15 రోజుల్లోనే OTTలోకి రాబోతున్న జీవీ ప్రకాష్ మూవీ, కడుపుబ్బా నవ్వించే ఈ సినిమాను అలా చూసేయండి!
ఈ మధ్య కాలంలో అనేక అదిరిపోయే సినిమాలు ఓటీటీలోకి వచ్చేస్తూ సినీ ప్రియులను తెగ అలరిస్తున్నాయి. ముఖ్యంగా సూపర్ హిట్ సినిమాలతో పాటు అంతకు మించిన వెబ్ సిరీస్ లు.. వచ్చేస్తూ టైమ్ పాస్ అయ్యేలా చేస్తున్నాయి. ముఖ్యంగా చిన్నా, పెద్ద సినిమాలు అనే తేడా లేకుండా నెల రోజుల్లోపే ఓటీటీలోకి వచ్చేస్తున్నాయి. ఇలా ప్రతీవారం తెగ ఎంటర్ టైన్ చేసేందుకు ఎప్పుడూ సిద్ధంగా చాలా సినిమాలే ఉంటుండగా.. తాజాగా మరో క్రేజీ మూవీ ఓటీటీలోకి వచ్చేస్తుంది. ముఖ్యంగా సినీ ప్రియులు అందరినీ కడుపుబ్బా నవ్వించేందుకు ఓ అద్భుతమైన సినిమా రాబోతుంది. ఆ సినిమా ఏంటి, ఎక్కడ స్ట్రీమింగ్ కాబోతుందో మనం ఇప్పుడు తెలుసుకుందాం.
ఆనంద్ రవిచంద్రన్ దర్శకత్వంలో.. జీవీ ప్రకాష్, ఐశ్వర్యా రాజేశ్ హీరోహీరోయిన్లుగా రీసెంట్ గా వచ్చిన సినిమానే "డియర్". హీరోహీరోయిన్లతో పాటు ఇళవరసు, గీతా కైలాశం, అబ్దూల్ లీ, నందిని, రోహిణి, కాలి వెంకట్, తళైవాసల్ విజయ్ వంటి వాళ్లు ప్రధాన పాత్రల్లో నటించి మెప్పించారు. ఏప్రిల్ 12వ తేదీన థియేటర్లలో గ్రాండ్ గా విడుదల అయిన ఈ సినిమాను గుడ్ నైట్ అనే సినిమా కథతో తీశారు. సేమ్ టు సేమ్ అదే కథతో వచ్చిన ఈ సినిమాను చూసేందుకు చాలా మంది ఆసక్తి చూపించలేదు.

ముఖ్యంగా గుడ్ నైట్ సినిమా అన్ని భాషల్లో ఓటీటీలో అందుబాటులో ఉండడం.. దానికే మంచి టాక్ రాగా అందరూ చూసేయడంతో.. ఈ సినిమాకు అదే పెద్ద మైనస్ గా మారింది. అలా థియేటర్ల నుంచి త్వరగా వెళ్లిపోయిన ఈ సినిమాను ప్రస్తుతం ఓటీటీలోకి తీసుకు వచ్చేందుకు ప్లాన్ చేస్తున్నారు. ముఖ్యంగా ప్రముఖ ఓటీటీ దిగ్గజం అయిన నెట్ ఫ్లిక్స్ వేదికగా ఈ సినిమాను స్ట్రీమింగ్ చేయబోతున్నట్లు ఆ సంస్థ ఎక్స్ వేదికగా ప్రకటించింది. రెండు వారాలకే ఓటీటీలోకి తీసుకు వస్తుండడంతో అంతా షాక్ అవుతున్నారు.
డియర్ అనే సినిమా నెట్ ఫ్లిక్స్ వేదికగా ఏప్రిల్ వ తేదీ నుంచి స్ట్రీమింగ్ చేయబోతున్నారు. కొత్తగా పెళ్లైన జంట తామిద్దరికీ ఉన్న సమస్యలతో ఎలా ఇబ్బంది పడ్డారన్న కథతో ఈ సినిమా తెరకెక్కింది. ముఖ్యంగా కాస్త సౌండ్ ను కూడా తట్టుకోలేని హీరో.. గురక సమస్యతో బాధ పడుతున్న హీరోయిన్ ను పెళ్లి చేసుకుంటాడు. వీరిద్దరి మధ్య ఎలాంటి సమస్యలు ఎదురయ్యాయి.. చివరకు ఏం జరిగిందనే కథతో ఈ సినిమా తెరకెక్కింది. ఇప్పటి వరకు గుడ్ నైట్ సినిమాను చూడకపోయినా.. జీవీ ప్రకాశ్, ఐశ్వర్యా రాజేష్ ల నటన ఎలా ఉందో తెలుసుకోవాలనుకున్నా కచ్చితంగా మీరు ఈ సినిమాను చూసేయండి. ఫుల్ గా ఎంజాయ్ చేసేయండి.


Click it and Unblock the Notifications











