Ramabanam OTT: రామబాణం ఓటీటీ డేట్ ఫిక్స్.. ఎప్పుడు రాబోతుందో తెలిస్తే!

టాలీవుడ్‌లో హిట్లు ఫ్లాపులను ఏమాత్రం పట్టించుకోకుండా వెంట వెంటనే సినిమాలు చేసుకుంటూ వెళ్లే హీరోలు చాలా తక్కువ మందే ఉన్నారు. అందులో టాలెంటెడ్ హీరో మ్యాచో స్టార్ గోపీచంద్ ఒకరు. ఈ హీరోకు భారీ హిట్ వచ్చి చాలా కాలమే అవుతోంది. అయినప్పటికీ ప్రయత్నాలను మాత్రం అస్సలు ఆపడం లేదు. ఈ క్రమంలోనే ఇటీవలే గోపీచంద్ 'రామబాణం' అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఫుల్ లెంగ్త్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన ఈ సినిమా ఆరంభంలోనే ఎన్నో అంచనాలను ఏర్పరచుకుని ఎంతో గ్రాండ్‌గా రిలీజ్ అయింది.

మ్యాచో స్టార్ గోపీచంద్ హీరోగా టాలెంటెడ్ డైరెక్టర్ శ్రీవాస్ రూపొందించిన సినిమానే 'రామబాణం'. ఈ మూవీకి మొదటి ఆట నుంచే మిక్స్‌డ్ టాక్ వచ్చింది. అందుకు తగ్గట్లుగానే ఈ చిత్రానికి ప్రేక్షకుల నుంచి స్పందన కూడా భారీ స్థాయిలో అయితే దక్కలేదు. దీంతో ఈ చిత్రానికి మంచి ఓపెనింగ్స్ రాలేదు. పైగా ఫుల్ రన్‌లోనూ ఈ మూవీ ఆశించిన రీతిలో కలెక్షన్లను మాత్రం అందుకోలేదు. దీంతో 'రామబాణం' మూవీ నష్టాలతోనే రన్‌ను ముగించుకోవాల్సి వచ్చింది. ఈ నేపథ్యంలో తాజాగా 'రామబాణం' మూవీ ఓటీటీ స్ట్రీమింగ్ వివరాలు బయటకు వచ్చాయి.

Gopichand Starrer Ramabanam Movie Streaming on SonyLIV From June 3rd

హిట్ కాంబినేషన్‌లో ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా వచ్చిన 'రామబాణం' మూవీపై నెలకొన్న అంచనాల కారణంగా.. దీని డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులకు తీవ్ర స్థాయిలో పోటీ ఏర్పడింది. అందుకు అనుగుణంగానే ఓటీటీ దిగ్గజం సోనీ లివ్ సంస్థ ఈ మూవీ డిజిటల్ రైట్స్‌ను భారీ ధరకు కొనుగోలు చేసింది. ఈ నేపథ్యంలో ఈ చిత్రాన్ని సదరు సంస్థ జూన్ 3వ తేదీ నుంచి డిజిటల్ స్ట్రీమింగ్ చేయబోతుందని తెలుస్తోంది. అంటే మే 5న విడుదలైన 'రామబాణం' నెల రోజుల లోపే ఓటీటీలోకి వచ్చేస్తుంది. మరి ఇందులో ఈ చిత్రం ఏ మేర ఆకట్టుకుంటుందో చూడాలి.

Gopichand Starrer Ramabanam Movie Streaming on SonyLIV From June 3rd

మ్యాచో స్టార్ గోపీచంద్ హీరోగా నటించిన 'రామబాణం' చిత్రాన్ని పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టీజీ విశ్వప్రసాద్ నిర్మించారు. ఇందులో డింపుల్ హయాతి హీరోయిన్‌గా నటించగా.. జగపతి బాబు, కుస్భూ సుందర్, తరుణ్ రాజ్, నాజర్, సచిన్ ఖేడ్కర్ తదితరులు కీలక పాత్రలు చేశారు. ఈ చిత్రానికి మిక్కీ జే మేయర్ సంగీతాన్ని అందించాడు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X