Guardian : ఏడాది తర్వాత ఓటీటీలోకి హన్సిక హార్రర్ మూవీ .. స్ట్రీమింగ్ ఎప్పుడు? ఎందులో అంటే?

దేశముదురు సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చి దుమ్మురేపింది హన్సిక. ఆ సినిమా తర్వాత కంత్రీ, మస్కా, బిల్ల, జయీభవ, కందిరీగ, దేనికైనా రెడీ, పాండవులు పాండవులు తుమ్మెద, పవర్ తదితర చిత్రాల్లో నటించారు. మధ్యలో గ్యాప్ తీసుకుని కన్నడ, తమిళ, హిందీ ఇండస్ట్రీలలో తన అదృష్టం పరీక్షించుకున్నారు. తర్వాత పెళ్లి చేసుకుని అభిమానులకు షాకిచ్చిన ఈ ముద్దుగుమ్మ గతేడాది 105 మినిట్స్‌తో తెలుగు ప్రేక్షకులను పలకరించారు. ఒకప్పుడు ముద్దుగా బొద్దుగా కనిపించి కుర్రాళ్లకు నిద్రలేకుండా చేసిన హన్సిక ఇప్పుడు సైజ్ జీరోలో కనిపిస్తుండటం ఆమె అభిమానులకు నచ్చడం లేదు.

ప్రస్తుతం తమిళంలో రౌడీ బేబీ, మ్యాన్, గాంధారీ చిత్రాలలో నటిస్తున్న హన్సిక.. ఓటీటీలు, వెబ్ సిరీస్‌లలో బిజీ అవుతున్నారు. కెరీర్‌లో భారీ హిట్ కొట్టి చాలా రోజులు కావడంతో సాలీడ్ హిట్ కోసం ఈ ముద్దుగుమ్మ ఎదురుచూస్తోంది. పెళ్లి కావడంతో తన వయసు, ఇమేజ్‌ను బట్టి సినిమాలు ఎంపిక చేసుకుంటున్నారు హన్సిక మోత్వానీ. గతేడాది ఆమె నటించిన హర్రర్ థ్రిల్లర్ గార్డియన్ ఇప్పుడు ఏడాది తర్వాత ఓటీటీలోకి వస్తోంది. ఈ సినిమా స్ట్రీమింగ్ ఎందుకు లేట్ అయ్యింది? ఏ ఓటీటీలో గార్డియన్ స్ట్రీమింగ్ కానుంది. ఈ వివరాల్లోకి వెళితే..

Guardian ott release here is the Hansika Motwani s Movie ott streaming details

గార్డియన్ చిత్రాన్ని తమిళంలో గురు శరవణన్ తెరకెక్కించారు. హన్సిక, సురేశ్ చంద్ర మీనన్, శ్రీమాన్, రాజేంద్రన్, అభిషేక్ వినోద్, ఎంజే శ్రీరామ్‌లు ఈ చిత్రంలో కీలకపాత్రలు పోషించగా.. ఫిల్మ్ వర్క్స్ బ్యానర్‌పై విజయ్ చందర్ నిర్మించారు. శ్యామ్ సీఎస్ స్వరాలు సమకూర్చగా.. కేఏ శక్తివేల్ సినిమాటోగ్రఫీ అందించారు. గతేడాది మార్చి 2న గార్డియన్ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

ఇంటీరియర్ డిజైనర్‌గా పనిచేసే అపర్ణ (హన్సిక) ఓ ప్రమాదానికి గురవుతుంది. ఈ సమయంలో ఆమెను ఓ అమ్మాయి ఆత్మ పట్టుకుంటుంది. అపర్ణ సాయంతో తనకు జరిగిన అన్యాయంపై ఆ అమ్మాయి పగ సాధిస్తుంది. అసలు ఆ ఆత్మ ఎవరు? అపర్ణ శరీరంలోకే ఎందుకు ప్రవేశించింది? ఆత్మ కారణంగా అపర్ణ ఎలాంటి పరిణామాలను ఎదుర్కోవాల్సి వచ్చింది? అనేది గార్డియన్ సినిమా కథ. కెరీర్‌లో గ్లామరస్ రోల్స్‌కే పరిమితమైన హన్సిక తొలిసారిగా సీరియస్ రోల్‌లో అద్భుత ప్రదర్శన చేసిందని విమర్శలకు ప్రశంసించారు. అయితే ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్‌గా నిలిచింది. ఈ సినిమా లాంగ్ రన్‌లో కేవలం 32 లక్షల నెట్ మాత్రమే రాబట్టినట్లు సాక్ నిల్క్ వెబ్ సైట్ పేర్కొంది.

నిన్న మొన్న వచ్చిన సినిమాలే కూడా వారం తిరిగే లోపే ఓటీటీలోకి వచ్చి అక్కడ సక్సెస్ కొడుతున్నాయి. కానీ హన్సిక నటించి గార్డియన్ మాత్రం ఓటీటీలోకి రావడానికి ఏడాదికి పైగా సమయం తీసుకుంది. అనివార్య కారణాలతో ఈ సినిమా ఓటీటీ వాయిదా పడుతూ వచ్చింది. తమిళంలో అందుబాటులోకి వచ్చిన గార్డియన్.. తాజాగా తెలుగులో ఎంట్రీ ఇచ్చినట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. గార్డియన్ తెలుగు వెర్షన్ ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్‌కు అందుబాటులోకి వచ్చింది. అయితే ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండానే గార్డియన్ ఓటీటీలో కనిపించడంతో ప్రేక్షకులు షాక్ అయ్యారు. మరి థియేటర్‌లో ఫెయిలైన గార్డియన్ .. ఓటీటీలో ఏ మేరకు ఆదరణ దక్కించుకుంటుందో చూడాలి.

More from Filmibeat

Read more about: hansika motwani ott news
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X