సడెన్‌గా OTTలోకి వచ్చేసిన రియల్ పొలిటికల్ థ్రిల్లర్.. ఎక్కడ స్ట్రీమింగ్ కానుందంటే?
ఈ మధ్య కాలంలో ఓటీటీల హవా పెరిగిపోయింది. అనేక అదిరిపోయే సినిమాలు ఓటీటీల వేదికగా త్వరగా వస్తుండగా... చాలా మంది ఓటీటీలపై మరింత ఆసక్తి కనబరుస్తున్నారు. చిన్న చిత్రాలతో పాటు పెద్ద సినిమాలు కూడా నెల కాకముందే వస్తుండగా.. ఫ్యామిలీతో కలిసి కూర్చుని మరీ తమకు నచ్చిన చిత్రాలు చూస్తూ ఎంజాయ్ చేస్తున్నారు. వీకెండ్ వచ్చిందో లేదో అదిరిపోయే సినిమాలు ఓటీటీలోకి వచ్చి సినీ ప్రియులను సర్ ప్రైజ్ చేస్తున్నాయి. ముఖ్యంగా ఓ రియల్ పొలిటికల్ థ్రిల్లర్ మూవీ సడెన్ గా ఓటీటీలోకి వచ్చింది. అయితే ఆ సినిమా ఏంటి, ఎక్కడ స్ట్రీమింగ్ అవుతుందో మనం ఇప్పుడు తెలుసుకుందాం.
మ్యూజిక్ డైరెక్టర్ జీవీ ప్రకాష్ హీరోగా వచ్చిన రీసెంట్ రియల్ పొలిటికల్ థ్రిల్లర్ రెబల్. ఈ సినిమాలో హీరోయిన్ గా ప్రేమలు క్యూట్ బ్యూటీ మమితా బైజు నటించి మెప్పించింది. అదిరిపోయే కాన్సెప్ట్ తో వచ్చిన ఈ సినిమాలో అథిర, ఆదిత్య భాస్కర్, కరుణాస్, షాలు రహీమ్, సుబ్రహ్మణ్యం శివ, వెంకిటేష్ వీపీ, కల్లూ వినోద్ వంటి వాళ్లు ప్రధాన పాత్రల్లో నటించారు. నిఖేష్ ఈ సూపర్ సినిమాకు దర్శకత్వం వహించగా.. కేఈ జ్ఞానవేల్ రాజా ప్రొడ్యూసర్ గా వ్యవహరించారు.

అలాగే ఈ చిత్రానికి అరుణ్ కృష్ణ, రాధాకృష్ణన్, వెట్రే క్రిష్ణనమ్ వంటి టాప్ టెక్నీషియన్లు పని చేశారు. రెబల్ అనే సినిమా 1980లో జరిగన వాస్తవ సంఘటనల ఆధారంగా తెరకెక్కించారు. ముఖ్యంగా ఈ సినిమా చిత్తూరు, పాలక్కాడ్‌లో ఉన్న కళాశాల చుట్టూ సాగుతుంది. ప్రధానంగా మలయాళీ వాతావరణంలో ఉన్న కొద్దిమంది తమిళ విద్యార్థులలో ఒకరైన కధీర్ (జీవీ ప్రకాష్) మమిత బైజుతో ప్రేమలో పడడం చుట్టూనే కథంతా తిరుగుతుంది. అప్పటి వరకు బాగానే ఉన్న విద్యార్థుల మధ్య.. ముఖ్యంగా తమిళులు, మలయాళీల మధ్య గొడవ ప్రారంభం అవుతుంది.

ఈ గొడవను వాడుకుని పలువురు రాజకీయ నాయకులు లబ్ధి పొందాలని చూస్తారు. ఇలా చివరకు జీవీ ప్రకాష్ ప్రేమ గెలిసిందా.. హింస ఆగిపోయిందా లేదా అనేది తెలియాలంటే మాత్రం సినిమా చూడాల్సిందే. మార్చి 22వ తేదీన థియేటర్లలో గ్రాండ్ గా విడుదల అయిన ఈ సినిమా పర్వాలేదనిపించింది. పాజిటివ్ టాక్ వచ్చినా పెద్దగా వసూళ్లు మాత్రం సాధించలేకపోయింది. అయితే నెల కూడా కాకముందే ఈ సినిమా సడెన్ గా ఓటీటీలోకి వచ్చేసింది.
ప్రముఖ ఓటీటీ దిగ్గజం అయిన అమెజాన్ ప్రైమ్ వీడియో వేదికగా ఈ సినిమా స్ట్రీమింగ్ అవుతుంది. మార్చి 6వ తేదీ రాత్రి నుంచి ఈ సినిమా అందుబాటులోకి రాగా.. చాలా మంది ఈ సినిమాను ఆసక్తిగా చూస్తున్నారు. ముఖ్యంగా జీవీ ప్రకాష్, మమితా బైజులు హీరోహీరోయిన్లుగా నటించడంతో చాలా మంది మరింత ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. వీకెండ్ లో ఫ్యామిలీతో కలిసి ఫుల్ గా ఎంజాయ్ చేయాలంటే ఈ రియల్ పొలిటికల్ క్రైమ్ థ్రిల్లర్ ను కచ్చితంగా చూడాల్సిందే.


Click it and Unblock the Notifications











