Guntur kaaram OTT: గుంటూరు కారం ఓటీటీ డేట్ వచ్చేసింది.. థియేటర్‌లో చూపించనివి కూడా!

సూపర్ స్టార్ మహేశ్ బాబు.. ఈ పేరుకు పెద్దగా పరిచయం అవసరం లేదు. దీనికి కారణం తెలుగు చిత్ర పరిశ్రమలో అతడు సుదీర్ఘ కాలంగా స్టార్‌గా హవాను చూపిస్తూ దూసుకుపోతోన్న హీరో కావడమే. దాదాపు పాతిక సంవత్సరాలుగా తనదైన సినిమాలతో సందడి చేస్తోన్న అతడు.. ఈ సంక్రాంతికి 'గుంటూరు కారం' అనే చిత్రంతో ఆడియెన్స్‌ను పలకరించిన విషయం తెలిసిందే.

సూపర్ స్టార్ మహేశ్ బాబు నటించిన తాజా చిత్రమే 'గుంటూరు కారం'. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ తెరకెక్కించిన ఈ సినిమా ఎన్నో అంచనాలతో జనవరి 12వ తేదీన గ్రాండ్‌గా రిలీజ్ అయింది. అయితే, ఈ మూవీకి ఆరంభంలోనే మిక్స్‌డ్ టాక్ వచ్చింది. అయినప్పటికీ దీనికి వసూళ్లు భారీగానే లభించాయి. ఆ తర్వాత కూడా ఇది మంచి స్పందనను దక్కించుకుంది.

Guntur kaaram Movie Streaming on Netflix From February 9th

'గుంటూరు కారం' మూవీకి రెండో వారం నుంచి రెస్పాన్స్ సన్నగిల్లింది. ఫలితంగా ఇది ఆశించిన రీతిలో వసూళ్లను అందుకోలేదు. ఫలితంగా దాదాపు రూ. 20 కోట్ల నష్టాలతో ఈ చిత్రం నిరాశ పరిచింది. ఇక, థియేటర్లలో అంతగా సత్తా చాటలేకపోయిన 'గుంటూరు కారం' మూవీ డిజిటల్ స్ట్రీమింగ్‌పై ఎన్నో రకాల వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలో తాజాగా దీనిపై క్లారిటీ వచ్చింది.

సూపర్ స్టార్ మహేశ్ బాబు నటించిన 'గుంటూరు కారం' మూవీకి సంబంధించిన డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్‌ను ఫేమస్ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్ దక్కించుకున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాను సదరు సంస్థ నెల రోజుల తర్వాతనే స్ట్రీమింగ్ చేస్తుందని వార్తలు వచ్చాయి. కానీ, దీన్ని ఫిబ్రవరి 9వ తేదీ నుంచే అందుబాటులోకి తీసుకు వస్తున్నట్లు నెట్‌ఫ్లిక్స్ తాజాగా ప్రకటించింది.

Guntur kaaram Movie Streaming on Netflix From February 9th

క్రేజీ కాంబినేషన్‌లో రూపొందిన 'గుంటూరు కారం' మూవీ స్ట్రీమింగ్ డేట్ వచ్చిన వెంటనే దీనిపై మరింత సమాచారం లీకైంది. దీని ప్రకారం ఇందులో ఓ కబడ్డీ ఫైట్‌తో పాటు మదర్ సెంటిమెంట్ సాంగ్‌ను కూడా యాడ్ చేస్తున్నారని తెలుస్తోంది. అంటే థియేటర్‌లో చూపించిన వెర్షన్ కంటే ఎక్కువ నిడివితో ఈ సినిమాను నెట్‌ఫ్లిక్స్ స్ట్రీమింగ్ చేయబోతుందని చెప్పాలి.

ఇదిలా ఉండగా.. 'గుంటూరు కారం' చిత్రాన్ని హారిక హాసినీ క్రియేషన్స్ బ్యానర్‌పై రాధాకృష్ణ నిర్మించారు. శ్రీలీల, మీనాక్షి చౌదరి ఇందులో హీరోయిన్లుగా నటించారు. థమన్ ఈ సినిమాకు మ్యూజిక్ ఇచ్చాడు. ఇక, ఇందులో ప్రకాశ్ రాజ్, జగపతిబాబు, జయరాం, రమ్యకృష్ణలు కీలక పాత్రల్లో నటించారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X