Bhimaa OTT: ముందుగానే ఓటీటీలోకి భీమా.. ఎప్పుడు వస్తుందో తెలిస్తే!
తెలుగు చిత్ర పరిశ్రమలో ఉన్న హీరోల్లో దాదాపుగా అందరూ రెండు మూడేళ్లకు అయినా ఒక విజయాన్ని అందుకుని సత్తా చాటుతున్నారు. కానీ, ఒకరిద్దరు మాత్రం సుదీర్ఘ కాలంగా హిట్‌ను చూడకుండా ఇబ్బంది పడుతున్నారు. అలాంటి వారిలో మ్యాచో స్టార్ గోపీచంద్ ఒకడు. ఇప్పటికైనా భారీ సక్సెస్ సాధించాలన్న లక్ష్యంతో 'భీమా' అనే సినిమాలో నటించాడు.
కన్నడ పరిశ్రమకు చెందిన డైరెక్టర్ ఏ హర్ష రూపకల్పనలో గోపీచంద్ నటించిన చిత్రమే 'భీమా'. మాస్ అండ్ సోషియో ఫాంటసీ ఎలిమెంట్లతో ఈ సినిమాను రూపొందించారు. దీంతో ఇది ఆరంభంలోనే అందరి దృష్టిలో పడిపోయింది. అందుకు తగ్గట్లుగానే భారీ హైప్‌ను క్రియేట్ చేసుకున్న ఈ చిత్రం.. మార్చి 8వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల అయింది.

గోపీచంద్ - హర్ష కలిసి చేసిన హై రేంజ్ యాక్షన్ మూవీ 'భీమా'కు ప్రీమియర్స్ నుంచే మిక్స్‌డ్ టాక్ వచ్చింది. అందుకు తగ్గట్లుగానే ఈ చిత్రానికి ప్రేక్షకుల నుంచి మోస్తరు స్పందన మాత్రం వచ్చింది ఫలితంగా గోపీచంద్ నటించిన ఈ చిత్రం ఓపెనింగ్స్‌తో పాటు ఆ తర్వాత కూడా కలెక్షన్లను అంతగా రాబట్టలేదు. తద్వారా ఈ సినిమా నష్టాలతో దాదాపుగా రన్‌ను ముగించింది.
ఫుల్ లెంగ్త్ యాక్షన్‌తో రూపొందిన 'భీమా' మూవీకి సంబంధించిన డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను ఫేమస్ ఓటీటీ సంస్థ డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ దక్కించుకున్న విషయం తెలిసిందే. ఇందుకోసం సదరు సంస్థ మంచి రేటునే ముట్టజెప్పినట్లు ఇండస్ట్రీలో ఓ టాక్ వినిపించింది. ఇక, ఇప్పుడు ఈ మూవీ స్ట్రీమింగ్ డేట్‌పై ఓ ఊహించని న్యూస్ ఫిలిం నగర్ ఏరియాలో వైరల్ అవుతోంది.

మ్యాచో స్టార్ గోపీచంద్ నటించిన 'భీమా' సినిమాను థియేటర్లలోకి వచ్చిన 30 రోజుల తర్వాతనే ఓటీటీలో స్ట్రీమింగ్ చేస్తారని ప్రచారం జరుగుతోంది. అయితే, తాజా సమాచారం ప్రకారం.. ఈ చిత్రాన్ని మరింత ముందుగానే స్ట్రీమింగ్ చేయబోతున్నారట. అంటే నెల రోజుల లోపే ఈ మూవీ ఓటీటీలోకి వచ్చేస్తుందని చెప్పొచ్చు. దీనిపై అధికారిక ప్రకటన త్వరలోనే రానుందని టాక్.
ఇదిలా ఉండగా.. మ్యాచో స్టార్ గోపీచంద్ హీరోగా నటించిన 'భీమా' మూవీని శ్రీ సత్య సాయి ఆర్ట్స్ బ్యానర్‌పై కేకే రాధామోహన్ నిర్మించారు. ఇందులో ప్రియాంక భవానీ శంకర్, మాళవిక శర్మ హీరోయిన్‌లుగా నటించగా.. వెన్నెల కిశోర్, రఘుబాబు, నాజర్, ముఖేష్ తివారి, నరేష్ తదితరులు కీలక పాత్రలు చేశారు. ఈ చిత్రానికి రవి బస్రూర్ సంగీతం అందించాడు.


Click it and Unblock the Notifications











