Viswam Ott Release : సైలెంట్‌గా ఓటీటీలోకి గోపీచంద్ మూవీ .. నెల తిరక్కుండానే, ఎందులో అంటే?
మాచో స్టార్ గోపీచంద్ , కామెడీ చిత్రాల స్పెషలిస్ట్ శ్రీనువైట్ల కాంబినేషన్‌లో వచ్చిన విశ్వం మూవీ కోసం ఓటీటీ లవర్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. దసరా కానుకగా అక్టోబర్ 11న ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ సినిమా పాజిటివ్ టాక్‌తో మంచి వసూళ్లను సాధించింది. అమెజాన్ ప్రైమ్ వీడియో.. విశ్వం మూవీ ఓటీటీ హక్కులను కొనుగోలు చేసింది. అయితే ఈ ఓటీటీ దిగ్గజం గోపీచంద్ అభిమానులకు ఊహించని షాకిచ్చింది.
విశ్వం (గోపిచంద్)కు తండ్రి అంటే వల్లమాలిన ప్రేమ. అలాంటి తన తండ్రిపై నిందపడటంతో నిజం నిరూపించడానికి ఇటలీ నుంచి హైదరాబాద్‌కు వస్తాడు. ఈ ప్రయాణంలో క్యాస్టూమ్ డిజైనర్‌గా పనిచేసే సమీరా (కావ్య థాపర్)తో ప్రేమలో పడతాడు. ఇదిలా ఉండగా, పాకిస్థాన్‌కు చెందిన టెర్రరిస్ట్ గ్రూప్ నాయకుడు ఖురేషి (జిషుసేన్ గుప్తా) హిందువు ముసుగులో భారతదేశంలో విధ్వంసం సృష్టించాలని అనుకుంటాడు. ఇందుకు వ్యాపారవేత్త బాచిరాజు (సునీల్) కూడా అతనికి హెల్ప్ చేస్తాడు.

హైదరాబాద్‌లో పేలుళ్లకు సంబంధించిన ప్లాన్ తన సోదరుడు, మినిస్టర్ (సుమన్)కు తెలియడంతో ఖురేషితో కలిసి బాచిరాజు అతనిని హత్య చేస్తాడు. ఆ విషయాన్ని దర్శని అనే చిన్నారి చూస్తుంది. దాంతో పాపను చంపేందుకు ఖురేషి ప్లాన్ చేస్తే .. అనుకోకుండా విశ్వం కాపాడతాడు. కేంద్ర మంత్రి అయిన తన సోదరుడిని బాచిరాజు ఎందుకు చంపాడు? దర్శనిని విశ్వం ఎలా కాపాడాడు? అసలు విశ్వం హైదరాబాద్‌కు రావాల్సిన అవసరమెంటీ ? ఖురేషి ప్లాన్‌ను విశ్వం ఎలా తిప్పికొట్టాడు ? బాచిరాజు ప్లాన్ వర్కవుట్ అయిందా? అసలు విశ్వం ఎవరు? అనే ప్రశ్నలకు సమాధానమే విశ్వం సినిమా కథ.
చిత్రాలయం స్టూడియోస్, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్స్‌పై వేను దొనేపూడి, టీజీ విశ్వప్రసాద్, వివేక్ కూచిబొట్ల, కొండల్ జిన్నాలు సంయుక్తంగా విశ్వంను నిర్మించారు. ఈ మూవీలో గోపీచంద్, కావ్య థాపర్ హీరో హీరోయిన్లుగా నటించగా చైతన్ భరద్వాజ్ సంగీతం అందజేశారు. విశ్వం ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా బాగానే జరిగింది. తెలుగు రాష్ట్రాల్లో రూ.10 కోట్లు, కర్ణాటక, రెస్ట్ ఆఫ్ ఇండియా ప్లస్ ఓవర్సీస్ రూ.1.5 కోట్లు చొప్పున మొత్తంగా వరల్డ్ వైడ్‌గా రూ.11.5 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది.
రూ.12.5 కోట్ల షేర్, రూ.25 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ టార్గెట్‌గా ప్రపంచవ్యాప్తంగా దాదాపు రూ.600 థియేటర్‌లలో విడుదలైంది విశ్వం . రోటీన్ కామెడీ, యాక్షన్ సీక్వెన్స్‌తో వచ్చిన విశ్వం పండుగ సీజన్‌లో బాగానే వర్కవుట్ అయ్యింది కానీ తర్వాత గోపీచంద్ హవా తగ్గింది. దీపావళి వరకు అంటే 20 రోజులకు ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా రూ. 17 కోట్ల గ్రాస్ వసూళ్లను మాత్రమే రాబట్టి యావరేజ్‌గా నిలిచింది. కానీ కమర్షియల్‌గా విశ్వం సక్సెస్ కాలేకపోయింది.
అంతాబాగానే ఉంది కానీ ఈ సినిమా ఎప్పుడు ఓటీటీలోకి వస్తుందని ఆ సెక్టార్ ఎదురుచూస్తోంది. విశ్వం డిజిటల్ రైట్స్‌ని అమెజాన్ ప్రైమ్ సంస్థ దాదాపు రూ.12 కోట్లకు కొనుగోలు చేసింది. థియేటర్‌లో వచ్చిన నాలుగు వారాలకు ఓటీటీలోకి రావాలి కాబట్టి ఈ సూత్రాన్ని అనుసరించి నవంబర్ రెండో వారంలో విశ్వం స్ట్రీమింగ్ అవుతుందని ఊహాగానాలు వినిపించాయి. కానీ సైలెంట్‌గా గోపీచంద్ మూవీ ఓటీటీలోకి అందుబాటులోకి వచ్చి షాకిచ్చింది. ప్రస్తుతం తెలుగులో మాత్రమే విశ్వం స్ట్రీమింగ్ అవుతోంది. మరి ఇంకెందుకు ఆలస్యం ఈ కామెడీ మూవీని మీరూ చూసేయండి.


Click it and Unblock the Notifications











