ఓటీటీలోకి ఫాంటసీ ప్లస్ మాస్ సినిమా.. అప్పుడే వచ్చేస్తుందిగా!

తెలుగు సినిమాల్లో ఉన్న హీరోలందరూ ఒకసారి కాకపోతే మరోసారి విజయాలను అందుకుని కెరీర్‌లను సక్రమంగా ముందుకు తీసుకు వెళ్తున్నారు. కానీ, కొందరు హీరోలు మాత్రం సుదీర్ఘ కాలంగా సక్సెస్‌ను చూడలేక కష్టాలను ఎదుర్కొంటూనే ఉన్నారు. అలాంటి హీరోల్లో మ్యాచో స్టార్ గోపీచంద్ ఒకడు. సరైన బ్లాక్ బస్టర్ కోసం చూస్తోన్న అతడు 'భీమా' అనే మూవీతో వచ్చాడు.

మ్యాచో స్టార్ గోపీచంద్ హీరోగా.. కన్నడ దర్శకుడు ఏ హర్ష తెరకెక్కించిన చిత్రమే 'భీమా'. ఫాంటసీ ఎలిమెంట్లతో కూడిన మాస్ స్టోరీతో రూపొందిన ఈ చిత్రం ఆరంభంలోనే అందరి దృష్టిని ఆకర్షించింది. అందుకు తగ్గట్లుగానే భారీ అంచనాలను ఏర్పరచుకుని ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కానీ, ఈ సినిమా మాత్రం పాజిటివ్ టాక్‌ను తెచ్చుకోవడంలో విఫలం అయింది.

Gopichand Starrer Bhimaa Movie OTT Streaming Date Locked

గోపీచంద్ - హర్ష కాంబినేషన్‌లో రూపొందిన 'భీమా' చిత్రానికి టాక్‌కు అనుగుణంగానే ప్రేక్షకుల నుంచి మోస్తరు స్పందన మాత్రం వచ్చింది. ఫలితంగా ఈ మూవీ ఓపెనింగ్స్‌తో పాటు ఆ తర్వాత కూడా కలెక్షన్లను అంతగా రాబట్టలేదు. తద్వారా ఈ సినిమా నష్టాలతో దాదాపుగా రన్‌ను ముగించింది. దీంతో హిట్ కొట్టాలన్న గోపీచంద్ ఆశలు సఫలం కాలేదనే చెప్పుకోవాలి.

మాస్ అండ్ ఫాంటసీ జోనర్‌లో రూపొందిన 'భీమా' మూవీకి సంబంధించిన డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను ఫేమస్ ఓటీటీ సంస్థ డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ దక్కించుకుంది. ఇందుకోసం సదరు సంస్థ మంచి రేటునే ముట్టజెప్పినట్లు ఇండస్ట్రీలో ఓ టాక్ వినిపించింది. ఈ సినిమా స్ట్రీమింగ్‌పై ఎన్నో ప్రచారాలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా ఓ క్రేజీ న్యూస్ లీక్ అయింది.

Gopichand Starrer Bhimaa Movie OTT Streaming Date Locked

మ్యాచో స్టార్ గోపీచంద్ హీరోగా నటించిన 'భీమా' సినిమాను థియేటర్లలోకి వచ్చిన 30 రోజుల తర్వాతనే ఓటీటీలో స్ట్రీమింగ్ చేస్తారని ప్రచారం జరిగింది. కానీ, ఇది పరాజయం పాలవడంతో ముందే వస్తుందని ఇటీవలే న్యూస్ లీకైంది. దీనికి అనుగుణంగానే ఈ చిత్రం ఏప్రిల్ 5వ తేదీ నుంచే స్ట్రీమింగ్‌కు రాబోతుందని తెలిసింది. దీనిపై ఈ వారంలో ప్రకటన వస్తుందని సమాచారం.

ఇదిలా ఉండగా.. గోపీచంద్ హీరోగా నటించిన 'భీమా' మూవీని శ్రీ సత్య సాయి ఆర్ట్స్ బ్యానర్‌పై కేకే రాధామోహన్ నిర్మించారు. ఇందులో ప్రియాంక భవానీ శంకర్, మాళవిక శర్మ హీరోయిన్‌లుగా నటించగా.. వెన్నెల కిశోర్, రఘుబాబు, నాజర్, ముఖేష్ తివారి, నరేష్ తదితరులు కీలక పాత్రలు చేశారు. ఈ చిత్రానికి రవి బస్రూర్ మ్యూజిక్ కంపోజ్ చేశాడు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X