భీమా ఓటీటీపై బిగ్ ట్విస్ట్.. ఆరోజుకు వాయిదా పడ్డ మాస్ మూవీ
టాలీవుడ్‌లోని చాలా మంది హీరోలు హిట్లు ఫ్లాపులతో ఎలాంటి సంబంధం లేకుండా సినిమాలు చేస్తూ వెళ్తున్నారు. కానీ, అందులో కొందరు మాత్రం అప్పుడప్పుడూ విజయాలను సొంతం చేసుకుంటున్నారు. అయితే, మరికొందరు మాత్రం ఫ్లాపుల పరంపరతోనే వెళ్తున్నారు. అలాంటి వారిలో మ్యాచ్ స్టార్ గోపీచంద్ ఒకడు. భారీ సక్సెస్ కోసం అతడు చేసిన సినిమానే 'భీమా'.
టాలీవుడ్ స్టార్ గోపీచంద్ హీరోగా.. కన్నడ డైరెక్టర్ ఏ హర్ష తెరకెక్కించిన సినిమానే 'భీమా'. మాస్ ఎలిమెంట్లకు ఫాంటసీని జోడించి రూపొందిన ఈ చిత్రం ఆరంభంలోనే అందరి దృష్టిని ఆకర్షించింది. అందుకు తగ్గట్లుగానే భారీ అంచనాలను ఏర్పరచుకుని మార్చి 8న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కానీ, ఈ సినిమా మాత్రం మిక్స్‌డ్ టాక్‌ను తెచ్చుకున్న విషయం తెలిసిందే.

గోపీచంద్ - హర్ష కలయికలో తెరకెక్కిన 'భీమా' చిత్రానికి టాక్‌కు అనుగుణంగానే ప్రేక్షకుల నుంచి అదిరిపోయే రెస్పాన్స్ లభించింది. ఫలితంగా ఈ మూవీ ఓపెనింగ్స్‌తో పాటు ఆ తర్వాత కూడా కలెక్షన్లను పెద్దగా వసూలు చేయలేదు. తద్వారా ఈ సినిమా నష్టాలతో దాదాపుగా రన్‌ను ముగించింది. అప్పటి నుంచి ఈ సినిమా ఓటీటీ స్ట్రీమింగ్‌పై ఎన్నో ప్రచారాలు మొదలయ్యాయి.
క్రేజీ స్టోరీతో రూపొందిన 'భీమా' మూవీకి సంబంధించిన డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను ఫేమస్ ఓటీటీ సంస్థ డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ దక్కించుకున్న సంగతి తెలిసిందే. ఇందుకోసం సదరు సంస్థ మంచి రేటునే ముట్టజెప్పినట్లు ఇండస్ట్రీలో ఓ టాక్ వినిపించింది. ఇక, ఈ చిత్రం హిట్ కాకపోవడంతో నెల రోజుల కంటే ముందుగానే స్ట్రీమింగ్ అవుతుందని వార్తలు వస్తున్నాయి.
గోపీచంద్ హీరోగా నటించిన 'భీమా' సినిమాను ఏప్రిల్ 5వ తేదీనే తీసుకొస్తారని అన్నారు. తర్వాత 12వ తేదీ నుంచి స్ట్రీమింగ్ చేయబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ పరిస్థితుల్లో హాట్‌స్టార్ సంస్థ అఫీషియల్ డేట్‌ను అనౌన్స్ చేసింది. ఈ చిత్రాన్ని ఏప్రిల్ 25వ తేదీ నుంచి అందుబాటులోకి తీసుకు వస్తున్నట్లు చెప్పి షాకిచ్చింది. దీంతో ఫ్యాన్స్ నిరాశ చెందుతున్నారు.
ఇదిలా ఉండగా.. మ్యాచో స్టార్ గోపీచంద్ హీరోగా నటించిన 'భీమా' మూవీని శ్రీ సత్య సాయి ఆర్ట్స్ బ్యానర్‌పై కేకే రాధామోహన్ నిర్మించారు. ఇందులో ప్రియాంక భవానీ శంకర్, మాళవిక శర్మ హీరోయిన్‌లుగా నటించగా.. వెన్నెల కిశోర్, రఘుబాబు, నాజర్, ముఖేష్ తివారి, నరేష్ తదితరులు కీలక పాత్రలు చేశారు. ఈ చిత్రానికి రవి బస్రూర్ మ్యూజిక్‌ను ఇచ్చారు.


Click it and Unblock the Notifications











