Ramabanam OTT: ఫేమస్ ఓటీటీలో రామబాణం.. ఎప్పుడు స్ట్రీమింగ్ అవుతుందంటే!
తెలుగు సినీ ఇండస్ట్రీలో టాలెంట్ ఉన్న హీరోలు చాలా మందే ఉన్నారు. అయితే, అందులో కొందరు మాత్రమే వరుసగా విజయాలను సొంతం చేసుకుంటూ ఉండగా.. మరికొందరు మాత్రం భారీ సక్సెస్‌ల కోసం వేచి చూస్తున్నారు. అందులో మ్యాచో స్టార్ గోపీచంద్ ఒకరు. కెరీర్ ఆరంభంలోనే ఎన్నో హిట్లు ఖాతాలో వేసుకున్న అతడు.. కొంత కాలంగా ఇబ్బందులు పడుతోన్నాడు. అయినప్పటికీ సినిమాల మీద సినిమాలు చేస్తూనే ఉన్నాడు. ఈ క్రమంలోనే ఇప్పుడు గోపీచంద్ 'రామబాణం' అనే కుటుంబ కథా సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చేశాడు.
మ్యాచో స్టార్ గోపీచంద్ హీరోగా టాలెంటెడ్ డైరెక్టర్ శ్రీవాస్ తెరకెక్కించిన చిత్రమే 'రామబాణం'. ఈ మూవీకి అమెరికాలోని ప్రీమియర్స్ నుంచే మిక్స్‌డ్ టాక్ వచ్చింది. అలాగే, తెలుగు రాష్ట్రాల్లో కూడా దాదాపుగా నెగెటివ్ టాక్‌ను సొంతం చేసుకుంది. అందుకు తగ్గట్లుగానే ఈ చిత్రానికి ప్రేక్షకుల నుంచి స్పందన కూడా భారీ స్థాయిలో అయితే దక్కడం లేదు. దీంతో ఈ చిత్రానికి మంచి ఓపెనింగ్స్ వచ్చే అవకాశం లేన్నట్లు ట్రేడ్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా 'రామబాణం' మూవీ ఓటీటీ డీల్ గురించి, స్ట్రీమింగ్ వివరాలు బయటకు వచ్చాయి.

కుటుంబ కథా చిత్రంగా రూపొందిన 'రామబాణం' మూవీపై నెలకొన్న అంచనాల కారణంగా.. దీని డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులకు తీవ్ర స్థాయిలో పోటీ ఏర్పడింది. అందుకు అనుగుణంగానే ఓటీటీ దిగ్గజం సోనీ లివ్ సంస్థ ఈ మూవీ డిజిటల్ రైట్స్‌ను భారీ ధరకు కొనుగోలు చేసినట్లు తెలిసింది. అంతేకాదు, థియేటర్లలో విడుదలైన నెల రోజుల తర్వాతనే ఈ చిత్రాన్ని ఓటీటీలో స్ట్రీమింగ్ చేసేలా నిర్మాతలు ఒప్పందం చేసుకున్నారని సమాచారం. అంటే మే 5న విడుదలైన 'రామబాణం' జూన్ మొదటి వారంలో స్ట్రీమింగ్‌కు వస్తుందనే టాక్ ఫిలిం నగర్‌లో వినిపిస్తోంది.

గోపీచంద్ హీరోగా నటించిన 'రామబాణం' చిత్రాన్ని పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టీజీ విశ్వప్రసాద్ నిర్మించారు. ఇందులో డింపుల్ హయాతి హీరోయిన్‌గా నటించగా.. జగపతి బాబు, కుస్భూ సుందర్, తరుణ్ రాజ్, నాజర్, సచిన్ ఖేడ్కర్ తదితరులు కీలక పాత్రలు చేశారు. ఈ చిత్రానికి మిక్కీ జే మేయర్ సంగీతాన్ని సమకూర్చాడు.


Click it and Unblock the Notifications











