Viswam Ott Release Date : గోపీచంద్‌ కాలర్ ఎగరేసేలా చేసిన మూవీ.. ఓటీటీలోకి విశ్వం ఎప్పుడంటే?

మాచో స్టార్ గోపీచంద్ , కామెడీ చిత్రాల స్పెషలిస్ట్ శ్రీనువైట్ల కాంబినేషన్ అనగానే ఇండస్ట్రీ మొత్తం షాక్ అయ్యింది. కారణం ఈ ఇద్దరు హిట్ కొట్టి చాలా ఏళ్లే అవుతుండటమే. వరుసపెట్టి సినిమాలు ఫ్లాప్ అవుతున్నా.. నిరుత్సాహపడకుండా వీరిద్దరూ ప్రయత్నిస్తూనే ఉన్నారు. అలాంటి గోపీచంద్- శ్రీనువైట్ల కాంబినేషన్‌లో వచ్చిన చిత్రమే విశ్వం. దసరా కానుకగా అక్టోబర్ 11న ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ సినిమా పాజిటివ్ టాక్‌తో దూసుకెళ్తోంది. ఈ సినిమా కోసం ఓటీటీ ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ వివరాల్లోకి వెళితే..

విశ్వం (గోపిచంద్)కు తండ్రి అంటే వల్లమాలిన ప్రేమ. అలాంటి తన తండ్రిపై మాయని మచ్చపడటంతో నిజం నిరూపించడానికి ఇటలీ నుంచి హైదరాబాద్‌కు వస్తాడు. ఈ ప్రయాణంలో క్యాస్టూమ్ డిజైనర్‌గా పనిచేసే సమీరా (కావ్య థాపర్)తో ప్రేమలో పడతాడు. ఇదిలా ఉండగా, పాకిస్థాన్‌కు చెందిన ఉగ్రవాద ముఠా నాయకుడు ఖురేషి (జిషుసేన్ గుప్తా) హిందువు ముసుగులో భారతదేశంలో అల్లకల్లోలం సృష్టించాలని ప్లాన్ చేస్తాడు. వ్యాపారవేత్త బాచిరాజు (సునీల్)తో చేతులు కలిపి భారీ పేలుళ్లకు ప్లాన్ చేస్తాడు.

GopiChand Viswam ott release date confirmed by amazon prime video here s the details

హైదరాబాద్‌లో అమలు చేయాలనుకొన్న ఈ ప్లాన్‌ తన సోదరుడు, మినిస్టర్ (సుమన్)కు తెలియడంతో ఖురేషితో కలిసి బాచిరాజు అతనిని హత్య చేస్తాడు. ఆ విషయాన్ని దర్శని అనే పాప చూస్తుంది. దాంతో పాపను చంపేందుకు ఖురేషి ప్లాన్ చేస్తే.. విశ్వం కాపాడతాడు. ఈ క్రమంలో పాపను ఖురేషి మనుషులు కాల్చివేస్తారు. కేంద్ర మంత్రి అయిన తన సోదరుడిని బాచిరాజు ఎందుకు చంపాడు? దర్శనను విశ్వం ఎలా కాపాడాడు? అసలు విశ్వం హైదరాబాద్‌కు ఎందుకు వచ్చాడు? ఖురేషి ప్లాన్‌ను ఎలా తిప్పికొట్టాడు ? బాచిరాజు ప్లాన్ వర్కవుట్ అయిందా? అసలు విశ్వం ఎవరు? అనే ప్రశ్నలకు సమాధానమే విశ్వం సినిమా కథ.

చిత్రాలయం స్టూడియోస్, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్స్‌పై వేను దొనేపూడి, టీజీ విశ్వప్రసాద్, వివేక్ కూచిబొట్ల, కొండల్ జిన్నాలు సంయుక్తంగా విశ్వంను నిర్మించారు. ఈ మూవీలో గోపీచంద్, కావ్య థాపర్‌ హీరో హీరోయిన్లుగా నటించగా చైతన్ భరద్వాజ్ సంగీతం అందజేశారు. విశ్వం ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా బాగానే జరిగింది. తెలుగు రాష్ట్రాల్లో రూ.10 కోట్లు, కర్ణాటక, రెస్ట్ ఆఫ్ ఇండియా ప్లస్ ఓవర్సీస్ రూ.1.5 కోట్లు చొప్పున మొత్తంగా వరల్డ్ వైడ్‌గా రూ.11.5 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది.

GopiChand Viswam ott release date confirmed by amazon prime video here s the details

రూ.12.5 కోట్ల షేర్, రూ.25 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ టార్గెట్‌గా ప్రపంచవ్యాప్తంగా దాదాపు రూ.600 థియేటర్‌లలో విడుదలైంది విశ్వం . మొత్తంగా 10 రోజుల వరకు గోపీచంద్ సినిమా రూ.11.16 కోట్ల నికర వసూళ్లను రాబట్టి బ్రేక్ ఈవెన్ టార్గెట్ దిశగా దూసుకెళ్తోంది. సెకండ్ వీకెండ్‌లో గోపీచంద్ కలెక్షన్ల వర్షం కురిపిస్తున్నాడు. దీపావళి వరకు పెద్ద సినిమాలేవి లేకపోవడంతో విశ్వం మంచి లాభాలను తెచ్చిపెడతాడని విశ్లేషకులు భావిస్తున్నారు.

అంతాబాగానే ఉంది కానీ ఈ సినిమా ఎప్పుడు ఓటీటీలోకి వస్తుందని ఆ సెక్టార్ ఎదురుచూస్తోంది. విశ్వం డిజిటల్ రైట్స్‌ని అమెజాన్ ప్రైమ్ సంస్థ దాదాపు రూ.12 కోట్లకు కొనుగోలు చేసింది. థియేటర్‌లో వచ్చిన నాలుగు వారాలకు ఓటీటీలోకి రావాలి కాబట్టి ఈ సూత్రాన్ని అనుసరించి నవంబర్ రెండో వారంలో విశ్వం స్ట్రీమింగ్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఒకవేళ మేకర్స్‌తో ప్రైమ్ వీడియో చర్చలు జరిపితే మాత్రం దీపావళి కానుకగా విశ్వం ఓటీటీలో దిగినా ఆశ్చర్యపోనక్కర్లేదు. మరి ఏం జరుగుతుందో చూద్దాం మరి.

More from Filmibeat

Read more about: gopichand viswam prime video
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X