Ramabanam OTT: 4 నెలల తర్వాత ఫ్లాప్ మూవీ స్ట్రీమింగ్.. ఆలస్యానికి కారణం ఇదేనా!
తెలుగులో చాలా మంది హీరోలు సరైన హిట్లను అందుకోలేక చాలా కాలంగా ఇబ్బందులు పడుతున్నారు. తద్వారా కెరీర్‌లను ఆశించిన రీతిలో ముందుకు తీసుకు వెళ్లడం లేదు. అలాంటి వారిలో మ్యాచో స్టార్ గోపీచంద్ ఒకరు. ఈ హీరోకు భారీ హిట్ వచ్చి చాలా కాలమే అవుతోంది. అయినప్పటికీ ప్రయత్నాలను మాత్రం అస్సలు ఆపడం లేదు. ఈ క్రమంలోనే ఇటీవలే గోపీచంద్ 'రామబాణం' అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఫుల్ లెంగ్త్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన ఈ సినిమా ఆరంభంలోనే ఎన్నో అంచనాలను ఏర్పరచుకుని విడుదలైంది.
గోపీచంద్ హీరోగా టాలెంటెడ్ డైరెక్టర్ శ్రీవాస్ రూపొందించిన చిత్రమే 'రామబాణం'. ఈ సినిమాకు ఆరంభం నుంచే మిక్స్‌డ్ టాక్ వచ్చింది. అందుకు తగ్గట్లుగానే ఈ చిత్రానికి ప్రేక్షకుల నుంచి స్పందన కూడా భారీ స్థాయిలో దక్కలేదు. దీంతో ఈ చిత్రానికి అనుకున్న విధంగా ఓపెనింగ్స్ రాలేదు. పైగా ఫుల్ రన్‌లోనూ ఈ మూవీ ఆశించిన రీతిలో కలెక్షన్లను మాత్రం అందుకోలేదు. దీంతో 'రామబాణం' మూవీ భారీ నష్టాలతోనే రన్‌ను ముగించుకోవాల్సి వచ్చింది. ఈ నేపథ్యంలో తాజాగా 'రామబాణం' మూవీ ఓటీటీ స్ట్రీమింగ్ డేట్‌పై ప్రకటన వచ్చింది.

హిట్ కాంబినేషన్‌లో రూపొందిన 'రామబాణం' మూవీపై నెలకొన్న అంచనాల కారణంగా.. దీని డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులకు మంచి పోటీనే ఏర్పడింది. అందుకు అనుగుణంగానే ఓటీటీ సోనీలివ్ సంస్థ ఈ మూవీ డిజిటల్ రైట్స్‌ను కొన్నట్లు టాక్ వినిపించింది. ఈ నేపథ్యంలో ఈ చిత్రాన్ని సదరు సంస్థ జూన్ 3వ తేదీ నుంచి డిజిటల్ స్ట్రీమింగ్ చేయబోతుందని టాక్ వచ్చింది. కానీ అలా జరగలేదు. దీంతో ఏం జరుగుతుందో అన్న కన్ఫూజన్ ఏర్పడింది.
థియేటర్లలో విడుదలైన నాలుగు నెలల తర్వాత 'రామబాణం' మూవీ డిజిటల్ స్ట్రీమింగ్‌కు అందుబాటులోకి రాబోతుంది. ఈ విషయాన్ని నెట్‌ఫ్లిక్స్ సంస్థ అధికారికంగా ప్రకటించింది. దీన్ని సెప్టెంబర్ 14 నుంచి స్ట్రీమింగ్ చేస్తున్నట్లు తాజాగా ప్రకటించింది. ఇక, నిర్మాతలకు, సోనీలివ్ సంస్థకు మధ్య జరిగిన సర్ధుబాట్లు వల్లే ఈ చిత్రం ఆలస్యంగా స్ట్రీమింగ్ అవుతున్నట్లు తెలిసింది.

ఇదిలా ఉండగా.. గోపీచంద్ హీరోగా నటించిన 'రామబాణం' చిత్రాన్ని పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టీజీ విశ్వప్రసాద్ నిర్మించారు. ఇందులో డింపుల్ హయాతి హీరోయిన్‌గా నటించగా.. జగపతి బాబు, కుస్భూ సుందర్, తరుణ్ రాజ్, నాజర్, సచిన్ ఖేడ్కర్ తదితరులు కీలక పాత్రలు చేశారు. ఈ చిత్రానికి మిక్కీ జే మేయర్ సంగీతాన్ని అందించాడు.


Click it and Unblock the Notifications











