంక భవానీ శంకర్, మాళవిక శర్మ హీరోయిన్‌లుగా నటించగా.. వెన్నెల కిశోర్, రఘుబాబు, నాజర్, ముఖేష్ తివారి, నరేష్ తదితరులు కీలక పాత్రలు చేశారు. ఈ చిత్రానికి రవి బస్రూర్ సంగీతాన్ని సమకూర్చాడు.


Click it and Unblock the Notifications











