లిప్ కిస్‌తో రెచ్చిపోయిన గుప్పెడంత మనసు జగతి: బీచ్‌లో ఆ కుర్రాడితో మితిమీరిన రొమాన్స్
తెలుగు బుల్లితెరపై వేరే భాషలకు చెందిన ఎంతో మంది నటీమణులు సందడి చేస్తున్నారు. కానీ, అందులో చాలా అంటే చాలా తక్కువ మంది మాత్రమే భారీ స్థాయిలో ఫాలోయింగ్‌ను ఏర్పరచుకుంటున్నారు. అలాంటి వారిలో 'గుప్పెడంత మనసు' ఫేం జ్యోతి రాయ్ ఒకరు. చాలా కాలంగా నటిగా సత్తా చాటుతోన్న ఈ భామ.. ఇప్పుడు ఎన్నో అవకాశాలను దక్కించుకుంటూ ముందుకు సాగుతోంది. ముఖ్యంగా జ్యోతి రాయ్ సోషల్ మీడియాలో రచ్చ లేపుతోంది. ఈ నేపథ్యంలో తాజాగా ఆమె ఓ రొమాంటిక్ పిక్ షేర్ చేసింది. అసలు అది ఏంటో మీరే చూసేయండి!
అలా వచ్చి పాపులారిటీ : కన్నడ భామ జ్యోతి రాయ్ ముందుగా మోడల్‌గా కెరీర్‌ను ప్రారంభించింది. ఆ రంగంలో తనదైన గ్లామర్‌తో మాయ చేసేసింది. ఈ క్రమంలోనే 'బందె బరాటవ కాలా' అనే సీరియల్ ద్వారా నటిగా ప్రయాణాన్ని మొదలు పెట్టింది. ఈ తర్వాత అదే భాషలో పలు సీరియళ్లను కూడా చేసింది. అనంతరం తమిళం, తుళు భాషల్లో కూడా చాలా ధారావాహికల్లో నటించి పాపులర్ అయింది.

తెలుగులో జగతిగా క్రేజ్ : సౌత్ ఇండియాలో సీరియల్ నటిగా సెన్సేషన్ అయిపోయిన జ్యోతి రాయ్.. చాలా ఏళ్ల క్రితమే 'కన్యాదానం' అనే సీరియల్‌తో తెలుగులోకి కూడా అడుగు పెట్టింది. ఆ తర్వాత చాలా గ్యాప్ తీసుకుని 'గుప్పెడంత మనసు'తో మరోసారి తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. ఇందులో జగతి అనే పాత్రలో జీవించేసి ఎనలేని పాపులారిటీని, క్రేజ్‌ను సొంతం చేసుకుంది.
వరుస ఆఫర్లతో బిజీగా : చాలా కాలంగా నటిగా సత్తా చాటుతోన్న జ్యోతి రాయ్.. సినిమాల్లోకి సైతం ఎంట్రీ ఇచ్చింది. ఈ క్రమంలోనే ఈ అమ్మడు 'సీతారామ కల్యాణ', 'స్టేషన్ 3', 'దియ వర్ణపాటల' వంటి చిత్రాలను చేసింది. అలాగే, 'దియా', 'గంధాడ్ గుడి', '99', 'మడిపు' వంటి వెబ్ సిరీస్‌లలో నటించింది. ఇప్పుడు కూడా కొన్నింటిలో నటించేందుకు సన్నద్దం అవుతోంది.

యంగ్ డైరెక్టర్‌తో లవ్ : 20 ఏళ్ల వయసులో ఉన్నప్పుడే జ్యోతి రాయ్.. పద్మనాభ అనే వ్యక్తిని వివాహం చేసుకుంది. ఆ తర్వాత ఓ బాబుకు కూడా జన్మనిచ్చింది. అనంతరం భర్తకు విడాకులు ఇచ్చేసింది. అయితే, ఇప్పుడు జ్యోతి రాయ్.. సుకు పుర్వాజ్ అనే యంగ్ డైరెక్టర్‌తో లవ్ ట్రాక్‌ను సాగిస్తోంది. కొద్ది రోజుల క్రితమే వీళ్లిద్దరూ ఎంగేజ్‌మెంట్ కూడా చేసుకుని వివాహానికి సిద్ధం అయిపోతున్నారు.
ఆ సిరీస్‌లో నటిస్తోంది : సుమారు రెండు దశాబ్దాలుగా వరుస పెట్టి సినిమాలు, సీరియళ్లు, వెబ్ సిరీస్‌లు చేస్తూ ఫుల్ బిజీగా గడుపుతోన్న జ్యోతి రాయ్ ఇప్పుడు 'నో మోర్ సీక్రెట్స్' (No More Secrets) అనే వెబ్ సిరీస్‌లో నటిస్తోంది. విజయ్ కుడికుల తెరకెక్కిస్తున్న ఈ సిరీస్‌ను పార్థి రెడ్డి, జీవన్ రెడ్డి, సంఘమిత్రలు నిర్మిస్తున్నారు. ఇందులో జ్యోతికి జోడీగా కృనాల్ కపూర్ నటిస్తున్నాడు.

ఫస్ట్ లుక్‌తో సెన్సేషన్ : తెలుగు, ఇంగ్లీష్, హిందీ భాషల్లో రూపొందుతోన్న 'నో మోర్ సీక్రెట్స్' (No More Secrets) వెబ్ సిరీస్‌కు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ తాజాగా విడుదలైంది. ఇందులో జ్యోతి రాయ్ హీరోకు లిప్ కిస్ పెట్టి రెచ్చిపోయింది. బీచ్‌లో వీళ్లిద్దరూ పెట్టిన రొమాంటిక్ ఫోజుకు ప్రేక్షకులంతా షాక్ అవుతున్నారు. దీంతో ఈ పోస్టర్‌కు భారీ రెస్పాన్స్ వచ్చి వైరల్‌గా మారిపోయింది.


Click it and Unblock the Notifications











